దీపావళి పండుగ రోజు రక రకాల వంటలు వండుకొని కుటుంబ సభ్యులే కాదు..ఇంట్లోకి వచ్చిన అతిథులకు కూడా తినిపిస్తారు.  తాము చేసిన వంటగాల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.  దీపావళి సందర్భంగా స్పెషల్ గా చెక్కెర కోవా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

1 కప్పు పంచదార
పావు కేజీ పచ్చికోవా
1 కప్పు మైదా
1 కప్పు పాల విరుగుడు
అరకేజీ నూనె
అర కప్పు జీడిపప్పు
పావు టీ స్పూన్ జాపత్రి పొడి
చిటికెడు రెడ్ ఫుడ్ కలర్

తయారు చేయు విధానం : 

- తాజా కోవాలో పాలవిరుగుడు, మైదా వేసి బాగా కలపాలి.
 - ఫుడ్ కలర్, జాపత్రిపొడి వేసి మరోసారి కలపాలి.
- ఈ కలిపిన కోవాను చిన్న చిన్న ఉండలుగా చుట్టే ముందు దాని మధ్యలో జీడిపప్పు ముక్కను ఉంచి 3 అంగుళాల పొడవుగా ఉండేటట్టు ఉండగా చుట్టాలి.
- స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి అయ్యేలోపు పక్కన పంచదార పాకం పట్టాలి.
- ఇప్పుడు కాగే నూనెలో ఈ ఉండను వేసి చిన్న మంటమీద ఎర్రగా వేయించాలి. వేగిన వెంటనే ముందుగా సిద్దం చేసుకున్న పాకంలో వేయండి.
- ఇలా తయారు చేసిన ఉండలను 2 గంటలవరకు పాకంలోనుంచి బయటకు తీయాలి.
- ఇప్పుడు ఒక ప్లేట్ లో చెక్కర వేసి అందులో ఈ కోవా ఉండలను దొర్లించండి అంతే కోవా చెక్కెర లడ్డు రెడీ


మరింత సమాచారం తెలుసుకోండి: