కావాలసిన పధార్థాలు : పనీర్ : 50 గ్రాములు  బంగాళదుంప 1/4కిలో టామోటోలు : 3 చిన్నవిః పాలు : 1/2 కప్పు ఉల్లిపాయలు : 2 చిన్నవి.(ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి ఉంచుకోండి. కారట్, బఠానీలు, బీన్స్, : 1 కప్పు పసుపు : ½ చెంచా  కారప్పొడి :1/2టేబుల్ స్పూన్, ధనియాలు పొడి : 1టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి కలిపి ముద్ద : ½ టేబుల్ స్పూన్ గరం మసాలా : 1/2 టేబుల్ స్పూన్  నెయ్యి : 1 ½ టేబుల్ స్పూన్ టూటీప్రూట్, జీడిపప్పు, కిస్మీస్, అనాసపండు : అన్ని పావు కప్పు  ఉప్పు: తగినంత క్రీమ్ : 1 టేబుల్ స్పూన్

 తయారుచేయు విధానం :  పనీర్ ని నేనెలో వేయించి పెట్టుకోండి బంగళాదుంపలు ఉడికించి వార్చి తీసి కట్ చేసి ఉంచండి.  టామోటా తప్ప మిగతా కూరలను ఉడికించి వార్చి ఉంచాలి. టొమోటోలను భాగా ఉడికించి, దాని తోలు తీసి మెత్తగా రుబ్బి ఉంచుకోండి.  ఆపై బాండీలోను నెయ్యి వేసి అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేయించండి.  

ఇందులోనే టామోటో ముద్ద, ధనియాలపొడి, పసుపు, కారంపొడి, గరంమసాలాతోపాటు ఉప్పు కూడా కలపండి. ఆపై కూరలు కలిపి ఉడికించండి. చిక్కపడిన గ్రేవీలో మిల్క్ క్రీమ్ కూడా కలపి ఓ నిమిషం మరిగించండి.  అందులో టూటీప్రూట్, కిస్మీస్, అనాసపండు ముక్కలు కలపండి జీడిపప్పు వేయించి అందులో వేయండి. చివరగా కొత్తిమీర చల్లి దించుకోండి.  వేడివేడి మీ రోటీల్లోకి నంచుకోవటమే తరువాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: