డిసెంబర్ నెల వస్తుందంటే చాలు ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ వేడుకల్లో మునిగిపోతుంటారు.  రక రకాల డెకరేషన్స్, వస్తువులు, వంటలు, కొత్త బట్టలతో సంబరాలు చేసుకుంటారు.  భారత దేశంలో అయితే రుచికరమైన వంటకాలతో బంధువులను పిలిచి సంబరాలు చేసుకుంటారు.  క్రిస్మస్ వేడుకల సందర్భంగా  రుచికరమైన ఎగ్‌ లెస్ కర్డ్ కేక్ ఎలా తయారు చేస్తారో చూద్దామా..

 కావలసిన పదార్థాలు:

మైదా: 2cups

చిక్కటి పెరుగు: 1 కప్పు

పంచదార: 1 కప్పు

బేకింగ్ పౌడర్: 1 

వంటసోడా: 1/2 టీ స్పూన్

వెనిలా ఎసెన్స్:1 టీ స్పూన్

తయారు చేయు విధానం :

1. ముందుగా మైదాను జల్లించి, పక్కన ఉంచాలి. చిక్కటి పెరుగుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, పంచదార, కూడా వేసి పూర్తిగా కరిగేలా కలపాలి.

2. బేకింగ్ పౌడర్‌, వెనిలా ఎసెన్స్‌ లను ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమంలో బుడగలు వస్తుండగా, కొద్ది కొద్దిగా మైదా పిండి వేస్తూ ఉండలు కట్టకుండా, జారుగా కలుపుకోవాలి. 

3. మిశ్రమం గట్టిగా ఉందనిపిస్తే.. మరికొంత పెరుగు వేసి కలుపుకోవచ్చు. తరువాత నెయ్యిరాసి ఉంచిన బేకింగ్ టిన్‌ లో, పై మిశ్రమాన్ని పోయాలి. 

4. ముందుగానే వేడి చేసి ఉంచిన మైక్రో‌ఓవెన్‌ లో 50 నిమిషాల పాటు 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించాలి. 

5. కేక్ ఉడికిందో లేదో చాకుని మౌల్డ్ మధ్యలో గుచ్చితే పిండి అంటకుండా ఉండాలి. కేక్ ఉడికినట్లయితే.. ఓవెన్‌ ను ఆఫ్ చేసి 5 నిమిషాల తరువాత బయటకు తీయాలి. బయటి వాతావరణంలో పది నిమిషాలపాటు చల్లబర్చి, పాత్ర నుండి బయటకు తీసి ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే ఎగ్‌లెస్ కర్డ్ కేక్ రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: