ప్రపంచంలో క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు  క్రిస్ మస్ ట్రీ, కొత్త బట్టలు ఇతరత్రా అన్నీ రెడీ చేసుకునేందుకు సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.  చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు.  ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా తమకు ఇష్టమైన వంటలు చేసుకొని తమ బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటారు.  క్రిస్మస్ పండుగ సందర్భంగా రక రకాల కేకులు, స్వీట్లు  తయారు చేసుకొని తింటుంటారు.  క్రిస్మస్ సందర్భంగా  మిల్క్ స్వీట్ ఏలా చేసుకోవాలో చూద్దామా..


కావలసిన పదార్థాలు:
పంచదార : 4కప్పులు,
పాలు : 5కప్పులు,
బొంబాయి రవ్వ : 1కప్పు,
నెయ్యి - 11/2 కప్పు.


తయారీ విధానం:
ముందుగా పాలు, బొంబాయిరవ్వ, పంచదార, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు ఉంచి నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. ఆపైన కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నోరూరించే  మిల్క్ స్వీట్ రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: