సంక్రాంతి వేడుకలు కొత్త బట్టలు..కోడి పందాలు, ఎడ్ల పందాలే, గాలి పటాల సందడే కాదు రక రకాల పిండి వంటల జోరు కూడా ఉంటుంది.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వస్తుందంటే..కొత్త కొత్త పిండి వంటలు చేసుకొని బంధువులు, సన్నిహితులతో ఆనందంగా ఆరగిస్తుంటారు.  ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా బంగాలదుంపతో స్వీట్ హల్వా ఎలా చేసుకోవాలతో తెలుసుకుందామా..


కావలసిన పదార్థాలు:

బంగాళదుంపలు: 10 (ఉడికించి పెట్టుకోవాలి) 
చక్కెర : 1/4 కప్
బాదం : పప్పులు (సరిపడేంత)
పిస్తా : పిస్తా (2 లేదా 3 ముక్కలుగా చేసుకోవాలి)
నెయ్యి: 3 టేబుల్ స్పూన్స్


తయారుచేయండి ఇలా :
మొదటగా బంగాళదుంపలను నీటిలో ఉడికించి, తర్వాత పొక్కు తీసి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనుమును స్టౌ మీద ఉంచి, అందులో కొంచెం నెయ్యి పోసి వేడి చేయాలి. అలా వేడి చేసిన నెయ్యిలో మెత్తగా చిదిమిన బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేయాలి. 
అలా ప్రతి నిముషానికోసారి పెనుముకు అంటుకోకుండా మిక్స్ చేస్తూ వుండాలి. అలా చేసిన తరువాత పంచదారను వేసి దానిని కూడా పూర్తిగా కరిగేవరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న హల్వాను స్టౌ నుంచి కిందకు దించి, దానిపై బాదం, పిస్తాలు పప్పులు వేసుకోవాలి. అంతే శక్తివంతమైన, రుచికరమైన హల్వా తయార్.


మరింత సమాచారం తెలుసుకోండి: