కావలసిన పదార్థాలు : మటన్ : ఒక కేజీ  జీడిపప్పు : అరకప్పు అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర కప్పు ఉల్లిపాయలు : అరకప్పు మిర్చి పౌడర్ : నాలుగు టీ స్పూన్లు పసుపు పొడి : ఒక టీ స్పూన్  దాల్చిన చెక్కలు : రెండు  కొబ్బరి తురుము: అర కప్పు  నూనె, ఉప్పు : తగినంత  


తయారీ విధానం: ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ఉల్లి ముక్కలు, కొబ్బరి తురుము, జీడిపప్పును మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన బెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్కను వేసి వేపాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చాలి.


తర్వాత శుభ్రం చేసిన మటన్ ముక్కల్ని కూడా కలుపుకోవాలి. తర్వాత మటన్ ఫ్రై మసాలా కలిపి బాగా ఉడికించాలి. మటన్ ముక్కలు బాగా ఉడికాక నీరు ఇంకే వరకు ప్యాన్‌లో ఫ్రై చేసుకుని.. కోకోనట్ రైస్, వెజ్ బిర్యానీలకు సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: