కావలసినవి  హాంగ్ కర్డ్ ( పలుచని గుడ్డలో పెరుగు వేసి, వడకట్టి,నీరు తీసేసినది) 250 గ్రా  చాట్ మసాలా 15గ్రా.  ఉప్పు రుచికి తగినంత నల్ల ఉప్పు రుచికి తగినంత పచ్చిమిర్చి తరుగు రెండు టీస్పూన్లు  గసగసాలు 60గ్రా నెయ్యి వేయించడానికి సరిపడా  ఎండిన ఆప్రికాట్ 5 బ్రెడ్ 2 స్లైసులు  వేయించిన శనగల పొడి 2 టీ స్పూన్లు  తయారీ ఆప్రికాట్స్ ను గంట సేపు నానబెట్టాలి. లోపలి గింజ తీసి పక్కన ఉంచాలి. గసగసాలను నీటిలో అరగంట నానబెట్టి, నీళ్లన్నీ పోయేలా చేయాలి. ఒక పాత్రలో పెరుగు, చాట్ మసాలా, ఉప్పు, నల్ల ఉప్పు, పచ్చిమిర్చి,శనగల పొడి, బ్రెడ స్లైసులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని, గింజ తీసేసిన ఆప్రికాట్ లో నింపి పట్టీస్ ను తయారు చేయాలి కడాయిలో నెయ్యి పోసి, కాగనివ్వాలి తయారు చేసిన పట్టీస్ ను గసగసాలలో అద్ది, కాగిన నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీయాలి పుదీనా చట్నీతో దహీకబాబ్ తింటే ఎంతో రుచిగా ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: