సృష్టి రహస్యం తెలిసిన మనిషి తన పుట్టుకకు కారణం అయిన మహిళను ఏవిధంగా చూస్తున్నాడు.. అసలు ఆడ మగా అనేది లింగ బేధమే కారణం అయినా మగవాడి మాటనే ఆడవాళ్లు వినాలని ఓ అహంకారంతో మనుషుల ప్రవర్తన ఉంటుంది.  ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదిగిన మహిళా శక్తిని గుర్తించకపోతే ఏ దేశం ముందుకు నడవ లేదని ఎన్నో ఉదహారణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మాటలలో మహిళా శక్తిని నిర్వచించాలి అంటే ‘మహిళా సాధికారికత ఒక మంచి దేశ అభివృద్ధికి, పునర్నిర్మాణానికి ఎంతో అవసరం. 

Image result for మహిళా దినోత్సవం apherald

సమాజ అభివృద్ధి మహిళల అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది’ అని అంటారు అబ్దుల్ కలామ్. ఒక దేశం మంచి దేశంగా అభివృద్ధి చెందాలి అంటే మంచి సమాజం కావాలి అటువంటి సమాజం రావాలి అంటే మంచికుటుంబాలు దేశం అంతా ఏర్పడాలి. 'మహి'ళ లో ఉన్న మహిమే మనిషిని నడిపిస్తుంది అన్నది గుర్తించలేని మనుషులున్న ఈ లోకంలో అలాంటి మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియట్లేదు. ఒక అమ్మాయి స్కూల్ కు వెళ్ళి చదువు కోవడం వల్ల కేవలం ఆమెకు వచ్చే జ్ఞానం ఆమెకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె ద్వారా ఆమె కుటుంబానికి అదే విధంగా సమాజానికి మేలు జరుగుతుంది. 

Image result for మహిళా దినోత్సవం apherald

 ప్రేమను పంచినా, జీవితాన్ని త్యాగం చేసినా అది మహిళ వల్లే అవుతుంది తప్ప మరెవరి వల్లా కాదు. ఒక్క తాళి మెడలో పడ్డ కారణం చేత ఒక మగవాడికి జీవితాంతం తనతో ఉంటూ తన జీవితాన్నే త్యాగం చేసే మాతృ మూర్తులు ఆడవారు. ఆడదే కదా అని చిన్న చూపు చూస్తే ఆది పరాశక్తి అయ్యి అదః పాతాలానికి తొక్కేస్తుంది. ప్రపంచంలో, దేశంలో మహిళా అభ్యున్నతి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఎక్కడో ఓ చోట మహిళ అంద కారంలో చిక్కుకుంటూనే ఉంది. మన దేశంలో ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగినా మరిన్ని సంస్కరణలు చేపట్టినా పురుషాధిక్య సమాజంలో మహిళ ఇంకా స్వేఛ్చ కోసం పోరాడుతూనే ఉన్నది అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: