నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.  ఒకప్పుడు ఆదిమానవుల కాలంలో మహిళలదే ఆదిపత్యం ఉండేది. రాను రాను పురుషాదిక్యతతో మహిళలపై అధికారం చెలాయించడం ప్రారంభించారు..కొంత కాలానికి మహిళను కట్టు భానిసలుగా మార్చారు.  కానీ ఇప్పుడు కాలం మారింది..మహిళలు చైతన్య వంతులు అవుతున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇంత అభివృద్ది చెందుతున్నా..ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలామంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారత మాతగా పేర్కొంటున్నాం.

Image result for సమాజంలో స్త్రీల పాత్ర

క్రీ.పూ. 6000 సంవత్సరాలకు పూర్వం నుండి అనగా సింధూనాగరికత కాలం నుండి భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే నేడు 1947, ఆగష్టు 15 అనంతర మేర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా ”భారతమాత” గా కొనియాడుత, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. భారతదేశంలో స్త్రీని గృహలక్ష్ష్మిగా, మాతృమూర్తిగా, హితైషిగా, దైవస్వరూపిణిగా వర్ణించి, ‘శ్రీ’ అంటూ స్త్రీని మంగళదేవతగా ప్రతి నామవాచకానికి ముందు, ప్రతి శుభకార్యానికి చేర్చి అవగాహన చేసే అత్యున్నత సాంప్రదాయం మనది అని అనేక మంది మహర్షులు మరియు ప్రాచీనులు, ఆధునికులు కూడా దీనిని నొక్కి చెప్పడం జరుగుతుంది.  భారత దేశంలో కూడా వివిధ రంగాల్లో విజయాలు సాధిం చిన మహిళలను సన్మానించడంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

Image result for సమాజంలో స్త్రీల పాత్ర

స్త్రీపురుష సమానత్వం, మహిళా సాధికారికత గురించి మనలో జాగరూకత కలిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి.  నిజానికి ప్రతి రోజూ మనం సమాజంలో స్త్రీల పట్ల వివక్షతను విడనాడి, మహిళా చైతన్యం కోసం, పురుషులతో సమానంగా స్త్రీకి అవకాశాలు కల్పించడం కోసం చర్యలు తీసుకున్నప్పుడే మహిళా దినానికి సార్థకత లభిస్తుంది. మహిళా అభ్యున్నతి, సాధికారికతలను సాధించాలంటే పురు షుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న దృష్టితో చూడడం అనేది కొన్ని సమాజాల్లో మామూలు విషయంగా మారింది. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం అన్న విషయాన్ని మనం మరిచిపోతున్నాం.


నాటికి , నేటికి ..స్త్రీల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గం లా భావించే మహిళలు  ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసి పోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు . అభినందించవలసిన విషయం .  విద్యారంగంలో బాలికలదే అగ్రస్తానం. ! ఆనందించవలసిన విషయం, వృత్తి విద్యాకోర్సులు , ఉద్యోగాలలో, రాజకీయాలలో , స్త్రీలకూ ప్రాముఖ్యత !! స్త్రీలు సమంగా , నేర్పుగా, అంకిత భావంతో పనిచేస్తారు .  ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది.

Image result for సమాజంలో స్త్రీల పాత్ర

స్త్రీ లేకుండా పురుషుడు లేడు. ఏటేటా విద్యావంతులైన స్త్రీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శిశు మరణాలరేటు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి 219 దేశాల సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికలో స్పష్టం చేసింది.  పిల్లలు పుట్టుకతోనే ఇంటా బయటా వివక్షకు గురవు తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మహిళలు భౌతికవాద, శాస్త్రీయ ధృక్పథం అలవర్చుకుని అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు వెళ్లాలని పిలుపునిస్తున్నారు ఎంతో మంది నాయకులు. 


స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అయితే స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నప్పటికీ, అసెంబ్లీలలో, పార్లమెంట్‌లో రిజర్వేషన్‌ను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆత్మ విశ్వాసం తో  ముందుకు అడుగు వేయాలి!!! అటువంటి సమ సమాజం గల అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించవలసిన సమయానికి … స్వాగతం పలుకుదాం…నేటి మహిళకు అభినందనలు తెలుపుదాం …

మరింత సమాచారం తెలుసుకోండి: