హైదరాబాద్‌ నగర జీవనంలో, తనకు ఎదురైన ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం వైద్యుల కోసం తిరిగీ తిరిగీ, చివరికి నయం కాక, నిరాశకు లోనైనా,
తట్టుకొని ఆత్మవిశ్వాసంతో తన సమస్యను తానే పరిష్కరించుకున్న  సీనియర్‌ జర్నలిస్టు   ఆరుదైన కథనం ఇది. .. చదవండి. 

 కనీసం ఒక 15 సంవత్సరాలుగా దినదినము క్షణక్షణము ఒంటినొప్పులతో, ఊపిరి చాలకపోవడం, మందకొడితనం ఇంకా ఇతర సమస్యలతో బాధపడిన, పడుతున్న జీవితం నాది. నొప్పులు లేకుండా ఉండటం ఎలా ఉంటుందో కూడా మర్చిపోయా. ఒక గంట సేపు తేలిగ్గా బతకగలిగితే, గంట తర్వాత చచ్చిపోయినా పర్లేదు అనుకున్న రోజులూ ఉన్నాయి. నేను తిరగని డాక్టర్ లేడు. కీళ్ల డాక్టర్తో మొదలు. మళ్ళీ మామూలోడు కాదు. గురవారెడ్డి! ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళా. మోకాళ్ళ చిప్పలమీద కొట్టి చూసి, ఏం లేదు పో, ఫలాని ఎక్సర్సైజులు రోజుకు 350 సార్లు చెయ్యి, అని పంపించాడు. ఎలాగూ చేయను అని తెలుసు కాబట్టి. మళ్లీ ఇది కాదు అని జనరల్ ఫిజిషియన్ తో మొదలు పెట్టా. అతను పెయిన్ కిల్లర్స్ వేసుకో, వాకింగ్ చెయ్యి అన్నాడు. పెయిన్ కిల్లర్ మానేసి వాకింగ్ మాత్రం చేశా. నో యూజ్. యోగా క్లాస్సెస్ కు కూడా వెళ్ళా. ఇంకెక్కువయ్యాయి. 
ఉస్మానియా లో చేసి రిటైర్ అయిన బాలరాజు అనే డాక్టర్ను జర్నలిస్టు మిత్రులు రికమెండ్ చేస్తే వెళ్ళా. కమీనా గాడు, కనీసం నాడి చూడకుండా, చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకోకుంటే వచ్చే మనోభ్రాంతుల గురించి లెక్చర్ ఇవ్వడం మొదలెట్టాడు. నీ జ్ఞానానికి నువ్వు డాక్టర్ గా కంటే పేరయ్య ఉద్యోగానికి పనికొస్తావని నేనూ నా కన్సల్టేషన్ ఇచ్చా. అదోపక్క నడుస్తుండగా మధ్య కాలంలో నా కెరీర్ గ్రోత్ మొత్తం భరించలేని నొప్పుల మధ్యే. నరాల కోఆర్డినేషన్ కూడా దెబ్బ తింది.  మూడేళ్ళ ఉద్యోగం తర్వాత Asian college of journalism కోసం చెన్నై వెళ్లి నేను పడ్డ పాట్లు పాట్లు కావు. నరాల నాన్కోపరేషను వల్ల రెండు సార్లు దభేల్న కింద పడ్డా.
 ఈలోపు నా అవస్థ చూసి జాలి పడ్డ మిత్రులు నానా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి నా దుంప తెంచారు పలు మార్లు. ఆమ్రబాద్ అడవుల్లో ఒకసారి అటు తూలి, ఇటు తూలి పడినంత పనయ్యాక మళ్ళీ డాక్టర్ దగ్గరకు పరుగెడితే వెన్ను రెండు సార్లు ఎమ్మారైలు తీసి మైల్డ్ స్పాండిలైటిస్ అని తేల్చారు. మైల్డ్ కే ఇంత బాధా అనుకుని కూడా, ఏమో, నా పెయిన్ త్రెషోల్డ్ తక్కువ కాబోలు అనుకుని ఫిజియోథెరపీ తీసుకున్నా దాదాపు నెల్లాళ్ళు. ఏమీ లేదు తేడా.
దేవుడు కరుణించి నిరుడు ఈ టైంలో నాకు ఏమి తిన్నా పడని రోగం పట్టుకుంది. తిన్న వెంటనే గంటలో ఆకలి వేయడం, బ్లోటింగ్ వగైరా లక్షణాలతో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దగ్గరకెళ్లా. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆయన ఈ సజ్జు అందరిలో చాలా బెటర్. స్టేతస్కోప్ పెట్టి కడుపులో శ్రద్ధగా విని, ఇది బ్యాక్టీరియల్ ఓవర్లోడ్ అమ్మా అన్నారు. ఆయనిచ్చిన మందులు మూడు నెలలు వాడా. మందులు వాడినన్నాళ్ళూ బాగానే ఉండి, ఆ తర్వాత వారానికి మళ్లీ మొదలైంది ప్రాబ్లెమ్.
అప్పుడు నేను గూగుల్ లో వీర రీసెర్చ్ చేశా కదా.. నాకు అర్థమైంది ఏంటంటే, నా సమస్య మొత్తం నా పొట్టలో ఉందని. నాకు గోధుమ, పాలు, స్వీట్లు, మామిడిపండ్లు వగైరాలు పడవు, గూగుల్ జ్ఞానం తోనే పొట్ట బాగు చేసుకోవడం కోసం ఆపిల్ సిడెర్ వినేగర్ పుచ్చుకోవడం మొదలు పెట్టా.
మొదలెట్టిన మర్రోజే నా ఛాతీ నొప్పి మటుమాయమైంది. కొన్నాళ్ళకి మెడ మామూలు సైజుకి వచ్చింది.  ఇదంతా ఏ డాక్టర్ వల్ల జరగలేదు. డాక్టర్లనే నమ్ముకుని ఉంటే ఇప్పటికీ ఆ మందులు మింగుతూనే ఉండేదాన్ని. నిజానికి ఈ డాక్టర్లు రోగాలని పెంచడానికి ఉన్నారు తప్ప తగ్గించడానికి కాదు. 
అంచేత నే చెప్పేదేంటంటే, మన వొంటిని మనమే కాపాడుకుంటూ, తిండిలో మితమూ, బాలన్సూ పాటించి, క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేసుకుంటూ, చావొచ్చినప్పుడు తలొంచుకుని దానెంట పోవాలి తప్ప, అడ్డమైనవీ పొట్టలో తొక్కి, డబ్బులున్నాయి కదాని శరీరాన్ని సిగ్గులేకుండా సుఖపెట్టి, ఆపై ఆయుర్దాయం పెంచుకోవడానికి డాక్టర్ల చుట్టూ తిరిగి నాశనం కావొద్దని మనవి.
  ఒక మహిళా జర్నలిస్టు, హైదరాబాద్‌ 

మరింత సమాచారం తెలుసుకోండి: