అజీర్ణత సమస్య, ఆహారం తీసుకున్న వెంటనే మండుతున్నట్లుగా ఉండే అనుభూతి మరియు ఆమ్లాల ప్రతిచర్య కారణంగా జీర్ణప్రక్రియలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది, దీనిని సపోర్టేడ్ బ్యాక్ బెండ్స్ మరియు ఇన్వెర్శన్స్ (తలక్రిందులుగా ఉండడం) వంటి యోగాసనాలు సాధన చేయడం ద్వారా తగ్గించవచ్చు మరియు శారీరక వ్యవస్థను శాంతింప చేయవచ్చు. గుండెల్లో మంట నుండి ఉపశమనాన్ని పొందగలిగే కొన్ని యోగ ఆసనాలను ఇక్కడ తెలియజేయడమైనది.

లెగ్స్-అప్- ద-వాల్ భంగిమ
దశ-1
లెగ్స్-అప్-ద-వాల్ భంగిమ చేయటానికి, ఒక గోడకు అభిముఖంగా ఉండండి. కాలి వేళ్ళను గోడకు అభిముఖంగా ఉండేట్లు నిర్ధారించుకోవాలి. మీ వీపును నేలకి ఆనించి గోడకు కాళ్ళను నిఠారుగా ఉంచాలి. మీ పిరుదులను గోడకు దగ్గరగా తీసుకురండి. ఎగువ వెన్ను భాగాన్ని, మెడను నేల పై పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు, మీ శరీరం

"L" ఆకారంలో ఉంటుంది.
దశ-2
T ఆకారంలో వేషంలో ఉన్నట్లుగా మీ చేతులను విస్తృత పర్చండి. మోచేతులని 90 డిగ్రీల వరకు వంచండి. మీ అరచేతులు పై కప్పు వైపు చూస్తున్నట్లుగా ఉంచండి మరియు ముంజేతులను నేలపై ఉంచి విశ్రాంతిని కల్పించండి. తుంటి భాగం దూరం వరకు మీ కాళ్లను విస్తరించండి, పాదాలను వంచాలి, మరియు మీరు పైకప్పు పై నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ కళ్ళను మూసుకొని ఐదు నిమిషాల పాటు లెగ్స్-అప్- ద-వాల్ భంగిమలో ఉండండి.

దశ-3
ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత మీ కాళ్లలోని ఒత్తడిని వదిలేసిన అనుభూతిని పొందండి. లెగ్స్-అప్- ద-వాల్ భంగిమలోని విలోమాల వలన పొత్తికడుపు ప్రాంతంలో రక్త ప్రసరణ పెరిగి జీర్ణక్రియ సమస్యలకు సహాయపడుతాయి.

సపోర్టేడ్ బ్రిడ్జ్ భంగిమ
దశ-1
వీపును నేలకు ఆనించి పడుకోండి మరియు మీ అరికాళ్ళను నేలపై ఉంచండి. ఒకసారి మీ పాదాలు నేల పై ఉన్నట్లుగా మోకాళ్ళను వంచండి. తుంటి దూరం వరకు కాళ్లను విస్తృత పర్చండి. మీ వీపు ఎగువ మరియు దిగువ భాగాలు యోగా చాపతో సంబంధం కలిగిఉన్నట్లుగా అనుభూతి పొందండి. మూడు సార్లు ఊపిరి తీసుకోండి.

దశ-2
ఒక యోగ బ్లాక్ ను తీసుకోండి, మీ తుంటి భాగాన్ని పైకి ఎత్తండి మరియు ఆ బ్లాక్ ను త్రికాస్థి వెనుక కుడ్యము (పిరుదులకు కొంచెం పైనకు) క్రిందన నేరుగా పెట్టండి. బ్లాక్ పై మీ తుంటి భాగాన్ని పూర్తిగా వదిలేయండి మరియు మీ చేతులను కాలి తొడలకు ఇరువైపులా తీసుకొని వచ్చి అరచేతులు పై కప్పును చూస్తున్నట్లుగా ఉంచండి. మీ వీపు, పాదాలు మరియు భుజాలు నేలకు ఒత్తిడి కలిగిస్తున్నట్లుగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. యోగ బ్లాక్స్ వివిధ పరిమాణాలలో లభిస్తాయి. కావున, మీ సౌకర్యవంతాన్ని బట్టి అత్యల్ప మరియు అత్యధిక స్థాయిలను ప్రయోగించి పరీక్షించవచ్చు.

దశ-3
బ్యాక్ బెండ్ సహాయంతో అలానే 40 సెకన్ల పాటు ఉండాలి, మీ శరీరం క్రింది నుండి బ్లాక్ ను తొలగించండి మరియు తుంటి భాగాన్ని, వీపును తిరిగి నేలపై ఉంచండి. డయాఫ్రాగమ్ ను పైకి ఎత్తడానికి బ్యాక్ బెండ్స్ సహాయాన్ని అందిస్తాయి, ఇలా చేయడం వలన పొట్టలో కలిగి ఉన్న ఎలాంటి భారమయిన తొలగిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని లోపాలను పరిష్కరించగలిగే అత్యుత్తమ ఉపాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: