ఇడ్లీ,వడ తరువాత దక్షిణాదిలో దోశె ఎంతో ఫేమస్‌. ఈ దోశెల్లోనే వందల రకాలు చేస్తున్నారు కానీ, కందస్వామి తిరుకుమార్‌ తయారు చేసే, ఒక అరుదైన 'పాండిచ్చేరి దోశె' ను రుచి చూసి తీరాల్సిందే అంటున్నారు అమెరికాలోని భారతీయులు.

అతని దోశె న్యూయార్క్‌లో ఫేమస్‌! వాషింగ్టన్‌ స్వ్కేర్‌ పార్క్‌ దగ్గర 18 ఏళ్లుగా దోశెలమ్ముతూ పాపులర్‌ అయ్యాడు తిరు. ఆయన దోశెలను రుచి చూసిన ఆ నగర ప్రజలు ఆయన్ని 'తిరు' అని పిలుచుకుంటారు. శ్రీలంకకు చెందిన తిరు 3 దశాబ్దాల క్రితం అమెరికాకు వలసవెళ్లాడు. అక్కడి రెస్టారెంట్లలో కొంత కాలం బాయ్‌గా పనిచేశాడు.
మెల్లగా వంటగదిలో చేరి, భారతీయ వంటకాలను తయారు చేయడం నేర్చుకున్నాడు. సొంతంగా బతకాలని, జీవనోపాధి కోసం ఒక చిన్న రెస్టారెంట్‌ మొదలు పెట్టాడు. ఇండియన్స్‌ ఎక్కువగా తినే, దక్షిణాది వంటకాలైన ఊతప్పం, ఇడ్లీ, ప్లెయిన్‌ దోశె, ఉప్మా దోశె, ఆనియన్‌ దోశె, బట్టర్‌ దోశె, జాఫ్నా లంచ్‌, రోటీ, కూరలు, సమోసా మొదలైన వంటకాలను తయారు చేసి, అక్కడి వారికి సరసమైన ధరలకు రుచి చూపించాడు.

కొత్త రుచులను అందించే, కొన్ని ప్రయోగాలూ చేస్తూ, 'పాండిచ్చేరి దోశె' అనే వంటకం చేసి రుచి చూపించాడు. అది సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఇక వెనక్కు తిరిగి చూడలేదు. న్యూయార్క్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఈ దోశెలు రుచి చూస్తూ, ఇక్కడే ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తారట. ఇంత డిమాండ్‌ ఉన్న తిరు ఏ రోజైనా హోటల్‌ తెరవక పోతే, ఆ విషయాన్ని ముందుగానే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తాడు. ఉదయాన్నే ఈ విషయాన్ని తన అభిమాన కస్టమర్లకు చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడరట.
'దోశె మ్యాన్‌'గా న్యూయార్క్‌ ప్రజలు పిలుచుకునే ఇతడి సక్సెస్‌ స్టోరీని ప్రచురించని పత్రికలు లేవంటే నమ్మితీరాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: