వీళ్లంతా సాహసమే ఊపిరిగా బతికిన , బతుకుతున్న మహిళలు… ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అతిమంగా తమ జీవితాలను అంకితం చేసి మరీ ఇతరుల బాగు కోసం అలుపెరుగని కృషి చేసిన అనవాళ్లే కనిపిస్తాయి. తన ప్రాణాలను అర్పించి 359 మందిని కాపాడిన నీర్జా… యాసిడ్ దాడికి గురై యాసిడ్ దాడి బాదితులకు అండగా నిలిచిన మరో మాతృమూర్తి, రైలు ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం వీడకుండా పర్వాతాలను అధిరోహించే మరో స్త్రీ మూరి.ఇలా ఓ 5 గురు మహిళలు సమాజానికి చేసిన సేవ గురించి కాస్తంత మీకోసం తెలియజేస్తున్నాము. చదివి వారిని అభినందించండి.


1.నీర్జాభానత్:
1986 సెప్టెంబర్ 5 న కరాచీ నుండి 359 మంది ప్రయాణికులతో బయలుదేరిన పాన్ ఆమ్-73 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసారు. ఈ విమానంలో సీనియర్ ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న నీర్జా తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ అందర్నీ కాపాడింది. ఆసమయంలోనే ఉగ్రవాదుల చేతిలో మరణించిన 23 ఏళ్ళ నీర్జా. ఈమె సాహసానికి భారత ప్రభుత్వం అశోక చక్ర అవార్డ్ ను ప్రకటించింది. అతి చిన్న వయస్సులో అశోక చక్ర అవార్డును అందుకున్న మహిళగా గుర్తింపు పొందింది నీర్జాభానత్.


 2. లక్ష్మి అగర్వాల్:
15 ఏళ్ళ వయసులో ఎంతో అందంగా ఉన్న లక్ష్మి అగర్వాల్ తనను కాదన్నందుకు అహంతో 32 ఏళ్ళ వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ ఘటన తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా, ప్రచారకురాలిగా ఆమె వ్యవహరిస్తోంది. యాసిడ్ దాడికి గురైనవారిని ఛానవ్ అనే ఫౌండేషన్ ను స్థాపించి వారికి అండగా నిలబడింది. అలాగే టెలివిజన్ హోస్ట్ గా అలరిస్తోంది . యాసిడ్ అమ్మకాలు ఆపేందుకు నిరసనగా 27,000 మందితో సంతకాలు చేయించి, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగ పోరాడుతోంది. సుప్రీం కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను యాసిడ్ అమ్మకాలు నియంత్రించాలని ఆదేశించింది.


3. సుజితే జోర్డాన్:
కోల్ కతాలో కదులుతున్న కారులో గుర్తుతెలియని దుండగులు జోర్డాన్ ను అత్యాచారం చేశారు. 2012 లో పార్క్ స్ట్రీట్ లో జరిగిన ఈ ఘటనను కట్టుకథని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయితే అత్యాచారం జరిగినంత మాత్రాన నేనేం తప్పుచేయలేదని, రేప్ సర్వైవర్ గా పిలవమని జోర్డాన్ కోరింది. ఆ తర్వాత ఏడాది పాటు ఎక్కడా తనకు ఉద్యోగం దొరక్కపోవడంతో తనలాంటి బాదితులకు అండగా నిలబడేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ నెలకొల్పి సహాయపడింది. లైంగిక చర్యలు,అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. 2015లో అవయవాలు పనిచేయడం ఆగిపోవడంతో మరణించింది.


4. అరుణిమా సిన్హా:
లక్నోనుండి ఢిల్లీకి రైలులో ప్రయాణం చేస్తుండగా కొందరు దొంగలు వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సిన్హా దగ్గరున్న బంగారు గొలుసు దొంగిలించేందుకు దగ్గరకు రాగా, అరుణిమ ప్రతిఘటించడంతో ఆమెను రైలులో నుండి కిందికి తోశేశారు. ట్రాక్ పై పడ్డ అరుణిమ కుడికాలుపై అదే ట్రాక్ పై వస్తున్న రైలు దూసుకెళ్ళింది. ఇక కిందపడ్డ లేవలేని క్షణంలో ఎడమకాలు తొడ ఎముక విరిగిపోవడంతో మోకాలి వరకు కాలు తీసేశారు. అయినా పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా కీర్తిగాంచింది. ప్రపంచంలోని ఖండాలలోగల పర్వతాలను అధిరోహించాలననేది ఆమె లక్ష్యం. ప్రస్తుతం అంటారర్కిటికా లోని విన్సన్ మాసిఫ్ , ఉత్తర అమెరికాలోని డీనియల్ పీక్ పర్వతా అధిరోహించాలనుకుంది.


5. సునీత కృష్ణన్:
8 సంవత్సరాల వయసులో మానిసిక, బుద్ధిమాన్యత పిల్లలకు నృత్యం నేర్పేది. 12 ఏళ్ళప్పుడు పేదపిల్లలకు చదువు చెప్పేది. 15 ఏళ్ళ వయసులో దళితులు అక్షరాస్యులు కావాలని అక్షరాస్యత పెంచడానికి ప్రచారం చేసేది. అలా వారికోసం పోరాడుతున్న సునీత కృష్ణన్ పై 8 మంది దారుణంగా అత్యాచారం చేశారు. ఇలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, కష్టాలను ఎదుర్కుంటూ ముందుకువెళ్తున్న సునీత కృష్ణన్, సామాజిక కార్యకర్తగా ప్రజలను చైతన్యపరుస్తూనే, ప్రజ్వల సంస్థకు కో- ఫౌండర్ గా వ్యవహరిస్తోంది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల హక్కుల పునరావాసానికి కృషి చేస్తున్న సునీతపై కొందరు దుండగులు దాడులు చేశారు. కానీ తన ప్రయత్నం విరమించుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: