బీరు.. ఒకప్పుడు మత్తుపదార్థంగా భావించే ఈ పానీయం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. నలుగురు కుర్రాళ్లు కలిస్తే బీర్ తాగాల్సిందే అన్నంతగా కల్చర్ ను క్రియేట్ చేశారు. ఈ కల్చర్ క్రియేషన్ లో సినిమాల పాత్ర తక్కువేమీ కాదు.


ఏ యూత్ సినిమా చూసినా.. బీరు తాగని వాడు కుర్రాడే కాదు.. అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి. అయితే బీరు అబ్బాయిలే తాగుతారా.. అమ్మాయిలం మేం తాగకూడదా అన్నట్టు మహిళాలోకం కూడా మద్యపానానికి సై అంటోంది.


అయితే కాస్త చేదుగా ఉండే బీరు టేస్ట్ అమ్మాయిలకు పెద్దగా నచ్చదు. అందుకే వారు సాఫ్ట్ డ్రింకులో బీరు కలుపుకుని తాగుతుంటారు. మత్తును ఎంజాయ్ చేస్తుంటారు. వారికి అలాంటి ఇబ్బంది తొలగించేందుకు ఓ పబ్ కొత్త ప్రయత్నం చేసింది.


అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ బీర్ తయారు చేసింది. గురుగావ్ లోని ఆర్డర్ 29 అనే పబ్ లేడీస్ కోసం స్పెషల్ గా ఈ బీరు తయారు చేయించింది. అమ్మాయిలు కోరుకునే టేస్ట్ తో ప్రత్యేకంగా తయారు చేయించడంతో ఈ పబ్ కు అమ్మాయిలు ఎగబడుతున్నారట. ఇక ఈ ఫిమేల్ బీర్ కొన్నిరోజుల్లో దేశమంతా వ్యాపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: