వాట్సప్.. ఇప్పుడు ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ను ఊహించలేం.. పొద్దున్న లేవగానే వాట్సప్ చూడటంతోనే ఎందరో రోజు ప్రారంభిస్తున్నారు. పోస్టులు పెట్టడం.. వచ్చిన పోస్టులు చూసుకోవడం.. స్టేటస్ అప్ డేట్ చేసుకోవడం.. ఇలా ఫుల్ బిజీ.


కానీ ఈ ఆంటీ మాత్రం వాట్సాప్ ను టైమ్ పాస్ కోసం కాకుండా బిజినెస్ కోసం బ్రహ్మాండంగా వాడుకుంటోంది. రంగురంగుల డిజైన్ల చీరలను వాట్సాప్‌లో అలవోకగా అమ్ముతున్నారు చెన్నైకి చెందిన ప్రియా షణ్ముగం. అంతే కాదు.. ఏకంగా దేశ విదేశాలకు చీరలను ఎగుమతి చేస్తూ కోట్లలో బిజినెస్ చేస్తున్నారు.


తాను అమ్మడమే కాదు.. దాదాపు 70 వేల మంది రిటైల్‌ వర్తకులకు ఆదాయాన్ని కల్పిస్తున్నారు. ప్రియా షణ్ముగం ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. యూనిక్‌ థ్రెడ్‌ శారీ’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ ఓపెన్‌ చేసి తన చీరలను పరిచయం చేస్తున్నారు. వ్యాపారం చేయటానికి ఆసక్తి ఉన్న మహిళలకు రీసెల్లర్స్‌గా అవకాశం ఇస్తున్నారు.


ప్రస్తుతం ప్రియా షణ్ముగం వద్ద రీసెల్లర్స్‌ సంఖ్య 70 వేలకు చేరింది. ఆమె ప్రస్తుతం 11 వాట్సాప్‌ గ్రూప్‌లను నడుపుతున్నారు. ఆమె బిజినెస్ ఇప్పుడు మూడు కోట్ల టర్నోవర్‌కు చేరింది. కేవలం నోటిమాటతోనే ప్రియా వ్యాపారం అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాలకూ వెళ్లింది. ఒక్క నెలలో రూ. 22 లక్షల వ్యాపారం చేసే రేంజ్ కు వెళ్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: