సాధారణంగా బీట్ రూట్ తో వంటకాలు అంటేనే వెరైటీ..అది కూడా కొన్ని ఫంక్షన్లలో కనిపిస్తుంటాయి.  సాధారణంగా బీట్ రూట్ పెద్ద పెద్ద ఫంక్షన్లలో వాడుతుంటారు.  అయితే బీట్ రూట్ తో వడ తయారు చేయడం చాలా వెరైటీగా అనిపించినా ఆ వడ తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది. 

మన ఇళ్లలో ఎప్పుడూ రొటీన్ టిఫిన్, రొటీన్ భోజనం..కర్రీస్ అంటే ఎవరికైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.  అందుకోసం వారానికి రెండు మూడు సార్లు వెరైటీ టిఫిన్, కర్రీస్ వండుకోవడానికి ప్రయత్నిస్తుంటాం.  ఎక్కువ ఖరీదు కాకుండా మన బడ్జెట్ లో ఇవి మెయింటేన్ చేస్తుంటాం.  తాజాగా బీట్ రూట్ తో వడలు ఎలా చేసుకోవాలో చూద్దామా. 


బీట్‌రూట్ వడ కావాల్సిన పదార్థాలు
బీట్‌రూట్ తురుము : ఒక కప్పు
పచ్చి శనగపప్పు : ఒక కప్పు
ఉల్లిపాయ :1 పెద్దది
నూనె : తగినంత
పచ్చిమిరపకాయలు :6
అల్లం తురుము : 1 టీ స్పూను
ఉప్పు : తగినంత
కొత్తిమీర తరుగు : మూడు టీ స్పూన్లు 

తయారుచేసే విధానం : ముందుగా శనగపప్పు రెండు గంటలు నానబెట్టాలి.  ఈ నానబెట్టిన పప్పుని నీళ్లు వంపేసి విడిగా తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. రుబ్బిన శనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, ఉల్లితరుగు, బీట్‌రూట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడలాగా ఒత్తుకొని వేడి నూనెలో దోరగా వేయించాలి. వేడి.. వేడి బీట్‌రూట్ వడ తయారైనట్లే! వీటికి టమాటో సాస్ మంచి కాంబినేషన్.   




మరింత సమాచారం తెలుసుకోండి: