చెంగావి రంగు చీర క‌ట్టినా మువ్వ‌న్నెల జ‌రీచీర చుట్టినా.. వాటికి వ‌న్నె తెచ్చేది మాత్రం ర‌వికే. అందుకే దానికి ప్యాచ్‌వ‌ర్కులు చేయించినా, అద్దాలు అతికించినా, బంగారు జ‌రీతో ఎంబ్రాయిడ‌రీ మెరుపులు చెక్కినా... మ‌రో కొత్త ఫ్యాష‌న్ కోసం మ‌గువ మ‌న‌సు వెత‌క‌క మాన‌దు. అందుకే ఏకంగా న‌గ‌ల‌తోనే జాకెట్ల‌ను అలంక‌రించేస్తూ న‌యా ట్రెండ్‌కి తెర‌తీస్తున్నారు ఫ్యాష‌న్ గురూలు.ఆడ‌వారికీ ఆభ‌ర‌ణాల‌కీ విడ‌దీయ‌రాని బంధం. అందుకే, ముక్కుపుక‌డ నుంచి కాలి మెట్టె వ‌ర‌కూ ఎన్ని ఫ్యాష‌న్లు వ‌చ్చినా అన్నీ హిట్టే మ‌రి. ఇక పెళ్లిళ్లూ పేరంటాలూ లాంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో అయితే హ‌వా అంతా మాదే అన్న‌ట్టుగా ర‌క ర‌కాల న‌గ‌లు మగువ‌ల మెడ‌ల్లో చేరిపోయి తెగ ఫోజులు కొట్టేస్తాయి. చీర‌కు త‌గ్గ‌ట్టుగా ముత్యాల హార‌మో అంచుకు మ్యాచ‌య్యే రంగు  రంగుల రాళ్ల దండ‌లో లేదూ అనుకుంటే వ‌రుస‌ల‌వ‌ర‌స‌ల బంగారు గొలుసులో వేసుకోవ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న ఫ్యాస‌న్ కానీ, ఎప్ప‌టినుంచో వ‌స్తున్న ఫ్యాస‌న్ కానీ, అంద‌రిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ మ‌న‌దే కావాలంటేమాత్రం బ్లౌజ్ సొగ‌సును మ‌రింత పెంచే బ్యాక్ బ్రాప్ చైన్ ఒక్క‌టైనా ఉండాల్సిందే. వ‌సుస‌ల వ‌రుస‌ల గొలుసులూ, హారాల‌ను పోలిన విధంగా రూపొందించే ఈ జాకెట్టు న‌గ‌లు ఇప్పుడు అతిల వీపు పై వయ్యారాలు ఒల‌క‌బోతున్నాయి. చీర‌, గాగ్రా, లాంగ్ స్క‌ర్ట్‌... ఇలా వేటి మీద వేసుకునే జాకెట్టుకైనా వెనుక‌న ఒక్క వ‌రుస గొలుసైనా పెట్టేసుకోవ‌డ‌మే ఇప్ప‌టి ట్రెండ్‌.

అస‌లే ముద్దుగుమ్మ ఆ పై ఆక‌ట్టుకునే చీరాజాకెట్టూ వాటికి ధీటుగా కాంతులీనే ముత్యాలూ రాళ్లూ పొదిగిన బ్లౌజ్ బ్యాక్ డ్రాప్ నెక్లెసూ ఇవి చాల‌వూ అంద‌రి క‌ళ్లూ
అమ్మాయి వెన‌క అతుక్కుపోవ‌డానికి.అందంగా... ట్రెండీగా...బ్లౌజ్ సొగ‌సులు పెంచ‌డానికి డోరీలూ, బోట్ నెక్‌, ప్యాచ్‌వ‌ర్క్‌, ఎంబ్రాయిడ‌రీ డిజైన్లూ... ఇలా ర‌క‌ర‌కాల అలంకారాలూ చేస్తూనే ఉంటారు. ఇవ‌న్నీ ఒకెత్తయితే ఇప్పుడిప్పుడే వ‌స్తున్న ఈ బ్యాక్ డ్రాప్ చైన్లు మ‌రో ఎత్తూ, అవును మ‌రి, ఇవి జాకెట్లుకే న‌గ‌లు అతికేస్తూ వాటిని మ‌రింత ట్రెండీగా మార్చేస్తున్నాయి. చిన్న చిన్న కుంద‌న్ల నుంచి చారెడంత లాకెట్ల వ‌ర‌కూ వివిధ ఆకృతు్లో వ‌స్తున్న ఈ డిజైన్లు ర‌విక‌కే కొత్త వ‌న్నెలు జోడించేస్తున్నాయి. మ‌రో విష‌యం ఈ బ్యాక్ డ్రాప్ చైన్స్‌ని బ్రూచ్‌ల మాదిరిగానూ వాడుకోవచ్చు.  వేడుక సంద‌డంతా మ‌న‌లోనే క‌నిపించాల‌నుకున్న‌ప్పుడు చ‌క్క‌గా జాకెట్టుకి పెట్టేసుకోవ‌చ్చు. లేదూ సింపుల్‌గా ఉంటే చాల‌నుకున్న‌ప్పుడు తీసి ప‌క్క‌న పెట్టేయొచ్చు.ఇంక ఆల‌స్యం దేనికి? న‌చ్చిన బ్యాక్ డ్రాప్ చైన్‌ను ఆర్డ‌ర్ చేసేసి ఫ్యాష‌న్ క‌లెక్ష‌న్‌లో పెట్టేసుకోండి మ‌రి!


మరింత సమాచారం తెలుసుకోండి: