ఇప్పటి వరకు ఎన్నో వెరైటీ వంటకాలు మనం చూశాం..చూస్తున్నాం.  అయితే వర్షాకాలం, చలికాం వెడి వేడిగా బజ్జీలు తినాలని ఎవరికైనా కోరిక ఉంటుంది.  అయితే బజ్జీలు ఎన్నో రకాలుగా చేస్తుంటారు.  పచ్చిమిర్చి,తమలపాకు,వంకాయ,టమాట,కోడిగుడ్డు ఇలా ఎన్నో రకాలుగా బజ్జీ తినే ఉంటారు.  తాజాగా వంకాయ బజ్జీ ఎలా చేస్తారో తెలుసుకుందామా...


కావలసిన పదార్థాలు :  వంకాయలు : పావుకిలో, సెనగపిండి : పెద్ద కప్పు,  ఉప్పు : అరటీస్పూను,  కారం : టీస్పూను,  ధనియాల పొడి : 2 టీస్పూన్లు,  గరంమసాలా : టీ స్పూను,  సోడా : చిటికెడు,  నూనె : వేయించడానికి సరిపడా.  తయారీ విధానం: ముందుగా పొడవాటి వంకాయలను నిలువు ముక్కలుగా కోయాలి. పొట్టి వంకాయలైతే గుండ్రని స్లైసుల్లా అంటే చిప్స్‌లా కోసి ఉప్పునీళ్లలో వేయాలి. ఓ గిన్నెలో సెనగపిండి, ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా పొడి, వంటసోడా వేసి గరిటె జారుగా కలిపి పదినిమిషాలు ఉంచాలి.


ఇప్పుడు వంకాయ ముక్కలు నీళ్లలో నుంచి తీసి కాస్త ఆరనిచ్చి రెండువైపులా ఉప్పు, కారం చల్లాలి. ఇలా చేయడం వల్ల బజ్జీలు చప్పగా ఉండకుండా ఉంటాయి. తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా సెనగపిండిలో ముంచి వేయాలి. కరకరలాడేవరకూ ఎర్రగా వేయించి తీసి టిష్యూపేపర్ మీద వేస్తే ఎక్కువుగా నూనెను పీల్చేసుకుంటాయి. వీటిని టొమాటో సాస్‌తో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: