దేవుడు తనకు బదులుగా భూవిపైకి అమ్మను పంపారని అంటారు.  అమ్మ అనే పదానికి ఎన్ని నిర్వచనాలు చెప్పినా తక్కువే..నవమాసాలు తన కడుపులో మోసి..తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా బిడ్డకు జన్మనివ్వాలనే తపననే తల్లికి ఉంటుంది.  అలాంటి తల్లులు గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


గర్భిణీ స్త్రీలకు అన్ని సమస్యలను నివారించడానికి ఫ్రూట్ జూసులు బాగా సహాయపడుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తుంది.  శరీరంలోని విషాలను మరియు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించి శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. కాబట్టి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాలకు తాగడం కన్నా(గర్భిణీ స్త్రీలకు హాని కలిగించే)కొన్ని హెల్తీ సమ్మర్ జ్యూసులను తాగడం గర్భిణీ స్త్రీలకు శ్రేయస్కరం. ఆ హెల్తీ జ్యూసులను తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

కీరదోస కాయ : ఈ కీరదోసకాయ జ్యూస్ శరీరానికి చల్లదాన్ని అందించడంతో పాటు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఈ హెల్తీ మరియు లోక్యాలరీస్ కలిగిన జ్యూస్ ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.  గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను, మామిడి జ్యూసుల తీసుకోకూడదని చాలా మంది అంటుంటే వింటాము. అయితే, మామిడి పండును అధికంగా కాకుండా గర్భధారణ సమయంలో మామిడి జ్యూస్ లేదా మిల్క్ షేక్ వంటివి తాగవచ్చు. మీకు తాగవచ్చా? లేదా అన్నది మీ డాక్టర్ ను సంప్రదించవచ్చు. 


అరటిపండు జ్యూస్ : అరటి పండులో ఉండే పోషకాంశాలను పక్కన పెడితో గర్భిణీ స్త్రీ తీసుకోవల్సినటువంటి హెల్తీ ఫ్రూట్ జ్యూస్ ఇది. అరటిపండు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపబడుతుంది. ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను నయం చేస్తుంది. దాంతో జీర్ణక్రియ సవ్వంగా పనిచేస్తుంది. 

అవొకాడో జ్యూస్: గర్బిణీ స్త్రీ తీసుకొనేటటువంటి మరో హెల్తీ జ్యూస్ అవొకాడో జ్యూస్. అవొకాడోలో ఉండే పొటాషియం కంటెంట్ బేబీ పెరుగుదల మరియు అభివృద్ధికి బాగా సహాయపడుతుంది. 


పుదీనా జ్యూస్: గర్బిణీ స్త్రీ తాగేటటువంటి ఆరోగ్యకరమైన జ్యూస్ ఇది. పుదీనా ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. ఇంకా వేవిళ్ళను, కడుపులో వికారాన్ని సహజంగానే నివారిస్తుంది. నిమ్మరసం: నిమ్మరసం మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: