కుటుంబ కలహాలు, గృహ హింస, ఆపదలో ఉన్న మహిళలు భద్రతకు పూర్తి భరోసానిచ్చేందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. బాలానగర్ జోన్  కు సంబంధించి అల్వాల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో  సైబరాబాద్ పోలీస్ కమీషనర్  వీసీ సజ్జనార్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ కేంద్రాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలకు, వేధింపులకు గురైన మహిళలు అండగా నిలిచి ఆదుకునేందుకు ఈ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. సైబరాబాద్ లో ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నరు.


మారుమూల ప్రాంతాలైన చేవెళ్ళ, షాద్ నగర్ లో ఇప్పటికే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఆల్వాల్ లో ఏర్పాటు చేసినట్టుగానే త్వరలో జీడిమెట్ల, ఇతర ప్రాంతాల్లోనూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. గృహహింస నుంచి మొదలు మహిళల అక్రమ రవాణా, లైంగికదాడుల వరకు సమాజంలో రకరకాల వేధింపులకు గురైన మహిళలు, ఆదుకోవడానికి అవసరమైన పోలీస్, న్యాయ, విచారణ, కౌన్సెలింగ్ తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ ఒకేచోట లభిస్తాయన్నారు.ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు బాధితులకు అండగా నిలుస్తాయని తెలిపారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడుతున్నాయన్నారు. 


మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యలకు పాల్పడే వారిపై కేసు కట్టడం ఒక ఎత్తైతే.. వారికి శిక్షలు పడేలా చూడాలన్నారు. 
దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో జనవరి, జూలై నెలలోనే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తారని.. సైబరాబాద్‌లో నిరంతరం ఈ డ్రైవ్ లు కొనసాగుతాయన్నారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఒక్క జూలై నెలలోనే 541 మండి చిన్నారులను కాపాడడం జరిగిందన్నారు. ఆపరేషన్ స్మైల్ విభాగం బాగా పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంటుందని సైబరాబాద్  సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ,  విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డీసీపీ అనసూయ, క్రైమ్స్ ఏడీసీపీ ఇందిరా, ఏసీపీలు, భూమిక సత్యవతి, ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: