ఇదివ‌ర‌క‌టి రోజుల్లో హీరోయిన్లు ఎక్కువ‌గా ప‌లాజో ప్యాంట్లు వేసేవారు. అవి అప్ప‌టి ఫ్యాష‌న్‌. మ‌ళ్ళీ తిరిగి ఇప్పుడు అది లేటెస్ట్ ఫ్యాష‌న్‌గా మారింది. ఎప్ప‌టికైనా పాత ఫ్యాష‌నే మ‌ళ్ళీ కొత్త ఫ్యాఫ‌న్‌గా మారుతుంది. కొన్నేళ్ల క్రితం నుంచి పలాజో పాంట్స్ ఫ్యాషన్ రంగంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వివిధ రకాల పలాజో ప్యాంటులు ఫ్యాషన్ రంగాన్ని కుదిపేశాయి. భవిష్యత్తులో కూడా పలాజో పాంట్స్ తమ ఉనికిని అదే విధంగా చాటుకుంటాయని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం. మీరు కూడా పలాజోతో మీ స్టైల్ ని జతచేయాలి అనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం వివిధ రకాల పలాజో పాంట్స్ మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు చేయాల్సిందల్లా పలాజోకి సూట్ అయ్యే చక్కటి టాప్స్ ని ఎంచుకోవడం మాత్రమే.  ఆ టాప్స్ ఏంటి ఎలా ఉండాల‌న్న‌ది తెలుసుకుందాం.


నాటెడ్ షర్ట్ తో పలాజో : షర్ట్ స్టైల్స్ లో నాటెడ్ షర్ట్స్ ప్రత్యేకమైనవి. టి క్యాజువల్ లుక్ కి ఇవి సరైన ఉదాహరణగా నిలుస్తాయి. పలాజో పాంట్స్ తో నాటెడ్ షర్ట్ ని ప్రయత్నిస్తే కూల్ అండ్ స్టైలిష్ లుక్ మీ సొంతం. అయితే, ఈ జతపై మీరు నిర్ణయం తీసుకునేముందు ప్రింట్స్ గురించి జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు, ప్లెయిన్ నాటెడ్ షర్ట్ ని గనక మీరు ఎంచుకున్నట్టయితే దానిని ప్రింటెడ్ పలాజో తో మ్యాచ్ చేయాలి. అలాగే, ఒకవేళ ప్రింటెడ్ నాటెడ్ షర్ట్ ని ప్రయత్నిస్తే ప్లెయిన్ పలాజోతో మ్యాచ్ చేయాలి. రెండూ ప్రింట్స్ వి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సెలక్షన్ చేసుకోవాలి. 


 క్రాప్ టాప్స్ తో పలాజో: నాటెడ్ షర్ట్స్ తో పాటు, పలాజోలకు క్రాప్ టాప్స్ కూడా మరింత అందాన్ని చేకూర్చుతాయి. కూల్ లుక్ తో పాటు హాట్ లుక్ ను జత చేయాలంటే మీరు క్రాప్ టాప్ ని పలాజోలతో ప్రయత్నించాలి. అలాగే క్రాప్ టీస్ ని కూడా పలాజోలతో ప్రయత్నించవచ్చు. స్కిన్ షో ని అవాయిడ్ చేయాలనుకుంటే మీరు హై వెయిస్ట్ పలాజోలను ఎంచుకోవచ్చు.


 లేస్ టాప్ తో పలాజో: లేస్ టాప్స్ కేవలం మీ అందాన్ని పెంపొందించడమే కాకుండా మీ లుక్ ని హాట్ గా ఉంచేలా తోడ్పడతాయి. ప్రత్యేకించి స్కిన్ ఫిట్ క్రాప్ లేస్ టాప్స్ పలాజో పాంట్స్ తో అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. లెదర్ లేదా వినిల్ పాంట్స్ తో లేస్ టాప్స్ మీ లుక్ ని హాటెస్ట్ గా మార్చడంలో దోహదపడతాయి. వీకెండ్ పబ్ విసిట్లకి అలాగే ఏదైనా పార్టీలకి ఈ కాంబినేషన్ బాగుంటుంది. 5. ట్యాంక్ టాప్స్ తో పలాజో: ఈ లుక్ ని మీరు ఆల్రెడీ ప్రయత్నించి ఉండుంటారు. లేదంటే ప్రయత్నించి చూడండి. ఈ కాంబినేషన్ ని మీరు ప్రయత్నిస్తే చక్కటి కూలెస్ట్ లుక్ ని మీ సొంతం చేసుకున్న వారవుతారు. క్యాజువల్ లో కూల్ లుక్ తో మీరు సెన్సేషన్ సృష్టించవచ్చు. పలాజో స్టైల్ కి అనుగుణంగా మీరు ట్యాంక్ టాప్ ని ఎంచుకోవాలి. పార్టీకి అలాగే క్యాజువల్ స్టైల్ కి అనుగుణంగా మీరు టాప్ ని ఎంచుకోవాలి.


 బ్రాలేట్ తో పలాజో: అవుట్ ఫిట్స్ లో డేరింగ్ కాంబినేషన్ ని అలాగే కొత్త కొత్త ప్రయోగాలని ప్రయత్నించే వారిని ఈ కాంబినేషన్ ఆకర్షిస్తుంది. పలాజోలతో బ్రాలేట్ ను మీరు ప్రయత్నిస్తే హాట్ లుక్ కి మీరు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోతారు. 


 కుర్తాతో పలాజో: పలాజోలతో కుర్తా కాంబినేషన్ ఒక క్లాసిక్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. క్యాజువల్ కాంబినేషన్ అయినా కూడా ఇది ట్రెడిషనల్ వేర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఛాంబ్రే పలాజోలతో లైట్ కుర్తాని ప్రయత్నించారా? తప్పక ప్రయత్నించండి. ఈ లుక్ మీకొక స్పెషల్ ఇమేజ్ ని మీ సర్కిల్ లో మీకు కలిగిస్తుంది. ఇవండీ, పలాజోలతో ట్రై చేయవలసిన కొన్ని కూలెస్ట్ టాప్ ఐడియాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: