తామర పువ్వు అలంకరణకి చాలా మంది ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి.తామర పువ్వులే కాదు వాటి గింజలు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తామర గింజలు అంటే చాలా మందికి తెలియదు. కాని  "పూల్ మఖని" అంటే అందరూ గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్ధం. ఈ గింజలు తామర పువ్వు నుంచి వచ్చినవి. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే పీచు పదార్ధం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. తామర గింజలే కాదు తామర కాడలు కూడా మనం వంటలో ఉపయోగిస్తాము. తామర కాడలతో మనం ఇప్పుడు ఒక మంచి రుచికరమైన వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం.తామర కాడల మంచూరియాకి కావాల్సిన పదార్ధాలు:

తామర కాడలు-200 గ్రాములు,

వెల్లుల్లి-10 గ్రాములు,

అల్లం-10 గ్రాములు,

రెడ్ చిల్లీ పేస్ట్-15 గ్రాములు,

టమాట సాస్-10 గ్రాములు,

క్యాప్సికం-25 గ్రాములు,

ఉల్లిపాయలు-4,

ఉప్పు-తగినంత,

తెల్ల మిరియాల పొడి-కొద్దిగ,

నూనె-డీప్ ఫ్రై కి సరిపడా,

కార్న్ ఫ్లోర్-25 గ్రాములు,

మైదా పిండి-25 గ్రాములు,

ఉల్లి కాడలు-కొద్దిగ,

తయారు చేయు విధానం:

ముందుగా తామర కాడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలకు కార్న్ ఫ్లోర్,మైదా రెండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న తామర ముక్కలను వేసుకుని బాగా దోరగా డీప్ ఫ్రై చేసుకోవాలి.


మళ్లీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, అందులో కొద్దిగ నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు,క్యాప్సికం,అల్లం వెల్లుల్లి,తగినంత ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న తామర కాడలను వేసుకుని నీరంతా ఇంకి పోయే వరకు వేయించుకోవాలి. అందులో నీరంతా ఇంకి పోయాక రెడ్ చిల్లీ పేస్ట్,టమాట సాస్,తెల్ల మిరియాల పొడి వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి. చివరిగా దించే ముందు గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను మరియు ఉల్లి కాడలను వేసుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తామర కాడల మంచూరియా రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: