పెరుగుని పెరుగానే కాకుండా ఎన్నో రకాల వంటలు కూడా వండుకోచ్చు.  చల్ల చారు నుంచి పలు వెరైటీలు చేసుకోవొచ్చు.  టామాటో పెరుగు పులుసు చాలా టెస్టీ గా ఉంటుంది.  అయితే టమాటో పెరుగు పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా!

కావలసిన పధార్థాలు : టమోటా : 1/4 కిలో ఉల్లిపాయలు : రెండు పచ్చిమిర్చి : ఆరు పెరుగు : ఒక కప్పు ఉప్పు : తగినంత పసుపు : చిటికెడు పోపు సామాన్లు : ఎండు మిర్చి : రెండు మినపప్పు : 1/2 స్పూన్ ఆవాలు : 1/4 స్పూన్ వెల్లుల్లి : మూడు రేకలు కరివేపాకు : కొద్దిగా నూనె : 50 గ్రా తయారుచేసే విధానం: ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు ముక్కలు తరగాలి.

ఇవి చాలా చిన్న ముక్కలుగా ఉండాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు వేసి చిటపటలాడాక ఎండు మిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయించి, టమోటా ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించి, పెరుగు వేసి కలిబెట్టి దించాలి. కొద్దిగా కొత్తి మీర వేసుకుంటే రుచి అదిరిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: