ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు తమ చర్మ సౌందర్యం కోసం,మృదువైన చర్మం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరిలోను అతి పెద్ద సమస్య ముఖం మీద ముడతలు,నల్ల మచ్చలు,ట్యాన్ అవడం,ఫైన్ లైన్స్ రావడం.ఇది అందరిలోను చాలా ఎక్కువగా కనిపిస్తుంది.దీనికి చాలా మంది చాలా రకాల చికిత్సను చేయించుకుంటారు కాని ఫలితం మాత్రం కనిపించలేదు.ఇంకా ఎన్నో రకాల క్రీమ్స్ ని,సోప్స్ ని,ఫేస్ వాష్ లని మందులని ఇంకా మరెన్నో రకాల వాటిని వాడుతున్నారు. అయినా ఎటువంటి ఉపయోగాలు కనిపించలేదు. అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.ఇప్పుడు ఈ సమస్యకి మనం ఇంట్లోనే ఒక చక్కటి చిట్కాని ఎలా తయారు చేసుకోవాలొ ఏంటో తెలుసుకుందాం.

"ఎగ్గ్ మాస్క్" తయారీకి  కావాల్సిన పదార్ధాలు:

గుడ్డు-1,
పంచదార-కొద్దిగ,
నిమ్మకాయ-1,
శనగపిండి-కొద్దిగ,
తయారు చేసే విధానం:

ముందుగా గుడ్డు తీసుకుని దానికి ఒక చిన్న రంద్రం పెట్టి అందులోని ఎగ్గ్ వైట్ ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని రసాన్ని పిండి అందులో కొద్దిగ పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.ఇలా కలిపిన మిశ్రమంలో ముందుగా తీసుకున్న ఎగ్గ్ వైట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఇందులో కొద్దిగ శనగపిండి వేసుకుని ఉండలు లేకుండా చిక్కటి పేస్ట్ లా కలుపుకోవాలి.ఇలా కలుపుకున్న పేస్ట్ ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని తరువాత ఈ ప్యాక్ ని వేసుకోవాలి.


ముఖానికి మొదటి సారి వేసుకున్న తరువాత అది ఆరిపోయాక మళ్లీ మరొక సారి వేసుకోని మళ్లీ ఆరనివ్వాలి.ఇది వేసుకున్న తరువాత మాట్లాడటం,నవ్వడం లాంటివి చేయకూడదు.పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.


ఇలా తరచూ చేయడం వల్ల ముఖం మీద్ద ఉన్న ముడతలు,నల్ల మచ్చలు,ట్యాన్ అన్నీ కూడా పోయి ముఖం మంచిగా కాంతివంతంగా తయారవుతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: