తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహించే బతుకమ్మ పండుగ చీరలకు రంగం సిద్దమవుతుంది. ఈ సరి పండుగకు పది రోజుల ముందే కానుకగా చీరలను పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందులో భాగంగానే రూ.320కోట్ల వ్యయంతో తయారు చేసే  కోటి చీరెల ఉత్పత్తికి సిరిసిల్ల నేతన్నలు రాత్రి పగిలి విరామం లేకుండా కష్టపడుతున్నారు.తెల్లరేషన్ కార్డు లబ్ధిదారుల్లో మహిళలతోపాటు ఆ కుటుంబంలో 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికి పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూ. 320 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి ముమ్మరంగా సాగుతున్నది.





మొత్తంగా 6 కోట్ల మీటర్ల ఉత్పత్తి లక్ష్యంలో 4కోట్ల మీటర్లు సిద్ధం చేశారు. మొత్తం కోటి చీరెల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన 56 లక్షలకుపైగా చీరెలను సిద్ధం చేసి టెస్కో సంస్థకు అప్పగించారు. ఈ చీరెల తయారీకి నాణ్యమైన ముడిసరుకును ఉపయోగిస్తున్నారు. సూరత్ నుంచి 600 టన్నుల జరీ, గుజరాత్‌లోని చిల్వాస నుంచి (యార్న్) తెప్పించి వాడుతున్నారు. ఆరు గజాలతోపాటు ప్రత్యేకంగా ఎనిమిది గజాల చీరెలను నేయిస్తున్నారు.





బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చీరెల తయారీ తుది దశకు చేరుకున్నది. సెలవు రోజుల్లోనూ కార్మికులు పనిచేస్తూ లక్ష్యాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకుపోతున్నారు. సెప్టెంబర్ మూడో వారం నుంచే అన్ని జిల్లాల్లో చీరెలను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి తయారీకి మొత్తం 20వేల మంది కార్మికులు రస్టీ పగలు కష్టపడుతున్నారు. మొత్తమీద బతుక్కమ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: