ఆమె ఓ గిరిజన యువతి.. ఊరు ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా.. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం.. కష్టపడి చదివింది. ఆకాశంలో పైలట్ గా ఎగరాలని కలలు కన్నది.. ఇప్పుడు ఆ కలలు నిజం చేసుకుంది. గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. చదవుకోడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగా ఫైలెట్‌గా ఎదిగి ప్రశంసలు అందుకుంటోంది.


23 ఏళ్ల అనుప్రియా లక్రా తొలి మహిళా ఫైలెట్‌గా సువర్ణావకాన్ని దక్కించుకున్నారు. కమర్షియల్ విమానాన్ని నడిపిన తొలి ఆదివాసీ మహిళా పైలెట్ గా అరుదైన ఘనత సాధించింది. చిన్నప్పటి నుంచి పైలెట్ కావాలని కలలు కన్న అనుప్రియ ఏడేళ్ల క్రితం ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలెట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయ్యారు.


అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వర్ లోని పైలెట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరిన అనుప్రియ... ఏడేళ్లు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేట్ విమానాశ్రయ సంస్థలో కో పైలెట్ గా ఉద్యోగం సాధించారు. అనుప్రియ తండ్రి మర్నియాస్ లక్రా ఒడిశా పోలీసు విభాగంలో హవాల్దార్ గా పనిచేస్తున్నారు. అనుప్రియ త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది.


ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ పట్నాయక్‌ ప్రశంసించారు. అనుప్రియ మరెందరో అడవి బిడ్డలకు స్ఫూర్తిగా నిలవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: