మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోను మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం,పాస్పరస్,ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. దీనిని 4,5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకులో ఎంత గొప్పతనం ఉందో మనకు అర్ధమవుతుంది. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. ఎన్నో లాభాలు ఉన్న ఈ మునగాకుతో మనం ఒక మంచి రుచికరమైన "మునగాకు పెసరపప్పు కూర" ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


"మునగాకు పెసరపప్పు కూర" కి కావాల్సిన పదార్ధాలు:

మునగాకు-1 కప్పు,     
పెసరపప్పు-1 కప్పు,  
    ఉల్లిపాయలు-2,
      పచ్చిమిర్చీ-5,
      పచి కొబ్బరి పొడి-కొద్దిగ,
      కారం-తగినంత,
      ఎండుమిర్చీ-3, 
     ఉప్పు-తగినంత, 
     ధనియాల పొడి-కొద్దిగ,
      నీళ్లు-తగినంత, 
     నిమ్మ రసం-కొద్దిగ,
      కరివేపాకు-కొద్దిగ, 
     జీలకర్ర-కొద్దిగ, 
     నూనె-కొద్దిగ, 
     పసుపు-చిటికెడు,  
    వెల్లుల్లీ రెబ్బలు-4,

" మునగాకు పెసరపప్పు కూర" తయారుచేయు విధానం:

ముందుగా మనం పెసరపప్పును 15 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను మరియు పచిమిర్చీనీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టీ అందులో కొద్దిగ నూనె వేయాలి. నూనె వేడైయ్యాక కొద్దిగ జీలకర్ర వేసి వేయించుకుని అందులో కట్ చేసిపెట్టుకున్న పచ్చిమిర్చీ, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత కొద్దిగ కరివేపాకు,ఎండుమిర్చీ,వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత అందులో మనం చిటికెడు పసుపు మరియు మునగాకును వేసి కొంచెం వేయించుకోవాలి. ఆకు వేగిన తరువాత అందులో మనం ముందుగా నానపెట్టిన పెసరపప్పును వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వేగిన తరువాత అందులో సరిపడా నీరు పోసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తరువాత అందులో మనం కొద్దిగ పచ్చి కొబ్బరి తురుము,ధనియాలపొడి,కారం వేసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన "మునగాకు పెసరపప్పు కూర" రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: