ముదితల్ నేర్వగరాని విద్య కలదే.. ముద్దార నేర్పించినన్.. అన్నారు పెద్దలు.. సరిగ్గా నేర్పాలి కానీ స్త్రీలు నేర్వలేని విద్య ఉంటుందా.. అని దాని భావం.. కానీ ఈ కాలంలోనూ ఇంకా కొన్ని రంగాల్లో మహిళలకు ప్రవేశం లేదు. అలాంటి రంగాల్లో సైన్యంలోని కొన్ని విభాగాలు ఉన్నాయి.


ఇప్పుడు ఆ లోటు తీరబోతోంది. ఇప్పటి వరకూ మహిళలకు ప్రవేశం లేని జాతీయ విపత్త రక్షణ దళాలులోనూ మహిళలు ప్రవేశించబోతున్నారు. ఏడాదిలోగా జాతీయ విపత్తు రక్షణ దళాల్లోకి మహిళలను చేర్చుకుంటునట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు.


కొత్తగా ఏర్పాటు చేయనున్న 4 బెటాలియన్లలో వారిని కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. సరైన సదుపాయాలు లేవన్న కారణంతోనే ఇప్పటి వరకూ మహిళలను తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇక ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 ఎన్డీఆర్‌ఎప్ దళాలు ఉన్నాయి. ఇక వీటిలో ఇప్పుడు మహిళలను కూడా తీసుకుంటారన్నమాట. ఇప్పటికే సైన్యంలోని అనేక విభాగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. ఇక ఎన్టీఆర్ఎప్ లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: