Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:13 am IST

Menu &Sections

Search

అది బఫే మీల్స్ కాదు.. బఫెల్లో మీల్స్

అది బఫే మీల్స్ కాదు.. బఫెల్లో మీల్స్
అది బఫే మీల్స్ కాదు.. బఫెల్లో మీల్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ కాలం బఫె భోజనాల గురించి డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు వ్యంగ్యగా వ్రాశారు. రుచులవి జాతివి మారెను. పచనపు కళ మారిపోయి. పడమటి వంటల్.. కిచెనుల దూరెను మెల్లగ. శుచియగు మన భావములను శూన్యము చేయన్. గుత్తి వంకాయ కూరా లేదు , గుమ్మడికాయ పులుసూ లేదు ! అరటికాయ వేపుడు లేదు , అదిరే కొబ్బరి చట్నీ లేదు..!  కొత్తావకాయ ఊసే లేదు , కొత్తిమీర చారూలేదు..! కందా బచ్చలి.. మరిచారయ్యా..! గుమ్మడి వడియం విడిచారయ్యా..! పలావు వుందని వడ్డించారు ! ఉల్లీరైతా ఉందన్నారు ! రుచిపచి తెలీని 'కూరే' సారు ! మిక్సుడు పికిల్ కూరేసారు ! బూరీ గారీ నోదిలేసారు ! బూందీ లడ్డూ మార్చేశారు ! గులాబు జామూన్ ఉందన్నారు లైనులో జనాలు ముందున్నారు !


అయిసు క్రీముకేసడిగేసాకా , అయిపోయుంటుందన్నారొకరు ! ప్లేటుని చేతిలో పట్టుకుని, ఓ చేతిని జేబులొ పెట్టుకుని , బఫే లైనులో నుంచుంటే , బఫూన్ లా భలేగా వుంది ! కుర్చీ బల్లా తీసేశారు ! కుదురుగ నిలుచుని తినమన్నారు ! తల్లీ పిల్లా తల్లడిల్లినా , ముసలీ ముతకా ముక్కి చూసినా ! బఫే తీరులో బలముందన్నారు ! గొర్రె మూక విని తలవంచారు ! పెద్దా చిన్నా పరుగులె పరుగులు ! ముద్ద కోసమొక యుద్దపు తలపులు ! సాపాటు--గ్రహపాటు ఔనండీ సుబ్రహ్మణ్యం గారు అది బఫే మీల్స్ కాదు బఫెల్లో మీల్స్ దానికి తోడు హనుమంతుడు సంజీవ పర్వతం మోస్తున్నట్టు చేతిలో బరువైన ప్లేటు ఏ ఐటమ్ కి అది కొద్దిగా పెట్టించు కుందామంటే కొండ వీటి చాంతాడు లాంటి లైను, ఎంగిలి ప్లేటుతో ఈదుకుంటూ ప్రయాణం ఎడమ చేతి బరువు.



లంక మేత గోదారీత లా మంచినీళ్ళు ఎక్కడో మధ్యలో ఆద మరిస్తే ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో మనకి ఎవరు డాష్ ఇస్తారో. కొంచెం వేగంగా నడిస్తే ఈ చలవరాతి ప్లోరింగ్ పై పడిన నీటి చుక్కలకి నడుం జారుతుందో. వండే వాడెవడో వడ్డించేవాడెవడో చక్కగా తిందామంటే నలుగురికి పరిచయమైన వారికి కత్తి సామే. ఎవరో ఒకరి పనికి మాలిన ముచ్చట్లు. ఎక్కడేమున్నాయో తెలవక అర్ధాకలితో భోజనం ముగింపు. చెత్త కాయితాలేరుకునే వాడిలా ఎక్కడ ఏమి ఉన్నాయో.




చూసుకుంటూ తిరుక్కుంటూ అభోజనం. నిజమే నిలబడి భోజనం నిజంగా నాగరికుల దౌర్భాగ్యం. అందుకే వెళ్ళక పోతే ఎవరితో కలవమనుకుంటారు. కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి. అందరితో కలిసి భోజనం చేయాలి. కాదు కాదు చేసినట్లు నటించాలి. పేరుకు విందు దానికి ఓ టైము కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ, అలా అని ఆలశ్యంగా వెళితే పదార్ధాలు నిండుకుండు నిలబడి పెట్టే భోజనం. యజమానికి సంతోషం లేదు అతిధికి ఆనందం లేదు. నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో చాల అదృష్టంగా బావించాలంటున్నారు. భోజన కాలే హరి నామ స్మరణ..గోవిందా


That's not Buffet Meals .. Buffalo Meals
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
చరిత్రలో ఈ రోజు
ఉన్నచోటే గ్రంధాలన్నీ చదివేయచ్చు..అదెలా అంటే
జడివానలతో తీవ్ర ఇక్కట్లలో వాహనదారులు
డ్రగ్స్, డ్రెసింగ్ కొనుగోళ్లలో తవ్వేకొద్దీ అవినీతి భాగోతం
ఇక నుంచి ప్రజా రవాణా శాఖగా ఆర్టీసీ
బాబుకి తాను చేసిన తప్పులు తెసొస్తున్నట్టుగా ఉందే.. .
అచ్చమైన తమిళ సంప్రదాయ డ్రెస్
ఆ విషయంలో ఆయనకు ఆయనే చాటి.
స్ట్రీట్ వ్యూ కెమేరాతో తస్మాత్ జాగ్రత్త
విష జ్వరాలు వ్యాప్తిపై వైద్యులను హెచ్చరించిన గవర్నర్
ఆ పార్లమెంటేరియన్ ది పదహారేళ్ల ప్రేమ..బంధమవుతుంది
చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ టూర్ షెడ్యూల్ ఇలా..
జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. ఎందుకు అంటే...?
టూరిస్టులకు భలే చాన్సలే..
మరణాల్లో ఆత్మహత్యలదే పైచేయి..
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకే ఇబ్బంది..
అడ్డంగా దొరికిపోయిన నలుగురు ఎర్ర స్మగ్లర్లు
అయుష్మన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగు
కంటివెలుగుకు టాస్క్ ఫోర్స్ కమిటీ
ప్రధాని మోడీ కోసం మిసైల్ విమానం
సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు.. షెడ్యూల్ ప్రకారం బస్సులంటున్న సర్కార్
హుజూర్‌నగర్ కు తాకిన ఆర్టీసీ సమ్మె సెగ..
వెండితెరకు హాస్య నటులను అందించిన రోజుది..
కల్తీకి ముగింపు పలికిన సర్వోన్నత ధర్మాసనం
అర్చకుల జీవితాల్లో కూడా వెలుగు..
హామీల అమలు దిశగా జగన్ వడివడిగా అడుగులు
ఆర్టీసీ సమ్మెకు నేతల రహస్య ఎజెండానేనా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.