పువ్వులను ఇష్టపడని అమ్మాయిలు ఉండరేమో.. సౌందర్య అలంకరణలో పువ్వులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రోజాలతో ఒక రకంగా అలంకరించుకుంటే.. మల్లెలతో మరో రకంగా కూడా అలంకరించుకుంటారు. సువాసనలు వెదజల్లే ఈ మల్లెలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేంటంటే.. మల్లెపూలల్లో నికోటిన్ ఎక్కువగా ఉండటంలో మనిషికి నిద్ర రాకుండా ఒక రకమైన మత్తును కలిగిస్తుంది. 


అందుకే కాబోలు  రాత్రి రోజు మల్లెపూలు పాల గ్లాస్ మరవద్దు అంటారు. అంతేకాదండోయి ఈ మల్లె పూల వల్ల ఆరోగ్యం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఉదయం నుండి పనిలో పడి కళ్ళు అలసటగా మారతాయి.. అలాంటప్పుడు కొన్ని మల్లెలను తీసుకొని కళ్ళ మీద పెట్టుకుంటే అలసట, ఒత్తిడి దూరమయ్యి మరింత ఉసారుగా మారతారట. ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా వినపడుతుంది. కొన్ని ఎండు పువ్వుల్ని తీసుకొని కొబ్బరి నూనెలో కనుక వేసి నూరి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది. 



ఇక కొబ్బరి నూనెలో కొన్ని మల్లెపూలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తలకు పట్టించి.. అరగంట అయ్యాక తలస్నానం చేయడం వల్ల. వెంట్రుకులకు బలం చేకూరి అవి మరింత అందంగా మృదువుగా, ఒత్తుగాని మారతాయట. కేవలం జుట్టుకే కాదు ముఖానికి కూడా ఏవి మంచి మేలును చేస్తాయి.  మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.



ఈ మల్లె పూలల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ మల్లేల రసాన్ని, గులాబీల రసాన్ని కొద్దిగా గుడ్డు తెల్ల సోనా వేసుకొని ఫ్యాక్ లా చేసుకొని కనుక వేసుకుంటే ముఖం ఏంటో మృదువుగాను , అందంగా నిగనిగలాడుతుంది. చూసారుగా అలంకరణకు వాడే ఈ పువ్వుల్లో ఎన్ని లాభాలున్నాయో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: