నేడు అంతర్జాతీయ బాలిక దినోత్సవం. చెల్లిలా, తల్లిలా, స్నేహితురాలిలా.. మనకు జీవితాంతం తోడుండేది ఆడపిల్లే. చదువులో, ఉద్యోగంలో, ఇంటా బయటా ప్రతిచోటా ఒక ధీరలా, ప్రజ్ఞావనిలా రాణిస్తుంది. అన్ని రంగాలలో మహిళలు వారి సత్తా చూపుతున్నారు. అలాంటి ఆడపిల్లలకు ప్రతి చోటా కష్టాలే. అలాంటి ఆడపిల్లలకు ఎక్కడ భద్రత లేదు. ఎలాంటి చోట భద్రత లేకుండా పోతుంది. 


కొన్ని కుటుంబాలలో ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అని పండుగా చేసుకుంటారు. ఆడపిల్ల లేనిదే సృష్టి లేదు. ఈ కాలంలో ఆడపిల్లలు సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు. ఎన్ని సమస్యలు వచ్చిన మాకు మేము పరిష్కరించుకోగలం అని నిరూపిస్తున్నారు. ప్రతి రంగంలో మీకంటే మేమె ముందుంటాం అని ఆడపిల్లలు నిరూపిస్తున్నారు. 


ఒకప్పుడు తల్లితండ్రులు కూతురి పెళ్లి అంగరంగా వైభవంగా జరిపి అత్తవారింటికి పంపిస్తే కట్నం తక్కువ అయ్యిందని, కూరలో ఉప్పు లేదని, పచ్చడిలో కారం తక్కువ అయ్యిందని చిత్రహింసలు పెట్టి పుట్టింటికి సాగనంపే వారు. పుట్టింటికి వెళ్తే భర్తను వదిలి రాకూడదని మళ్ళి నరకం లాంటి ఆ ఇంట్లోనే వదిలి వచ్చేవారు తల్లిదండ్రులు. అత్తమామల వేధింపులు భరించిన అన్ని రోజులు భరించి పుట్టింటికి శవం అయి తిరిగొచ్చేది. 


20 ఏళ్ళు అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్ళైన 6 నెల్లకే శవం అయి తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఇది అంత 1990 కాలంలో జరిగేది. ఈకాలంలొ సీన్ రివర్స్. కన్నకూతురు పెళ్లి అయ్యే వరుకు కూడా ఉండటం లేదు. పుట్టిన పాపనే రేప్ చేసే రోజులు వచ్చాయి. నిర్మానుష ప్రదేశాలలో ఆడపిల్ల కనిపించిందంటే చాలు అత్యాచారాలు చేస్తున్నారు. ఆఖరికి 9 నెలల పసికందుని కూడా రేప్ చేశాడు ఓ దుర్మార్గుడు. ఆడపిల్లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆడపిల్లను కాపాడండి.. పునర్జన్మను పొందండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: