ఏజ్ పెరిగితే అందం తగ్గిపోవడం జరుగుతుంది.. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న కాలుష్యాల వల్ల కానీ, మారిన ఆహారపు అలవాట్ల వల్ల అతి చిన్న వయసులోనే ముసలి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. చర్మానికి పూర్వ వైభవఎం తీసుకు రావడం కోసం చాలా రకాలుగా కష్టపడుతుంటారు. చర్మ సంరక్షణ కోసం ఏది వాడాలి, ఏది వాడొద్దు… ఏది వాడితే బాగుంటుందనే అనుమానంలో ఉంటుంటారు. చర్మం కొద్దిగా మెరుపు కోల్పోయినా ఏదో పోయినట్లుగా భావిస్తుంటారు. ఎటువంటి నష్టం వాటిల్ల కుండా చర్మాన్నీ అందంగా తయారు చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. 

చర్మానికి చెమట పట్టడం .. 
చర్మనైకి చెమట పట్టే పని అంటే వ్యాయామం లాంటివి ఎక్కువగా చేయడం వల్ల చర్మంపై ముడుతలు అనేవి రాకుండా యవ్వనంగా ఉంటారట.. 

పడుకోవటానికి ముందు.. 
ప్రతీ రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్ ఆయిల్‌లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ సులువుగా వదిలిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో కడుక్కొని, మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారం .. 
నీరు ఎక్కువగా ఆన్న ఆహరం అంటే ముఖ్యంగా పండ్లు గుర్తుకు వస్తాయి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవడం ద్వారా చర్మం లేతగా కనిపిస్తుంది. వీటితో పాటుగా నీటి శాతాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. 

చర్మం పొడిబారుతుందంటే..
సాధారణంగా మన చర్మం పొడిబారుతోందంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్థం. ప్రతీ రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. అయితే ప్రతీ రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలికొనలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాస్తూ ఉండాలి. వారానికి రెండు మూడు సార్లు తేనెను ముఖనైకి రాసి చల్లని నీళ్లతో కడిగేసుకోవడం చేస్తే మంచి ఫలితం ఉంటుందట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: