కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. దేవభూమి గా ప్రసిద్ధి చెందిన కేరళ లో మహిళలతోపాటు,  పురుష సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతున్న ట్లు సర్వేలో వెల్లడైంది.  ప్రస్తుతం కేరళలో 17  వేల  మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా  పని చేస్తుంటే,  వారికి ఏ మాత్రం తీసిపోకుండా పురుషులు  సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు . దాదాపు 13 , 331 మంది పురుషులు సెక్స్ వర్కర్లుగా  పని చేస్తున్నట్టు సర్వే నివేదిక తెలిపింది.


కేరళ లో  సెక్స్ వర్కర్ల   సంఖ్య ఏటేటా ఊహించని విధంగా పెరుగుతోంది. కేరళలోని  పల్లెటూర్ల నుంచి నగరాలకు వలస వెళ్లే వారు ఈ బాట  పడుతుండగా ,  ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటోందని సర్వే నివేదికను బట్టి తెలుస్తోంది .  బెంగాల్,  బీహార్ , ఓడిశా  నుంచి కేరళకు వలస  వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు , ఆ తరువాత  వారి చుట్టాలను స్నేహితులను కూడా ఈ వృత్తిలోకి  తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది . ఇక  బెంగాల్ నుంచి వేల సంఖ్య లో  సెక్స్ వర్కర్లు సరిహద్దులు దాటి కేరళకు వస్తుండడం ఆందోళన కలిగించే పరిణామమని సర్వే సంస్థ పేర్కొంది .


 కేరళలోని  కోజి కోడ్  జిల్లా లో మగ సెక్స్  వర్కర్లు అధికంగా ఉన్నారని , వారిలో చాల  మంది డ్రగ్స్ కు అలవాటు పడ్డారని సర్వే సంస్థ తెలిపింది .  పురుష సెక్స్ వర్కర్ల లో 30 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నారని, వీరు  పలు నగరాల్లో ఉన్న హోటళ్లలో ,  ప్లాట్ల ఉంటూ ఈ వృత్తిని నిర్వహిస్తున్నారని వెల్లడించింది . ఇప్పటివరకు ఈ వృత్తిలో కొనసాగిన వారు  వయసు మీద పడిన వారు ఏజెంట్ గా మారుతున్నారని సర్వే నివేదిక ద్వారా తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: