కావలిసిన పధార్థాలు : మువ్వ వంకాయలు : 5 జీడిపప్పుగుండ్లు : 20  గసగసాలు :2 చెంచాలు కొబ్బరి తురుము : 1 కప్ ధనియాలు : 1 చెంచా పచ్చిమిర్చి : 10 ఉల్లిపాయలు : 1 పెద్దది చింతపండు, ఉప్పు,: సరిపడినంత  పసుపు, నూనె, కొత్తిమీర : సరిపడినంత తయారీ చేయువిధానం : పుచ్చులులేని వంకాయలు చూసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలను సన్నని ముక్కలు చేయాలి. పై సామాగ్రీని మెత్తగా రుబ్బి దాంట్లో ఉల్లి, కొత్తీమీర ముక్కలు వేసి బాగా కలిపి ఉంచాలి. వంకాయల తొడిమలు వుంచి నాలుగు పక్షాలుగా కోసి దాంట్లో రుబ్బిన ముద్దను సరిపడ పెట్టాలి. అన్నీ పెట్టి బాండీలో నూనె కాగిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కూరిన వంకాయలను నూనెలో దోరగా వేపి కొంచెం నీరు పోసి కలిపి మూతపెట్టాలి, సన్నని మంట మీద వుంచి మాడకుండా కలియతిప్పుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత దించి వేడి వేడి అన్నంలో తినాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: