Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Rama Krishna Rao Parisa

Email: [email protected]

Mobile: 9866419999

మయాబజార్ ప్రియదర్శినిలో భవిష్యత్ కనిపించినట్లు - హుజూర్ నగర్ విజయంలో కేసీఆర్ భవిష్యత్ కనిపిస్తుందా?
మయాబజార్ ప్రియదర్శినిలో భవిష్యత్ కనిపించినట్లు - హుజూర్ నగర్ విజయంలో కేసీఆర్ భవిష్యత్ కనిపిస్తుందా?

హుజూర్ నగర్ విజయం తెలంగాణా ముఖ్యమంత్రిలోని అహకారకారాన్ని అవధులు దాటించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. "ఆర్టీసీని ఈ భూమండలంలో ఎవరూ కాపాడలేరు? ఇక అది ముగిసిపోయిన చరిత్ర" ....ఆ స్వరం లోని కాఠిన్యం ఓటెసి టీఆరెస్ ను గెలిపించిన హుజూర్నగర్ వాసులకే ధిమ్మ తిరిగేలా చేసింది. కారణం గత దశాబ్ధాలుగా వేళ్ళూనుకున్న ఆర్టీసిని ఆ ఉద్యోగులను పూచిక పుల్లతో సమానంగా తీసేసిన కేసీఆర్ తీరు జనాల్ని అవాక్కుకు గురిచేసింది. హుజూర్ నగర్ విజయం నంద్యాలను గుర్తుచేస్తుంది – కేసీఆర్ పతనానికి ఇదే నాంది కానుందా?

గవర్నర్ గిరీ అంటే ఏమిటో చూపిస్తున్నారు తమిళసై! ప్రగతి భవన్ గడపదాటని కేసీఆర్ కు చుక్కలే ఇక!
గవర్నర్ గిరీ అంటే ఏమిటో చూపిస్తున్నారు తమిళసై! ప్రగతి భవన్ గడపదాటని కేసీఆర్ కు చుక్కలే ఇక!

పదవి ఏదైనా అర్హతలేవైనా ఎం-పవర్మెంట్ అనేదొకటుంది. ప్రజాసేవలో తరించాలంటే ముఖ్యమంత్రే కానవసరంలేదు. ఒక పదవిని అలకరించిన వ్యక్తి తనకున్న ఎంపవర్మెంట్ పగ్గాలు విదిల్చితే చాలు – నిద్రావస్థలో ఉన్న ఇరుగు పొరుగు వారిలో కదలిక రాక తప్పదు. ఇప్పుడు తెలంగాణ గవర్నరు తమిళసై తన సేవాదృక్పథంతో పెట్టే పరుగులు ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావులో కంపం పుడుతుంది. ఆమె తెలంగాణ గవర్నరుగా పదవి చేపట్టి స్వల్ప కాలమే అయినా – తెలంగాణా ప్రజల్లో చాలా చురుగ్గా మమేకమవబోతున్నారని అభిఙ్జవర్గాల బోగట్టా.

కేటీఆర్! ఇప్పటికైనా నగర ట్రాఫిక్ రద్దీకి మోక్షం కలిగిస్తారా?
కేటీఆర్! ఇప్పటికైనా నగర ట్రాఫిక్ రద్దీకి మోక్షం కలిగిస్తారా?

తెలంగాణా ఏర్పడి ఆరేళ్ళైంది. ఒక ప్రక్క ప్రజలు అల్లల్లాడి పోతున్నారు. మరో ప్రక్క నగర రోడ్ల దీనావస్థపై మీడియా గగ్గోలు పెడుతూ వస్తుంది. దినదిన ప్రవర్ధమాన మౌతున్న నగరంలో అదే స్థాయికి మించి ట్రాఫిక్ రద్ధీ కూడా దినదిన ప్రవర్ధమాన మౌతుంది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న “స్లిప్-రోడ్ల" ను - ప్రధాన రహదార్లకు అనుసంధానించే చిన్న రహదార్లు పైన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు.

కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా
కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా

"తెలంగాణ ప్ర‌జ‌లు నిరుపేదరికాన్నైనా భరించగలరేమో గాని దొర‌త‌నాన్ని, నియంతృత్వాన్ని, అణచివేతలను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీకరించరు - ఇప్పుడు కేసీఆర్ కూడా నియంతృత్వ ధోర‌ణి తో వ్యవహరిస్తున్నారనే భావ‌న ప్ర‌జ‌ల్లో క్రమంగా బలపడుతుంది" ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంట న‌డించింది. స‌క‌ల జ‌నులూ ఉద్యమానికి జేజేలు ప‌లికారు. ఇప్పుడు అదే తెలంగాణ స‌మాజం మొత్తం కేసీఆర్‌కు క్రమంగా వ్య‌తిరేక‌ మ‌వుతోంది. ఊద్యోగ వర్గాలతో సహా స‌క‌ల జ‌నులు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఆయ‌న ఫ్లెక్సీలు, ఫొటోలు ఎక్కడి కక్కడ

ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!

మీడియా ఒక అనామకుణ్ణి హీరో చేస్తుంది. అదే మీడియా తనకు నచ్చకపోతే ఆ హీరోనే కాదు ఇంకో హీరో నైనా అధఃపాతాళంలోకి తొక్కేస్తుంది. అయితే రాజ‌కీయ నాయ‌కుల కు అనుక్షణం అనుసరించే వాళ్లుండాలి – అంటే ఫాలోయింగ్ అన్నమాట. కొందరు "మీడియా ఎడిక్ట్స్" ఉంటారు వాళ్ళు ఏ ఒక్క రోజు మీడియాలో కనిపించకపోయినా చానల్స్ లో ఏ ఒక్కరోజు త‌మకు సంబంధించి వార్తలు కానీ, ఫొటో కానీ న్యూస్ పేపర్లోనో, టివి చానల్లోనో క‌నిపించ‌క‌పోయినా వాళ్ళు బిక్క చచ్చిపోతూ ఉంటారు. ఆకలై సమయానికి పాలు అందకపోతే పసిపిల్లలు ఎలా అల్లాడిపోతుంటారో! అలా అన్నమాట.

రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!

రోం నగరం తగలబడుతుంటే చక్రవర్తి నీరో పిడేల్ వాయిస్తూ తన్మయత్వంలో ఉన్నారట. దాన్నే ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. గత రెండు వారాలుగా నిరంతరం ప్రజా రవాణా వ్యవస్థ - టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కారణంగా దాదాపు ప్రభుత్వం చెప్పుకుంటూ చేసే అరకొర ఏర్పాట్లు ఏ మూలకూ సరిపోకపోగా దాదాపు మూతపడింది. అటు ముఖ్యమంత్రి మంకుపట్టు, ఇటు టీఎస్-ఆస్ర్టీసి ఉద్యోగులు తమ సంస్థ ప్రయివేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొనే సమ్మె - సమ్మెట పోటుకు బలయ్యేది ప్రజలే.

అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!

పట్టు విడుపులున్న రాజకీయ నాయకత్వం గాని, కుటుంబ యాజమాన్యం గాని ఓటమి పాలైన సందర్భాలు దాదాపుగా లేవు. పిల్లలు బైకు కొనిపెట్టలేదనో, మోబైల్ కొనలేదనో తండ్రిపై అలగడం కుటుంబంలో అతి సాధారణం. భుజ్జగించో, బామాలో, తల్లి ప్రేమను ప్రయోగించో, కొంత సంధికి వచ్చో కుటుంబ సౌహార్ధ్ర జీవనాన్ని తండ్రి విజయవంతంగా నడిపించినట్లే, ఉద్యోగులు తమ కోరికలు తీర్చుకోవటానికో, దేశ విశాల ప్రయోజనాలు సాధినచటానికో, సమ్మె పేరుతో అలిగితే – వారిని తల్లి తండ్రిలా లాలించో, లాలిపప్ ఇచ్చో దారికి తెచ్చుకోవటం ముఖ్యమంత్రి తక్షణ కర్తవ్యం.

పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక

సుస్థిర సువిశాల లౌకిక ప్రజాస్వామిక రాజ్యం, ప్రపంచలోనే అధిక జనాభా గల దేశం భారత్. పౌరాణిక కాలం అంటే జనపదాల దశలోనే ప్రజలకు ప్రజాస్వామ్య రుచి చూపిన దేశం. నాటి "వైశాలి" ప్రపంచం లోనే తొలి ప్రజాస్వామ్య దేశం. అలాంటి శక్తివంతమైన భారత్ అంతర్గత విషయాల్లో సైనిక నియంతల పాలనలో నిరంతరం ప్రజలను బానిసలుగా మార్చిన - ఒక మత రాజ్యం - "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్" - కమ్యూనిస్ట్ పాలనలో తరతరాలుగా మ్రగ్గుతూ ప్రజాస్వామ్య వాసనలే తెలియని పేరుకే "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" తలదూర్చటానికి ప్రయత్నించటం సిగ్గుచేటు.

జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ సీపీఐ ఝలక్?
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ సీపీఐ ఝలక్?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికతో పాటు టిఎస్-ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా సెగలు రాజేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నిక మీద కూడా ఉంటుందని తేలిపోయింది. ఈ సమ్మె ఎఫెక్ట్ హుజుర్ నగర్ లో సీపీఐ-టీఆర్ఎస్ ల మధ్య చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ తాజాగా సోమాజిగూడ ప్రెస్-క్లబ్ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.

జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరును వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ఆ క్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల వర్షం హాట్ టాపికైంది. టిఎస్ ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడ ప్రెస్-క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన హైకోర్టు

కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?
కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?

బంగారు తెలంగాణా సంగతెలా ఉన్నా రాష్ట్రంలో బాంగారు కుటుంబానికి ఢోకా లేదని, కేసీఆర్ రాచరికాన్ని జ్ఞప్తికి తెచ్చే నియంతృత్వానికి అడ్డేలేదని ఇప్పుడు తెలంగాణా ప్రజలు బహిరంగగానే అంటున్నారు. నగరం తగలబడుతున్నా ఎవడో రాజు ఫిడేల్ వాయిస్తూ కాలయాపన చేసినట్లు - మన కేసీయార్ కూడా ₹150 కోట్ల ప్రజాధనంతో అతి విలాసవంతంగా రాజమహలు ని తలపించే ప్రగతి భవన్ లో కూర్చొని లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఇంటర్మీడియట్ బోర్డ్ చెలగాటమాడినా, పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా, చలనం కూడా ప్రదర్శించ లేదనేది

సైరా తో మెగాస్టార్ వైభవం దిగజారింది - విమర్శకులు సైతం విఫలమయ్యారు
సైరా తో మెగాస్టార్ వైభవం దిగజారింది - విమర్శకులు సైతం విఫలమయ్యారు

మనదేశం ప్రజల చేతేకాదు, బ్రిటీష్ తదితర వలస పాలకులచేత సైతం అగౌరవం మూటగట్టుకున్న వ్యవస్థ పాలెగాళ్ళ వ్యవస్థ. బ్రిటీష్ లేదా వలస పాలకుల ప్రతినిధులుగా ఉంటూ ప్రజలను పీడించి పన్నులు వసూల్ చేసే వీళ్ళని నాడు భారత జాతి అసహ్యించుకుంది. అలా ప్రజాపీడన ద్వారా వసూలు చేసిన పన్నులను పూర్తిగా బ్రిటీష్ వాళ్ళకు కట్టకుండా తమ స్వార్ధం చూసుకునే వీళ్ళని బ్రిటీష్ వాళ్ళు సైతం అసలు నమ్మలేదు. సరికదా ఫుల్లుగా వాడేసుకున్నారు. అలాంటి వాడు తనకు రావలసిన భరణం కోసం బ్రిటీష్ ప్రాంతీయ ప్రతినిధులపై దాడి చేసిన సందర్భాన్ని

పూర్తిగా పతనమైనా టిడిపి కులగజ్జి హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికలో సైతం వదల్లేదా?
పూర్తిగా పతనమైనా టిడిపి కులగజ్జి హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికలో సైతం వదల్లేదా?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి తీవ్రత అంతా ఇంతా కాదు. గతంలో ఈ కులగజ్జి తెలంగాణాలో ఏదో మూలన స్వల్పంగా ఉండేది. హైదరాబాద్ నగరం విశాలాంద్రకు రాజధాని కావటం ఆపై ఆంధ్రప్రజల వలసతో కులాభిమానం ప్రభావం తెలంగాణాకు కూడా దిగుమతైంది. ముఖ్యంగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశంపార్టీ ప్రాభవంతో - "క్రిష్ణా, గుంటూరు"-జిల్లాల నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గం రాష్ట్రంలోని అన్ని అంటే రాజకీయ, మీడియా, సినిమా & వినోదం, పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, గుత్తేదార్ రంగాల్లో వ్యాపించటమే కాదు

ముస్లింలపై చైనా దమనకాండ! తెలిసినా కిమ్మనని పాక్–మరి కాశ్మీర్ విషయంలో ఇమ్రాన్ కుప్పిగంతులెందుకు?
ముస్లింలపై చైనా దమనకాండ! తెలిసినా కిమ్మనని పాక్–మరి కాశ్మీర్ విషయంలో ఇమ్రాన్ కుప్పిగంతులెందుకు?

కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగం. దానిపై స్పందించే అర్హత పాకిస్తాన్ కు మాత్రం లేదు. ప్రభుత్వం తప్పు చేసిందనిపిస్తే ప్రజాస్వామ్య భారత ప్రజలకు సరిదిద్దుకునే సామర్ధ్యం ఉంది. దానికి పాక్ చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చట్టాలను సందర్బాలను అవసరాలను బట్టి సవరించుకునే అవకాశం భారత రాజ్యాంగం వారికి ఇచ్చింది. దాదాపు 75 ఏళ్ళ నుండి మత పిచ్చితో కాశ్మీరును అడ్డంపెట్టుకొని భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాలం గడుపుతూ వస్తుంది పాక్ ప్రభుత్వం. ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న సమగ్ర నిర్ణయంతో పాక్ పాలకులకు

జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం సంచలనం సృష్టించిన టిడిపి ఉత్థాన పతనాలు? నాయకత్వ మార్పు అత్యవసరమా?
జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం సంచలనం సృష్టించిన టిడిపి ఉత్థాన పతనాలు? నాయకత్వ మార్పు అత్యవసరమా?

తాజాగా తన చిరకాల ప్రత్యర్థి, ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారో - ఆ కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. తెలుగుదేశం పుట్టింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ఆ పార్టీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోని ఏకైక పార్టీ అని ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకున్న తెలుగుదేశం నాయకులు, తరువాత - "తెలుగుదేశం పుట్టింది రాష్ట్రాలపై దిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా, అప్పట్లో ఆ పని కాంగ్రెస్ చేసింది కాబట్టి వారికి వ్యతిరేకంగా, ఇప్పుడు పెత్తనం బీజేపీది కాబట్టి వారికి వ్యతిరేకంగా తమ పోరాటం" అంటూ వివరణ ఇచ్చుకున్నారు.

దేశం ఆర్ధిక మందగమనం వీడి పరుగులు పెట్టేదెప్పుడు?
దేశం ఆర్ధిక మందగమనం వీడి పరుగులు పెట్టేదెప్పుడు?

డబ్బు అవసరాలకు తగినంతగా అందుబాటులోకి రాకపోవటమే "ఆర్ధికమంద గమనం" అనే దానికి నాంది మాత్రమే కాదు ప్రస్థావన కూడా! అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు - డిమాండ్ బాగా తగ్గి వస్తువులు అమ్మకాలులేక - గిడ్డంగుల్లో పేరుకు పోయినప్పుడు - సేవలు అందుబాటు లోకి రానప్పుడు వినియోగదారుల్లో అనిశ్చితి గాని భయంగాని కలవరంగాని ఏర్పడి అస్థిరత్వం ప్రబలి - "ఖర్చుపెట్టే" ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసుకునే పరిస్థితి - ఆర్ధిక వాహినుల్లో ధనప్రవాహం తగ్గిపోవటానికి కారణమై - ఆర్ధిక మందగమనాన

కొత్తపుంతలు తొక్కనున్న ఏపి రాజకీయం - బాబు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న బీజేపి రాంమాధవ్
కొత్తపుంతలు తొక్కనున్న ఏపి రాజకీయం - బాబు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న బీజేపి రాంమాధవ్

వారణాశి రామ్‌ మాధవ్‌ - ఉరఫ్ రామ్‌ మాధవ్‌ - భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ప్రధానంగా ఫోకస్ అవుతున్న భావి భారత బీజేపి ప్రధాని అభ్యర్ధి - రచయిత మరియు జర్నలిస్టు - అనేక పుస్తకాలను రచించాడు. అతడు రాసిన ప్రస్తుత పుస్తకం "అన్‌ ఈజీ నైబర్స్" (50 యేళ్ళ యుద్ధం తరువాత భారత మరియు చైనా) అంతేకాదు కాశ్మీర్ నుండి సెవెన్ సిస్టర్స్ అనబడే ఉత్తర ఈశాన్య రాష్ట్రాలను ముఖ్యంగా అస్సాంను బీజేపికి దగ్గర చేసిన రాజకీయ వ్యూహకర్త - విజయాలను ధీటుగా రచించగల ప్రొఫెషనల్

జగన్ మంత్రాంగ ఫలితం: ఎపికి కేంద్రం తీపి కబురు
జగన్ మంత్రాంగ ఫలితం: ఎపికి కేంద్రం తీపి కబురు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఒక తియ్యని కబురు చెప్పింది. అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి పచ్చ జండా ఊపింది. ఇది నిర్ద్వంధంగా సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి సాధించి పెట్టిన గురుతర విజయం. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకెంతో ఆనందదాయకం. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలో (సెక్రటేరియట్) ఈనెల 8న అడుగు పెట్టిన తర్వాత జగన్ చేసిన తొలి మూడు సంతకాలలో ఒకటి అనంతపురం-అమరావతి ఎక్స్

ఐటీ-గ్రిడ్ అశోక్‌కు ముందస్తు బెయిల్ - టి & సి అప్లై  - అన్నట్లు కొన్ని కఠిన షరతులు
ఐటీ-గ్రిడ్ అశోక్‌కు ముందస్తు బెయిల్ - టి & సి అప్లై - అన్నట్లు కొన్ని కఠిన షరతులు

నారా కుటుంబానికి అతి సన్నిహితుడని చెప్పబడ్డ ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్ కు కొంతలో కొంత ఊరట లభించింది హైకోర్టులో. ఆధార్, డేటా చోరీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటికి సంబంధించి ఆధార్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ అతను దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు అప్పగించాలని తదితర కండీషన్లు విధించింది హైకోర్టు. డేటా చోరీ, ఏపీ ప్రజలకు సంబంధించి ఆధార్, డేటా చోరీ చేశాడని ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్‌పై ఆధార్ సంస్థ ఫిర్యాదు చేసింది.

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...