Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kalyan Chakravarthi

Email: -NA-

Mobile: 8297513325

బిగ్ బ్రేకింగ్ : జగన్ ఆఫీసులో కరోనా కలకలం.. ఎవరెవరికి వచ్చిందంటే...?
బిగ్ బ్రేకింగ్ : జగన్ ఆఫీసులో కరోనా కలకలం.. ఎవరెవరికి వచ్చిందంటే...?

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అది ఇప్పుడు ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర డ్యూటీలో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒకరికి కరోనా నిర్థరణ అయ్యింది. ఆయన కర్నూలు నుంచి నాలుగు రోజుల క్రితం డ్యూటీ కోసం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాజాగా ఆయనకు కరనా పాజిటివ్‌ అని వైద్యులు తేల్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలోని మిగిలిన సిబ్బందికి వైద్యపరీక్షలు చేశారు. ఏపీ ఎస్సీ కానిస్టేబుళ్లను విధుల నిర్వహరణ నిమిత్తం అక్కడకూ ఇక్కడకూ మారుస్తుంటారు. అందులో భాగంగానే ఈ కానిస్టేబుల్ ను కర్నూలు నుంచి రప్పించారు. ఆయనతో పాటు మరికొందరు కర్నూలు నుంచి విధుల కోసం వచ్చారు. వీరికి మంగళగిరి సివిల్‌ పోలీసు క్వార్టర్స్‌లో అకామడేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కు కరోనా ఉందని తేలడంతో మిలిగిన వారిని కూడా ఖాళీ చేయించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనే కాదు.. ఏపీ సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో సచివాలయంలో పని చేసే ఒకరికి కరోనా నిర్థరణ అయ్యింది. గుంటూరు కార్యాలయాల్లో పని చేసే ఇద్దరికీ కరోనా నిర్థరణ అయ్యింది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన సెక్రటేరియట్, హెడ్డాఫ్ ది డిపార్ట్‌మెంట్‌ ఉద్యోుగులు ఇటీవల ప్రత్యేక బస్సుల్లో అమరావతికి వచ్చారు. అక్కడ వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ముగ్గురికి కరోనా వచ్చినట్టు తేలింది. సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా వచ్చిందని తేలడంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు.

కరోనా గురించి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక భయపడాల్సిన పని లేదా..?
కరోనా గురించి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక భయపడాల్సిన పని లేదా..?

కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి.. భారత్ లో కూడా ఇటీవల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజూ కనీసం ఆరు, ఏడు వేల కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త నయం. అయితే కరోనా గురించిన ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు వైద్య నిపుణులు. అదేమిటంటే.. కరోనా వచ్చిన వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే వైద్యం అవసరం అవుతుందట. మిగిలిన 95 శాతం మంది అసలు వైద్యం అవసరం లేకుండానే కరోనా నుంచి బయటపడతారట. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులకు ఇంట్లోనే ఉండొచ్చు. హోం క్వారంటైన్ లో ఉండొచ్చు. అంతే కాదు.. వసతి లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందువల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. కేసుల సంఖ్య ఎంత పెరిగినా మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ప్రజలు బయట సంచరిస్తున్న క్రమంలో కేసులు పెరగడం సహజం అంటున్నారు వైద్య నిపుణులు. అయితే అలాగని కరోనాను తేలిగ్గా తీసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేసులు ఎక్కువగా వస్తున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదట. ఎందుకంటే.. ఇక ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో కేసులు భారీగానే నమోదవుతాయట. అయితే కరోనా సోకినవారిలో ఐదు శాతం మందికే చికిత్స అవసరం అవుతున్నందువల్ల భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సో.. అందుకే కరోనా గురించి ఎక్కువగా ఆలోచించకండి.. ఎక్కువగా భయపడకండి.. కాకపోతే.. అవగాహన కలిగి ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంతే.

షాకింగ్: కన్నా కోడలు మృతికి అసలు కారణం అదే..? బాబోయ్.. ఇలా కూడా చనిపోతారా..?
షాకింగ్: కన్నా కోడలు మృతికి అసలు కారణం అదే..? బాబోయ్.. ఇలా కూడా చనిపోతారా..?

బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మొన్న అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అందులోనూ ఆమెను కన్నా కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె హఠాన్మరణం వెనుక ఏం జరిగిందన్న కోణంలో అనేక కథనాలు వచ్చాయి. అయితే.. కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక ఎక్కువ సేపు డాన్స్ చేయడం వల్లే చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె డ్యాన్స్ బాగా చేసి అలిసి పోయి గుండె పోటుకు గురై ఉంటారని వైద్యులు అభిప్రాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆమె కొండాపూర్ లో ఒక ఫ్రెండ్ ఇంటి వద్ద జరిగిన పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో ఆమె చాలా సేపు డాన్స్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారట. బాగా డాన్స్ చేసిన తర్వాత ఆమె హఠాత్తుగా కింద పడిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత శవపరీక్ష చేసిన డాక్టర్లు కూడా ఇదే విషయం ధ్రువీకరించారట. ఆమె బాగా బాగా జోరుగా అలుపు లేకుండా వ్యాయామం చేసినట్టగా ఉందని శవపరీక్షలో వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె శరీరంపై వేరే గాయాలు లేవని.. శరీరంలోపల కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టు చెబుతోందట. అందువల్ల విపరీతంగా డాన్స్ చేయడమే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిందని వైద్యులు భావిస్తున్నారు. శవ పరీక్ష తర్వాత పోలీసులు భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. అయితే ఆమె చనిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా విపరీతంగా డాన్స్ చేసినా అది ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తుందా అని ఈ విషయం తెలిసినవాళ్లు షాకవుతున్నారు.

వైఎస్‌ జగన్‌ స్పందన : ఆ ముసలమ్మ మొహంలో విరబూసిన సంతోషం: అసలేమైంది..?
వైఎస్‌ జగన్‌ స్పందన : ఆ ముసలమ్మ మొహంలో విరబూసిన సంతోషం: అసలేమైంది..?

వైఎస్ జగన్ సర్కారు స్పందన కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరైనా సరే ఫిర్యాదు ఇస్తే.. తప్పకుండా దాన్ని అధికారులు పరిష్కరించాల్సిందే. ఈ కార్యక్రమం ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఓ చిన్న ఉదాహరణ ఇది. దీన్ని సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ తన ఫేస్ బుక్ వాల్‌ పై పంచుకున్నారు. “60 ఏళ్ల మా ఇంట్లో పనిచేసిన బీబీ రెండో భార్యగా పడాల్సిన కష్టాలన్నీ పడింది. ఇంట్లో తిండిపెట్టకపోగా, పనిచేసుకుని బ్రతికే ఆమె తరచూ ముసలాడిచేతిలో చావు దెబ్బలు తింటూ తన రెండో ఆడపిల్లకు కూడా పెళ్లిచేసింది తినీ తినక కూడబెట్టుకున్న దాంతో. ముసలాడికి మొదటిభార్యకు ముగ్గురు కొడుకులు, ఇతడు ఇచ్చిన స్థలంలో ఇండ్లుకట్టుకుని కాపురాలు చేసుకునే వాళ్లవద్ద నివసిస్తూ అప్పుడప్పుడు ఈమెవద్దకు వచ్చి తన్ని పోతుంటాడు. బీబీకి ఒక గుడిసె వుంది. పరిస్తితిని అర్థంచేసుకున్న వీధిలోని కమ్యూనిస్టులు గుడిసె స్థలం ప్రభుత్వ పట్టాని బీబీపేరున మార్పించి రెండు దశాబ్దాల కిందటే అభ్యుదయం చూపారు. బదిలీమీద వూరువదలే ముందు ఆస్థలం ఆమె తదనంతరం ఇద్దరు కూతుర్లకు చెందేలా నేను రాయించి వారికి జతకలిశాను. అయితే ఈ విషయాలు తెలియని ఆమె భర్తా, అతని కోడుకులూ ఆమెని అందులోంచి వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు.” "అందుకనుగుణంగా,ఇద్దరు కూతుర్లకి పెళ్లిచేసి, ప్రస్తుతం పక్షవాతం కారణంగా పాచిపనులు కూడా చేసుకోలేక ఇబ్బందిపడే బీబీని గుడిసెలోంచి వెళ్లగొట్టి ఆక్రమించాలని ముసలాడిని పంపిస్తారు. "నాకు ఈ మొగుడొద్దు, రాత్రిపూట చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను బ్రతకనీయండ"నేది బీబీ వాదన. "మొగుడుని ఈ వయసులో భార్యకాపోతే ఎవరు చూస్తారు? భర్త అన్నాక తన్నకుండా వుంటాడా" అనే చుట్టుపక్కల సమాజపు ప్రవచనాలు, చివరికి పోలీసుస్టేషన్్‌లో ముసలాడు, కొడుకులూ, కోడల్లూగల బలవైపు పంచాయితీ అనుకూలమైపోవడం, వూర్లోనే వున్న ఇద్దరు కూతుర్లు ఏడుస్తూ మా ఇంటికిరావడం జరిగినప్పుడు రెండుసార్లు స్టేషన్‌కి కూడా వెళ్లాల్సి వచ్చింది స్వయంగా.” "వూరువదలి వచ్చేటప్పుడు కొత్తముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన "స్పందన" అనే కార్యక్రమం కింద ఆమెకు క్లుప్తంగా లెటర్ రాసి కార్యక్రమంలో ఇవ్వమని వచ్చేశాం. అనుకున్నట్లే మరుసటిరోజే అంతవరకు నీతులు చెప్పి పంచాయితీ చెప్పిన పోలీసులు దగ్గరుండి మరీ ముసలాడిని సామానుతో సహా బయటికి వెళ్లగొట్టి మరోసారి ఇటువైపు రావద్దని, అతనికొడుకుల్ని హెచ్చరించి మరీ న్యాయం చేశారు.” "నెలక్రితం బీబీ ఇంటికి ఫోన్ చేసి, సారు రాసిచ్చిన చీటీ వల్ల ఇప్పటిదాకా ముసలాడు, అతడి కొడుకు కోడళ్లు ఇంటివైపు రాలేదని చేసిన మేలు ఎప్పటికీ తల్చుకుంటానని చెప్పిందట. నిజానికి తల్చుకోవాల్సింది నన్ను కాదని స్పందన కార్యక్రమం అని నాకు తెలుసు. అయితే పక్షం రోజులక్రితం మరల ముసలాడు వచ్చి గొడవచేశాడని పోలీసులు స్టేషన్‌కి రమ్మన్నారని ఫోన్ చేసి వాపోయింది. అక్కడ కరోనా డ్యూటీకోసం ఇంతకుముందున్న పోలీసులు లేరని ఏడ్చేసింది. ఏం ఫర్లేదు, ఈ కేసు "స్పందన"లో వుందని నీకు స్పందనలో రాసిచ్చిన రసీదు చూపించు, ఏమైనా అంటే నేను మాట్లాడతానన్నా. అమె చీటీ చూపించి విషయం చెప్పగానే ముసలాడిని, కొడుకుల్ని ఎస్సై తిట్టి వార్నింగ్ ఇచ్చి పంపేశారట, సంతోషపడుతూ ఫోన్ చేసింది. నువ్వు చచ్చేంత వరకూ నీ ఇంటికి ఎవరూ రారని, పోలీసులు ఏమీ అనరని, ఆ రసీదు నీదగ్గర పెట్టుకోమని చెప్పాను. చాలామంది బలహీనులకి ఈ కార్యక్రమం వూరట నిచ్చిందని విన్నాక ఇది చెప్పాలనిపించింది.” -0-

షాకింగ్ : నిమ్మగడ్డకు జగన్ షాక్ ట్రీట్‌మెంట్.. మామూలుగా లేదుగా...?
షాకింగ్ : నిమ్మగడ్డకు జగన్ షాక్ ట్రీట్‌మెంట్.. మామూలుగా లేదుగా...?

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జగన్ ఏడాది పూర్తి చేసుకున్న ఆనందం కూడా పూర్తిగా లేకుండా శుక్రవారం నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ సర్కారుకు ఇది చాలా పెద్ద దెబ్బే.. ప్రత్యేకించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో జగన్ సర్కారు ఢీ అంటే ఢీ అని ప్రవర్తించింది. నిమ్మగడ్డ ఎస్‌ఈసీ కొనసాగడం ఏమాత్రం ఇష్టం లేని జగన్.. ఆయన్ను తప్పించేందుకు ఏకంగా ఆర్డినెన్స్ ప్రయోగించారు. కానీ హైకోర్టు ద్వారా నిమ్మగడ్డ మళ్లీ జగన్ పై పైచేయి సాధించారని అంతా భావించారు. కానీ శనివారం అనూహ్యంగా జగన్ మరోసారి నిమ్మగడ్డకు ఝలక్ ఇచ్చారు. హైకోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ప్రకటన చేస్తూ మళ్లీ తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. అయితే.. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తాను ప్రకటించుకోవడం చెల్లదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటించారు. తాను హైకోర్టు జడ్జిమెంట్ సర్టిఫైడ్ కాపీ చూసిన తర్వాత, అందులోని అంశాల ఆధారంగా ప్రభుత్వానికి ఈ విషయం తెలిచేశానని ఆయన అంటున్నారు. రమేష్ కుమార్ తనకు తాను ఎన్నికల కమిషనర్ గా ప్రకటించుకోవడం చట్టవిరుద్దమని ఏజీ శ్రీరామ్ చెప్పారు. హైదరాబాద్ లో ఉండి ఆయన ఇక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. వాటిని పాటించవలసిన అవసరం లేదని తాను ప్రభుత్వ అధికారులకు తెలియచేశానని ఏజీ శ్రీరామ్ అన్నారు. ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిషన్ గా ఉన్న ప్రభాకర్ ను రాజీనామా చేయాలని రమేష్ కుమార్ కోరారని, ఆ విషయం తనకు ప్రభాకర్ తెలిపారని, తాను వాటిని పాటించవలసిన అవసరం లేదని చెప్పానని ఏజీ శ్రీరామ్ అన్నారు. అంతే కాదు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ ఎస్‌ఈసీగా మళ్లీ ప్రభుత్వమే నియమించాలని అప్పటి వరకూ ఆయన ఎస్‌ఈసీ కాదని శ్రీరామ్ తెలిపారు. ఇందుకు తమకు మరో 2 నెలల సమయం ఉందని శ్రీరామ్ చెప్పారు. అంటే ఇంకో రెండు నెలల వరకూ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదన్నమాట.

జగన్ పాలనకు ఏడాది - పండుగ చేసుకున్న సాక్షి- ఈనాడు..?
జగన్ పాలనకు ఏడాది - పండుగ చేసుకున్న సాక్షి- ఈనాడు..?

ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సంక్షేమమే తన ప్రాధాన్యంగా ఆయన పాలన సాగింది. ఏడాదిలోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టోను అమలు చేశానని ఆయన సగర్వంగా చెప్పుకుంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఇలా ఏడాది, రెండో ఏడాది, మూడో ఏడాది.. ఇలాంటి సందర్భాల్లో పత్రికలకు ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. జగన్ సర్కారు సాధారణంగా ఇలాంటి ప్రకటనలకు పెద్దగా ఇంట్రస్టు చూపించదు. గతంలో అనేక పథకాల సమయంలో జగన్ పెద్దగా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. కానీ.. మొదటి ఏడాది కాబట్టి ఈసారి బాగానే ప్రకటనలు ఇచ్చినట్టున్నారు. ప్రధానంగా సొంత పత్రిక సాక్షి అయితే ఏకంగా పండుగే చేసుకుంది. తమ అధినాయకుడు సీఎంగా ఏడాది పూర్తి చేసుకోవడం ఓ పండుగైతే.. ఆ సందర్భంగా కుప్పులు తెప్పలుగా ప్రకటనలు రావడం పత్రిక పరంగా మరో పండుగ అనే చెప్పాలి. తొలి ఏడాది సందర్భంగా సాక్షి పత్రిక ప్రకటనలతో నిండిపోయింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చినవే కాకుండా.. వివిధ సంస్థలు శుభాకాంక్షలు చెబుతూ ఇచ్చినవీ భారీగానే ఉన్నాయి. పత్రికలో తొలి 6,7 ఫుల్ పేజీలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. మరో మూడు పేజీలు వివిధ సంస్థలు శుభాకాంక్షల ప్రకటనలు వచ్చాయి. మొత్తం 23 పేజీల ఎడిషన్లో పది- పన్నెండు పేజీలు ప్రకటనలకే సరిపోయాయి. ఇక మిగిలిన పేజీల్లోనూ జగన్ సంక్షేమ పథకాల వివరణలతో సాక్షి ఫుల్లుగా పండుగ చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. జగన్ రోజూ తాను పసుపు మీడియాతో పోరాడుతున్నానని చెబుతుంటారు. అయినా సరే ఈనాడు పత్రికకు కూడా మొదటి పేజీ ఫుల్ యాడ్ ఇచ్చేశారు. కానీ పాపం.. ఆంధ్రజ్యోతికి మాత్రం అలాంటి అదృష్టం దక్కలేదు. అందుకే కాబోలు.. జగన్ పాలన ఫెయిల్ అని చెప్పకుండానే చెబుతూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో గ్రాఫిక్ ప్రజంటేషన్ స్టోరీ ఇచ్చింది. ఈ పత్రికలో కనీసం పావు పేజీ కూడా ప్రకటనలు ఇవ్వలేదు. కనీసం వివిధ సంస్థలు, నాయకులు కూడా ఇవ్వలేదు.

జీవిత సత్యాలు: మీరు అలాంటి పని చేస్తే.. ఎవరికీ చెప్పకండి సుమా..?
జీవిత సత్యాలు: మీరు అలాంటి పని చేస్తే.. ఎవరికీ చెప్పకండి సుమా..?

మనం మనుషులం.. ఎంతగా సమాజం కమర్షియల్ అవుతున్నా.. మనుషుల్లో మానవత్వం ఇంకిపోదు.. ఎంతటి రాతిగుండె అయినా ఏదో ఒక సమయంలో తడిబారుతుంది. ఏ హృదయ విదారక దృశ్యమో కనిపిస్తే అయ్యో పాపం.. అనకుండా ఉండదు. ఆపదలో ఉన్నవారికి మన వంతు సాయం చేద్దాం అనిపించకమానదు. తోటి మానవుడికి సాయపడటం కంటే భాగ్యం ఏముంటుంది. కానీ చాలా మంది దానాలు చేయరు. కొందరు పావలా దానం చేసి పది రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ప్రకృతి ప్రమాదాల సమయంలోనూ.. కరువు కాటకాల సమయంలోనూ దానాలు చేసే చాలా మంది వాటిని తమ వంతుగా ప్రచారమూ చేసుకుంటుంటారు. కానీ.. మనం చేసే దానం గురించి ఎవరికీ చెప్పకూడదట. దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదట. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుందంటారు పెద్దలు. దానినే గుప్త దానం అంటారు. గొప్పలు చెప్పుకుంటున్న భగవంతుని ఆగ్రహం తప్పదట. ఏదైనా మనది కాదు అని తెలిసిన మరుక్షణం అది మన వద్ద ఉంచుకోకూడదట. దాని వల్ల మన వద్ద ఉన్న మన స్వంత సంపదను దేవుడు మరింత తీసివేస్తాడట. అందుకే దానాలు చేసినా వాటి గురించి ప్రచారం చేసుకోకండి. మనం చేసిన దానం ఊరికే పోదు. కష్టకాలంలో మనకూ ఇంకొకరు సాయం చేస్తారు. చేయందిస్తారు.

హెరాల్డ్ విశ్లేషణ: జగన్ ఏడాది పాలనలో మైనస్ పాయింట్లు ఇవే..?
హెరాల్డ్ విశ్లేషణ: జగన్ ఏడాది పాలనలో మైనస్ పాయింట్లు ఇవే..?

ఏపీ సీఎం గా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆయన పాలనలో తండ్రి మార్కు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. ఆ విషయం ఆయన ముందే చెప్పారు కాబట్టి ఈ విషయంలో జగన్ ను తప్పుబట్టలేం. తన మేనిఫెస్టో ప్రకటించిన తీరుగానే ఆయన ముందుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో పాలనలో అనేక తప్పుటడుగులూ పడుతున్నాయి. అధికారంలోకి రాగానే జగన్ ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను మూసేయించారు. అది టీడీపీ పథకం అయినా పేద ప్రజలకు తిండి పెట్టేదే. పోనీ దాన్ని రాజన్న క్యాంటీన్లుగా మారుస్తామని చెప్పినా ఇంత వరకూ అమలు కాలేదు. అలా పేదోడి నోటి దగ్గర ముద్ద పోయింది. అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ పై నిర్ణయం తీసుకోకుండానే పాత ఇసుక పాలసీని రద్దు చేశారు. దీంతో ఇసుక కొరత ఎక్కువై నిర్మాణ రంగం ఇబ్బందులు పడింది. 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్న కారణమో ఏమో కానీ జగన్ చాలా విషయాల్లో దూకుడుగా ముందుకు వెళ్లి దెబ్బ తిన్నారు. ఇలాంటి అంశాలు ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. వాటిలో రాజధాని మార్పు అంశం ఒకటి. రాజధాని మార్పు నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ అందుకు ఆయన రాజ్యాంగబద్దమైన పద్దతులు అవలంభించకపోవడమే సమస్యగా మారింది. శాసనమండలి రాజధాని బిల్లును ఆమోదించలేదని ఏకంగా దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది కేంద్రం చేతిలో ఉన్న నిర్ణయమే అయినా దూకుడుగా తీసుకున్నారు. ఇప్పటి వరకూ దాన్ని రద్దు చేయలేకపోయారు. అసలు మండలిని కొనసాగించి ఉంటే.. ఈ పాటికి రాజధాని బిల్లుకు ఆమోదం కూడా వచ్చి ఉండేదేమో. అంతే కాదు.. ముందు ముందు మండలిలో వైసీపీకే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేది.

హెరాల్డ్ విశ్లేషణ: జగన్ ఏడాది పాలనలో ప్లస్ పాయింట్లు ఇవే..?
హెరాల్డ్ విశ్లేషణ: జగన్ ఏడాది పాలనలో ప్లస్ పాయింట్లు ఇవే..?

ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఏడాది పాలనతో అతడిని బేరీజు వేయకపోయినా.. ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చెప్పేందుకు ఏడాది సరిపోతుంది. జగన్ జనంతో ఓటు వేయించుకునే ముందే తన లక్ష్యం ఏంటో చెప్పేశాడు. తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో రెండు పేజీల మేనిఫెస్టోలో చెప్పేశాడు. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఆ మేనిఫెస్టోను అమల్లోకి పెట్టడమే. అసలు జగన్ మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో ఇది సాధ్యమా అన్నవారు చాలా మంది. బడుగులకు రెండు వేలు దాటిని ఫింఛన్, అమ్మఒడి, పూర్తిస్థాయి ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు భరోసా, రూ. 1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి.. రైతుల కోసం మార్కెట్ స్థిరీకరణ నిధి.. ఇలాంటి ఎన్నో హామీలు జగన్ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవన్నీ బడుగుల సంక్షేమం కోసం లక్షించినవే. సాధారణంగా రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన 2, 3 ఏళ్లు పెద్దగా సంక్షేమంపై దృష్టి సారించరు. చివరి రెండు మూడేళ్లలో సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఇప్పుడు చేసినా జనం మరిచిపోతారని.. ఓటేసే ముందు పథకాలు అందిస్తే బాగా గుర్తు పెట్టుకుంటారని.. కానీ జగన్ ఇందుకు పూర్తిగా భిన్నం. అధికారంలోకి వచ్చిన వెంటనే తన మేనిఫెస్టోను ఫ్లెక్సీలు తయారు చేయించి తన కార్యాలయంలో పెట్టుకున్నాడు. తనతో పాటు మిగిలిన నేతలనూ అదే పని చేయమన్నాడు. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తన మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలను అమల్లో పెట్టేశాడు.. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అందులోనూ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిన బకాయిలే వేల కోట్లలో ఉన్నాయి. అయినా జగన్ వెరవలేదు. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించాడు. చివరకు కరోనా సమయంలోనూ వాహన మిత్ర డబ్బు అందించాడంటే.. తన మేనిఫెస్టోను ఆయన భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావిస్తున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ చెప్పిందే చేసుకుంటూపోతున్నాడు.

ఇక జగన్.. సీఎం జగన్ కాదు.. డాక్టర్ జగన్...?
ఇక జగన్.. సీఎం జగన్ కాదు.. డాక్టర్ జగన్...?

అదేంటి.. జగన్ సీఎం కాదు.. డాక్టర్ జగన్ అంటారేంటి అంటున్నారా.. అవును మరి.. ఆయన వైద్యరంగంలో అందిస్తున్న సేవలు చూస్తే.. ఆయన సీఎంగా కంటే.. ఓ మంచి వైద్యుడిగా ఎక్కువ సేవలు అందిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. వాటి దుస్థితి చూసే నేను రాను బిడ్డో అంటూ సినీ కవులు పాటలు రాశారు. కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల ముఖ చిత్రం మారిపోతోంది. వైఎస్ జగన్ ఆరోగ్య రంగానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆసుపత్రులు కడుతున్నారు. కొత్త పీహెచ్ సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులను పుష్కలంగా నియమించేందుకు పచ్చజెండా ఊపారు. 104, 108 సేవల కోసం కొత్త వాహనాలను సమకూరుస్తున్నారు. ఒక్కటేమిటి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సంక్షేమానికి కొత్త అర్థం చెబుతున్నారు వైఎస్ జగన్. గ్రామల్లో వైద్య సేవల కోసం ఊర్లోనే విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏఎన్‌ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అక్కడికే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్టు చేస్తారు. విలేజ్‌ క్లినిక్‌లో 54 రకాలకు సంబంధించిన మెడిసిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇంతకంటే పెద్ద వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తే.. ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే రెఫరల్‌ పాయింట్‌. 104, 108 వాహనాలు 20 నిమిషాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితిని గ్రామ స్థాయిలోకి తీసుకువస్తున్నారు. దాదాపుగా 13 వేలకు పైచిలుకు విలేజ్‌ క్లినిక్స్‌ అండ్‌ వార్డు క్లినిక్స్‌ తీసుకురాబోతున్నారు. వీటి నిర్మాణం కూడా 2021 మార్చి వరకు రెడీ అవుతాయి. వీటి కోసం రూ.2600 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అంతేనా.. 149 చోట్ల కొత్త పీహెచ్‌సీలు కట్టబోతున్నారు. 1138 పీహెచ్‌సీలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చబోతున్నారు. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు మారుస్తారు. మరో 16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తారు. గిరిజన ప్రాంతంలో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను కట్టబోతున్నారు. వీటికి ఆగస్టులో టెండర్లు పిలుస్తారు. రూ.12,270 కోట్లతో మూడేళ్లలో పూర్తిచేస్తారు. మరి ఇవన్నీ చూస్తే జగన్ ను సీఎం కంటే డాక్టర్ జగన్ అనడమే కరెక్టేమో అనిపించడం లేదూ.

చైనా విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ సంస్థకు కూడా భారీ షాక్..?
చైనా విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ సంస్థకు కూడా భారీ షాక్..?

కరోనా వ్యాప్తికి చైనా వైఖరే కారణమని మొదటి నుంచి మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై.. దానికి వత్తాసు పలుకుతుందన్న కారణంతో ప్రపంచ ఆరోగ్య సంస్థపై కొరడా జుళిపించాడు. చైనా దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించాడు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. అనేక చైనా కంపెనీలు అమెరికా చట్టాలని పాటించడం లేదని అమెరికా ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతోంది. కానీ ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా గట్టిగా స్పందించడం లేదు. కానీ కరోనా కారణంగా చైనాతో అమెరికా వ్యవహారం పూర్తిగా చెడిపోతున్నట్టే కనిపిస్తోంది. అందుకే ఏకంగా చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అయ్యింది. అంతే కాదు.. కరోనా విషయంలో చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కయిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వైట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కుమ్మక్కై ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమైందని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్‌ అంటున్నారు. అయితే ఇదంతా త్వరలో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మైలేజీ కోసం ట్రంప్ వేస్తున్న ఎత్తుగడలే అని విమర్శించే వారూ ఉన్నారు.

మేధో మథనం: జగన్ గుడ్ న్యూస్.. 9 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్...?
మేధో మథనం: జగన్ గుడ్ న్యూస్.. 9 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్...?

ఆరోగ్య రంగంపై దృష్టి సారించిన ఏపీ సీఎం వైఎస్ జగన్... ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై దృష్టి సారించారు. ఏకంగా 9 వేల మందికిపై నియమించాలన్న నిర్ణయంతో త్వరలో నోటిఫికేషన్ తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేకపోతే ఎంతచేసినా లాభం లేకుండా పోతుంది. అందుకే ఏయే ఆస్పత్రికి ఎంతమంది అవసరం అని.. జాతీయ ప్రమాణాలు ఐపీహెచ్‌ఎస్‌ ప్రకారం ఎంతమంది కావాలో వారందరినీ రిక్రూట్‌ చేసుకోవాలని జగన్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. దీని ప్రకారం.. అని ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చాం. 9,712 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర ఇబ్బందిని రిక్రూట్‌ చేసుకునేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. మరో వారంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాబోతోంది. నెలన్నర రోజుల్లో 9,712 మంది కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. అంతే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత కూడా తీర్చేస్తున్నారు. మెడిసిన్‌ సంఖ్య ఇంతకు ముందు గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో 230 ఉంటే.. దాన్ని 500 సంఖ్యకు పెంచారు. అంతేకాకుండా మెడిసిన్‌ డబ్లూహెచ్‌ఓ, జీఎంపీ అంటే గుడ్‌ మెడికల్‌ ప్రాక్టీసెస్‌ స్థాయి ఉన్న మెడిసిన్‌ మాత్రమే ఆస్పత్రుల్లో ఉంచుతున్నారు. అందుకే.. నేను గర్వంగా చెప్పగలుగుతా.. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాగాలేకపోయినా.. మన గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిలో మన ఆరోగ్యశ్రీలో ఉంది అని జగన్ గర్వంగా చెబుతున్నారు. త్వరలో ప్రాంతీయ డ్రగ్‌స్టోరేజ్‌ వ్యవస్థను కూడా తీసుకువచ్చేందుకు నిధులు మంజూరు చేశారు. అంతే కాదు.. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకోసం రూ.695 కోట్లతో టెండర్లకు సిద్ధం చేశారు. 169 సీహెచ్‌సీ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు రూ.541 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. మరో 15 రోజుల్లో టెండర్లు పిలుస్తారు.

జగన్ మేధోమథనం : వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మించి... జగన్ ఆరోగ్యశ్రీ..?
జగన్ మేధోమథనం : వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మించి... జగన్ ఆరోగ్యశ్రీ..?

ఆరోగ్యశ్రీ పేరుచెబితే ముందు గుర్తొచ్చేది వైఎస్సార్. వైఎస్ ను ఓ మానవీయ నాయకుడిగా నిలబెట్టిన పథకం అది. స్వయంగా వైద్యుడైన ఆయన సీఎం అయ్యాక ఈ పథకంతో ఇంటింటి వైద్యుడిగా అవతరించారు. జననేతగా ఎదిగారు. అందుకే వైఎస్ జగన్ సైతం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అంతే కాదు.. తండ్రి ప్రవేశ పెట్టిన పథకానికి అనేక జోడింపులు చేర్చి.. మరింతగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్యరంగానికి ఏం చేయబోతున్నాడో మేనిఫెస్టోలో ముందే చెప్పాడు. సంవత్సరకాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఆరోగ్యశ్రీ పరిస్థితిని సంవత్సరానికి రూ.5 లక్షల వరకు అంటే.. నెలకు రూ.40 వేల సంపాదించే వారికి కూడా వర్తింపజేస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇలా 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. అంతే కాదు.. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఇంతకు ముందున్న వెయ్యి రోగాలు కాకుండా 2 వేల రోగాలకు వర్తింపజేసేలా పశ్చిమగోదావరిలో పైలెట్‌ ప్రాజెక్టు నడుస్తోంది. ఈ జూలై 8వ తేదీన వైఎస్ పుట్టిన రోజున మరో 6 జిల్లాల్లో 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తామంటున్నారు జగన్. ఆ తరువాత మిగిలిన ఆరు జిల్లాల్లో దీపావళి నాటికి నవంబర్‌లో పూర్తిగా రాష్ట్రమంతా 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించేలా వర్తింపజేస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 వందల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించిన వైద్యం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతే కాదు.. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 132 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వర్తింపజేస్తున్నారు. మొత్తం మీద తండ్రి కంటే ఓ రెండు అడుగులు జగన్ ముందే ఉన్నాడు.

చంద్రబాబు లెంపలు వేసుకున్నారు.. మరి ఆ కులాలు ఆయన్ను క్షమిస్తాయా..?
చంద్రబాబు లెంపలు వేసుకున్నారు.. మరి ఆ కులాలు ఆయన్ను క్షమిస్తాయా..?

మహానాడు మీటింగ్‌లో ఎక్కువ సమయం అధికార పార్టీని విమర్శించడానికి కేటాయించినా అక్కడక్కడా చంద్రబాబు ఆత్మ పరిశీలన కూడా చేసుకున్నారు. ఏడాది క్రితం జరిగిన ఘోర పరాజయానికి కారణాలు గురించి కూడా కొద్దిసేపు మహానాడులో చర్చించారు. ముఖ్యమంగా బీసీలు, దళితులు కొన్ని కారణాలతో మనకు దూరమయ్యారని..ఇకపై వారిని కూడా కలుపుకుపోవాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. అయితే చంద్రబాబులోని ఈ పరివర్తనను వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. చంద్రబాబు గతంలో తోకలు కత్తిరిస్తా.. తాట తీస్తా.. అని చంద్రబాబు కించపరిచాడని గుర్తుచేస్తోంది. అందుకే టీడీపీని బీసీలు ఎప్పటికీ క్షమించరని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అంటున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అడుగడుగునా అణచివేయాలని చూసిన చంద్రబాబు.. అధికారం కోల్పోయాక ఈ వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడుతున్నారు. మహానేడు వేదికగా బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని, ఎన్ని కుయుక్తులు పన్నినా బలహీనవర్గాలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని పార్థసారధి అంటున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి బలహీనవర్గాలకు పెద్దపీట వేశారని ఆయన అంటున్నారు. ఓడిపోయినప్పుడల్లా బీసీలపై కపట ప్రేమ చూపించే చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. అంతే కాదు.. చంద్రబాబు బీసీల గురించి ఆదరణ పథకం అని పెట్టి బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి బలహీనవర్గాలను అభివృద్ధి చేశానని చెప్పుకున్నారని విమర్శించారు. బలహీనవర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే వారిని అవమానించే రీతిలో ప్రవర్తించాడని, నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలుతీస్తానని, యాదవ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరిన యువతను 24 గంటలు జైల్లో పెట్టి అవమానించాడని చంద్రబాబు పాత చరిత్రను గుర్తు చేశారు.

జగన్ మేధోమథనం: ఆ విషయంలో YSR రెండు అడుగులు.. జగన్ ఏకంగా నాలుగు అడుగులు...?
జగన్ మేధోమథనం: ఆ విషయంలో YSR రెండు అడుగులు.. జగన్ ఏకంగా నాలుగు అడుగులు...?

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనపై అనేక రకాలైన విశ్లేషలు వస్తున్నాయి. ఈ విశ్లేషలు పలు కోణాల్లో సాగుతున్నాయి. అయితే మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. సంక్షేమం విషయంలో మాత్రం జగన్ కు మంచి మార్కులే పడుతున్నాయి. వైఎస్ జగన్ తొలినాళ్లలో బలం అంతా వైఎస్సార్ క్రేజే. వైఎస్సార్ అంటేనే సంక్షేమ పాలన గుర్తొస్తుంది. అందుకే జగన్ సర్కారు కూడా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు. వైఎస్సార్ కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్. ఉదాహరణకు మహానేత వైయస్‌ఆర్‌ బలహీనవర్గాల పిల్లల కోసం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసి ఏకంగా వంద శాతం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తీసుకువచ్చారు. అలాగే అమ్మఒడి పథకం కింద లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లే విధంగా తోడ్పాటును ఇచ్చారు. ఇక ఇప్పుడు జగన్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారు. గతంలో వైసీపీ ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించింది. ఆ సదస్సు సందర్భంగా జగన్ చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని తూచా తప్పకుండా జగన్‌ అమలు చేస్తున్నారు. బలహీనవర్గాల సామాజిక గౌరవం పెరిగేట్లుగా.. కొత్త కొత్త రంగాల్లో అడుగులు పెట్టేందుకు అవకాశాలు కల్పించారు ముఖ్యమంత్రి జగన్‌. అంతే కాదు.. అధికారంలోకి రాగానే బీసీల సమస్యలు పరిష్కరించేందుకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా.. ప్రతి నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించారన్నారు. కాంట్రాక్టుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. బలహీనవర్గాలకు చెందిన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితే వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జగన్ నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే పని చేస్తున్నారు.

బాబూ.. ఆ మాత్రం జూమ్ మీటింగ్‌కు అమరావతి అయితేనేం..? హైదరాబాద్ అయితేనేం..?
బాబూ.. ఆ మాత్రం జూమ్ మీటింగ్‌కు అమరావతి అయితేనేం..? హైదరాబాద్ అయితేనేం..?

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీకి వచ్చారు. ఆయన రావడం కోసం కూడా చాలా పెద్ద కసరత్తు జరిగింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆంధ్ర, తెలంగాణ డీజీపీలకు ఉత్తరాలు రాసి మరీ అమరావతి వచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నారు. మొత్తానికి రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఏపీలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ ప్రయాణం సంగతి తెలుసుకుని తెలుగు తమ్ముళ్లు కాస్త ఆశ్చర్యపోయారు. రెండు నెలల తర్వాత వచ్చి రెండు రోజులు కూడా పూర్తిగా ఉండకపోవడమేంటని వారు ముక్కున వేలేసుకున్నారు. అసలు ఈ రెండు రోజుల కోసం చంద్రబాబు ఎందుకు పర్మిషన్ తీసుకుని మరీ అమరావతి వచ్చినట్టు అని చర్చించుకున్నారు. అమరావతి వచ్చిన చంద్రబాబు కేవలం మహానాడు కార్యక్రమంలోనే పాల్గొన్నారు. అంతకు మించి జనంలోకి ఎక్కడా వెళ్లలేదు. మహానాడు తర్వాత విశాఖ వెళ్లి ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తారని అంతా అనుకున్నా.. ఆ పని చేయలేదు. మహానాడు పూర్తయిన మరుసటి రోజే హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. ఇందంతా చూసిన వారు అసలు ఇంతకీ చంద్రబాబు ఎందుకు అమరావతికి వచ్చారా అని ఆలోచిస్తున్నారు. మహానాడు కోసం అని అనుకుందామంటే.. అది ఎలాగూ జూమ్ యాప్ ద్వారా నిర్వించిన సమావేశమే. ఆ మాత్రం జూమ్ సమావేశం హైదరాబాద్ లో ఉండి కూడా నిర్వహించవచ్చు. అందులోనూ హైదరాబాద్‌లో మంగళగిరి కంటే పెద్ద ఆఫీసు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉండనే ఉంది. అందుకే.. బాబూ.. ఆ మాత్రం జూమ్ మీటింగ్‌కు అమరావతి అయితేనేం..? హైదరాబాద్ అయితేనేం..? అని ప్రశ్నిస్తున్నారు.

బాబు ఆంధ్రా ప్రేమ.. అప్పుడే ముగిసిందా..? చలో హైదరాబాద్..? మరి అవన్నీ వట్టి మాటలేనా..?
బాబు ఆంధ్రా ప్రేమ.. అప్పుడే ముగిసిందా..? చలో హైదరాబాద్..? మరి అవన్నీ వట్టి మాటలేనా..?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు లాక్ డౌన్ వల్ల ఇటీవల దాదాపు 70 రోజుల వరకూ హైదరాబాద్ లోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఆయన జూమ్ యాప్ ద్వారా రోజువిడిచి రోజు ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఆ సమయంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది.. ఇలాంటి కష్ట సమయంలో మీకు అండగా ఉండాలని మనసు తహతహలాడుతోంది. నా మనసు అంతా మీమీదే ఉంది. కానీ ఏం చేయను లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయాను.. అంటూ మాట్లాడేవారు. ఆ తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సమయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడేవారు. బాధితుల పరామర్శ కోసం ఏకంగా కేంద్రానికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ మాటలన్నీ విన్న తర్వాత పాపం.. చంద్రబాబు ఏపీపై ఎంత ప్రేమో అనుకున్నారు చాలా మంది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగు పెట్టే అవకాశం లభించింది. ఆయన దరఖాస్తులను అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా రెండు ప్రభుత్వాలు ఓకే చెప్పేశాయి. అలా చంద్రబాబు ఏపీలో అడుగు పెట్టారు. ఆ వెంటనే మహానాడు నిర్వహణలో మునిగిపోయారు. మొత్తం మీద రెండు రోజలు మహానాడులో గడిచిపోయాయి. ఇక చంద్రబాబు ఏపీకి వచ్చేశారని ఏపీ ప్రజలు ధీమాగా ఫీలయ్యే ఉంటారు. అటు విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులు కూడా చంద్రబాబు పరామర్శ కోసం ఎదురు చూసే ఉంటారు. అసలు మహానాడుకు ముందే విశాఖ పర్యటన అంటూ తెలుగు దేశం హడావిడి చేసింది. అయితే ఇన్ని ప్రోగ్రాములు ఏపీలో పెండింగులో ఉంటే.. చంద్రబాబు మాత్రం ఎంచక్కా మహానాడు పూర్తయిన మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. పాపం.. ఈ వార్త విన్న ఆంధ్రా ప్రజలు అవాక్కయ్యారు. రాక రాక రెండు నెలలకు వచ్చిన నాయకుడు రెండు రోజులు కూడా పూర్తిగా గడపకుండానే మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడేంటా అని చర్చించుకుంటున్నారు.

బాలయ్య వర్సెస్ చిరు.. మధ్యలో అదిరిపోయే ట్విస్టి ఇచ్చిన నరేష్..?
బాలయ్య వర్సెస్ చిరు.. మధ్యలో అదిరిపోయే ట్విస్టి ఇచ్చిన నరేష్..?

టాలీవుడ్ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. దీనికి తనను ఆహ్వానించలేదని బాలయ్య ఘాటుగా కామెంట్లు చేసిన సంగతీ తెలిసిందే. బాలయ్య కామెంట్లతో ఒక్కసారిగా సీన్ వేడెక్కింది. ఇక దీని తర్వాత ఈ వివాదంలోకి నాగబాబు ఎంటర్ కావడంతో సీన్ చినిగి చేటంతయ్యింది. ఇప్పుడు ఈ వివాదంలోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. బాలయ్య కామెంట్లపై సినీ నిర్మాత కల్యాణ్ స్పందిస్తూ... మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ బాలకృష్ణను కూడా సమావేశాలకు పిలిచి ఉండాల్సిందని కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు మా అసోసియేషన్ తరపు నుంచి కూడా సీన్ లోకి కొందరు ఎంట్రీ ఇస్తున్నారు. మా అధ్యక్షుడు నరేశ్ ఈ కామెంట్‌లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అదేంటంటే.. అసలు మా అధ్యక్షుడిని నన్నే ఆ సమావేశాలకు పిలవలేదని బాంబు పేల్చేశాడు. తననే కాదు.. మా సెక్రటరీని కూడా ఈ సమావేశాలకు పిలవలేదని నరేశ్ అంటున్నాడు. అసలు మమ్మల్నే పిలవనప్పుడు ఇంకా మేం ఎవరిని పిలుస్తాం అంటూ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో ఈ వివాదం ఇంకాస్త మలుపు తిరిగింది. అసలు చిరంజీవి అధ్యక్షత జరిగిన సమావేశానికి ప్రాతిపదిక ఏంటన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఈ సమావేశం నిర్ణయించింది ఎవరు.. వారు కొందరిని మాత్రమే ఎందుకు పిలిచారు. ఏ ప్రాతిపదికన పిలిచారు అన్న అంశంపై రచ్చ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అసలు తెలంగాణ మంత్రితో జరిగే సమావేశం..అదేదో సొంత వ్యవహారం లాగా చిరంజీవి ఇంట్లో నిర్వహించడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏం చేసినా ఇండస్ట్రీ మంచి కోసమే చేసినప్పుడు అనవసరంగా ఈ మీటింగ్ పై బురద జల్లడమేంటనే వారూ ఉన్నారు.

మీడియా మంటలు: ఏబీఎన్‌కు ఈ జర్నలిస్ట్ భలే ప్లస్ పాయింట్ అవుతున్నాడే..?
మీడియా మంటలు: ఏబీఎన్‌కు ఈ జర్నలిస్ట్ భలే ప్లస్ పాయింట్ అవుతున్నాడే..?

ఆంధ్రజ్యోతి మీడియా అంటే అది ఎవరికి కొమ్ముకాస్తుందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. సాక్షి మీడియా అధికారికంగా వైసీపీకి, ఆంధ్రజ్యోతి తదితర మీడియాలు టీడీపీకి అనధికారికంగానా పల్లకీ మోస్తున్నాయన్న సంగతి ఏపీ మీడియాను ఫాలో అయ్యే వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయితే ఇలా ఓ సైడ్ తీసుకోవడం వల్లే కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఏదైనా అంశంపై డిస్కషన్ కు పిలిచినప్పుడు ఎదుటి పక్షం వారు వీరి డిబేట్లకు హాజరు కారు. సో.. డిస్కషన్లు ఏకపక్షంగా సాగుతాయి. అలాంటప్పుడు అసలే ఓవైపుగా ఉన్న పక్షపాతం ఈ డిబేట్ల ద్వారా మరింతగా ప్రజలకు తెలిసిపోతుంది. డిబేట్లు కూడా వన్ సైడెడ్ గా చప్పగా సాగిపోతాయి. నిన్న మొన్నటి వరకూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఈ సమస్య ఉండేది. అయితే ఈ ఛానల్ల్లోకి తాజాగా వచ్చిన వెంకటకృష్ణ అనే సీనియర్ జర్నలిస్టు వల్ల ఆ సమస్య కొంత తీరినట్టు కనిపిస్తోంది. వెంకటకృష్ణ చాలా సీనియర్ జర్నలిస్టు. ఈటీవీ, టీవీ5, ఏపీ 24 ఇంటూ 7 వంటి ఛానళ్లలో పని చేశారు. అందువల్ల ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల వల్ల ఏబీఎన్ ఛానల్ కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏబీన్ ఆంధ్రజ్యోతి టీడీపీ అనుకూల చానల్ అని పేరున్నప్పటికీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం దృష్ట్యా కొందరు డిబేట్లలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తాజాగా నాగబాబు వ్యవహారమే అందుకు ఉదాహరణ. బాలకృష్ణను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో పోస్టు చేసిన నాగబాబును వెంకటకృష్ణ డిబేట్ కు ఆహ్వానించారు. సాధారణంగా నాగబాబు వంటి వారు ఏబీఎన్ డిస్కషన్లు రారు. కానీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం కొద్దీ ఆయన లైవ్ డిస్కషన్ కు ఒప్పుకున్నారు. ఆ విషయం ఆయన లైవ్‌లోనే చెప్పేశారు. ఏబీన్ పక్కా టీడీపీ అనుకూల ఛానల్ అని తెలిసి కూడా డిష్కషన్ కు వచ్చానని ఆయన లైవ్‌లోనే చెప్పేశారు. సో.. అలా వెంకటకృష్ణ ఇమేజ్ ఏబీఎన్‌కు ప్లస్ పాయింట్ అయ్యిందన్నమాట.

బాలకృష్ణా.. మరోసారి చెక్ చేయించుకో.. అంటున్న వైసీపీ నేత..?
బాలకృష్ణా.. మరోసారి చెక్ చేయించుకో.. అంటున్న వైసీపీ నేత..?

ఓవైపు మహానాడు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి.. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలపై తనను మీటింగులకు పిలవలేదన్న కారణంగా మండిపడటం కూడా బాగా వార్తల్లోకి ఎక్కింది. మహానాడులో బాలయ్య మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదు. ప్రభుత్వం పడిపోతుంది.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిపోతుందని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. బాలకృష్ణ తన మానసిక స్థితికి సంబంధించి మరోసారి చెక్‌ చేయించుకోవాలని ఇక్బాల్ సలహా ఇచ్చారు. సినీ పరిశ్రమ చర్చలకు పిలవలేదన్న బాధ బాలకృష్ణలో కనిపిస్తోందన్నారు. ఈ ఇక్బాల్ హిందూపురంలో బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు బాలయ్యపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి బాలయ్యకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని సీఎం జగన్‌ ఏనాడో చెప్పారని ఇక్బాల్ గుర్తు చేశారు. విలువలకు కట్టుబడి సీఎం జగన్‌ పాలన సాగుతుందని ఇక్బాల్ చెప్పారు. మహానాడుపైనా ఇక్బాల్ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడు నిర్వహిస్తోంది మహానాడా లేక జూమ్‌ నాడా అని వ్యంగ్యంగా అన్నారు. తనకు కోటి ఆశలతో ఓటేసి గెలిపించిన హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఇక్బాల్ ఆరోపించారు. గతంలో బాలయ్య ఓ సినీ నిర్మాతపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి బాగోలేదని కథనాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టున్నారు.

జీవిత సత్యాలు: ఇంటి గుట్టు బయటపెట్టుకోకండి.. పెడితే ఏమవుతుందో తెలుసా..?
జీవిత సత్యాలు: ఇంటి గుట్టు బయటపెట్టుకోకండి.. పెడితే ఏమవుతుందో తెలుసా..?

ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ ఎన్నో సమస్యలుంటాయి. అసలు సమస్యలు లేని ఇల్లే ఉండదు. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు సమస్య. సమస్యలను సామరస్యంగా ఎంతవరకూ పరిష్కరించుకుంటామన్న దానిపై మన ఇంటి పరువు ఆధారపడి ఉంటుంది. దానినే ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం ఉండాలి. అలా నిర్మాణం చేయాలి. అప్పు డప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. అయినా సరే, వాటిలో రహస్యాలను ఇతరులకు అంటే మూడో వ్యక్తికి వారు ఎంత పెద్ద వారైనా సరే బహిరంగం చేయాలనుకోవడం తెలివి తక్కువ పని. దాని వల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరట. ఆ ప్రేమ బంధం ఆ ఇద్దరు సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అందుకే మన పెద్దలు అనేవారు . ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు అని అన్నారు.

కేసీఆర్‌నే ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న పోలీసు అధికారి..?
కేసీఆర్‌నే ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న పోలీసు అధికారి..?

ఆయనో ఐపీఎస్ అధికారి. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్. కానీ.. అయితే అంత సీనియర్ అయినా ఆయనకు డీజీపీగా పని చేసే అవకాశం దక్కలేదంటున్నారాయన. తన సీనియార్టీకి ఆ పోస్టు కచ్చితంగా వచ్చి తీరాలని ఆయన నమ్ముతున్నారు. ఆయనే వీకే సింగ్. ఆయన ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ ( టీ ఎస్‌ పీ ఏ ) కు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, గియితే డీజీపీగానే రిటైర్ అవ్వాలనుకుంటున్న వీకే సింగ్.. ఇప్పుడు గళం విప్పారు. తన రిటైర్‌ మెంట్ దగ్గర పడిన నేపథ్యంలో సర్కారుకు తన గళం వినిపించాలను కుంటున్నారు. అందుకే.. ఏకంగా తనకు ప్రమోషన్ ఇవ్వకపోతే రాజీనామా చేసి వెళ్లిపోతానని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఒక ఐపిఎస్ అధికారి ఇలా ప్రకటించడం చాలా అరుదు అనే చెప్పాలి. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ వీకే సింగ్ పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ కు డైరెక్టర్‌గా ఉన్న వీకే సింగ్‌ ప్రస్తుతం ఏడీజీ హోదాలో ఉన్నారు. ఈనెల 21న చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి.. దాని కాపీ సీఎంకు కూడా పంపించారు. ఇక వీకే సింగ్ వివరాల్లోకి వెళ్తే.. ఆయన 1987 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయనకు ఐపీఎస్ గా 33 ఏళ్ల సీనియారిటీ ఉంది. తాను ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం ఎంప్యానెల్‌ అయ్యానని కూడా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని... తనకు డీజీపీ పోస్టు ఇవ్వాల్సిందే అంటున్నారాయన. మరి వీకే సింగ్ లేఖపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే డీజీపీగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం అభీష్టం ప్రకారమే జరుగుతుంది.

చంద్రబాబూ.. ఎన్టీఆర్ ను మరీ ఇంతగా అవమానించాలా..?
చంద్రబాబూ.. ఎన్టీఆర్ ను మరీ ఇంతగా అవమానించాలా..?

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని చాలామంది చెబుతుంటారు. నమ్మిన మామను నట్టేట ముంచాడని అంటుంటారు. అయితే అదంతా పార్టీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమమని చంద్రబాబు అభిమానులు చెబుతుంటారు. ఆ సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ఇంకా కక్ష, కోపం ఉన్నాయేమో అనిపిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు. అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటారా.. ఎందుకంటే.. మరోసారి మహానాడులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావుక భారత రత్న బిరుదు ఇవ్వాలని తీర్మానం చేశారు. అలా చేస్తే మంచిదే కదా.. అది అవమానించడం ఎలా అవుతుందంటారా.. అవును మరి.. ఇలా డిమాండ్ చేయడం ఎన్నోసారో బహుశా ఆ పార్టీ నాయకులకే తెలియదనుకుంటా.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటి.. తన రాజకీయ జీవితంలోనే అత్యంత దుస్థితిలో ఉన్నాడాయన. టీడీపీ చరిత్రలోనే మొదటిసారిగా కేవలం ముగ్గురు లోక్ సభ సభ్యులు మాత్రమే ఉన్న పార్టీగా తెలుగుదేశం కునారిల్లుతోంది. మరి తెలుగుదేశం జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ ను పెద్దగా పట్టించుకోకుండా... ఇప్పుడు ఇలా ప్రతి ఏటా మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న అంటూ షో చేయడం అసలైన ఎన్టీఆర్ అభిమానులు మనసు చివుక్కుమనేలా చేస్తోంది. కనీసం 2014 తర్వాత మోడీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న తరవాతైనా చంద్రబాబు తలచుకుంటే.. ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చి ఉండేదేమో. మోడీని గట్టిగా పట్టుబట్టి ఉంటే భారత రత్న ఇచ్చేవాడేనేమో కానీ.. అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. ఆ కాలమంతా వదిలేసి ఇప్పుడు ఏదో చేయాలి కాబట్టి ఓ తీర్మానం చేసి పడేయడం అంటే అది ఎన్టీఆర్ పేరును వాడుకోవడం.. ఎన్టీఆర్ ను అవమానించడం కాదా అంటున్నారు నిజమైన నందమూరి తారక రామారావు అభిమానులు.

వచ్చే మూడేళ్లలో... తన టార్గెట్‌ ఏంటో చెప్పేసిన జగన్..?
వచ్చే మూడేళ్లలో... తన టార్గెట్‌ ఏంటో చెప్పేసిన జగన్..?

ఏపీ సీఎం జగన్.. పరిశ్రమల విషయంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో తన ప్రభుత్వం చేపట్టబోయే కీలకమైన ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి మూడేళ్లలో చేయబోయే ప్రాజెక్టులను గుర్తించామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులేంటని ఆలోచన చేస్తే.. రామయపట్నం, మచిలీపట్నం, బావనపాడులో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు ఏర్పాటు చేయనున్నామన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవేకాకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మింస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వీటితో పాటు కడపలో రూ.15 వేల కోట్లతో రెండున్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో కూడిన స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని.. ఎవరైనా పారిశ్రామిక వేత్త ఆసక్తి చూపితే ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందంతో నిర్మాణం చేపట్టేందుకైనా.. లేక వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ పరిశ్రమ కోసం రా మెటీరియల్‌కు సంబంధించి ఎన్‌ఎండీసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించిన జగన్... డీఆర్‌డీఓ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూషన్‌తో స్టీల్‌ సప్లయ్‌ చేసే పరిస్థితిలోకి ఒప్పందం చేసుకుంటున్నామని వివరించారు. పరిశ్రమలు పెట్టే వారికి భూమి పరంగా, నీరు పరంగా, విద్యుత్‌ పరంగా, అతిముఖ్యమైన స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ను అందించగలమని జగన్ భరోసా ఇచ్చారు. పరిశ్రమలకు స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ తీసుకువచ్చేందుకు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకురాబోతున్నామని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా మరో ఐదు కాలేజీలు అదనంగా మొత్తం 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకువస్తున్నామని జగన్ తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పేశారు.

జగన్ మేధో మథనం: రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..?
జగన్ మేధో మథనం: రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..?

ఏపీ సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేయదలచుకున్నారన్న సంగతి తెలిసిందే. కానీ శాసన మండలిలో మెజారిటీ లేకపోవడం కారణంగా ఆ బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు ఎల్జీ పాలిమర్స్ వంటి గ్యాస్ ప్రమాదాల కారణంగా అసలు విశాఖ రాజధానిగా కరెక్టు ప్లేసేనా అన్న చర్చ కూడా మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాజధాని మార్పు అన్న ఆయన స్వప్నం మాత్రం నెరవేరలేదు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ మరోసారి రాజధాని అంశంపై స్పందించారు. త్వరలోనే విశాఖ రాజధానిగా మారనుందని క్లారిటీ ఇచ్చేశారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని జగన్ మరోసారి తేల్చి చెప్పినట్టయింది. విశాఖ పరిపాలన రాజధానిగా మారనుందని... అక్కడ మెట్రో రైల్ కూడా రాబోతోందని.. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అభివృద్ధి చేయనున్నామని తేల్చి చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తయిందని, జీఎంఆర్‌కు రీకాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఆయన ఇంకా విశాఖ గురించి ఏమన్నారంటే.. " ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఇటువంటి కోర్సులు అందించేలా విశాఖలో హై అండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలతో పోటీ పడాలన్నా.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావాలన్నా.. విశాఖపట్నం అనువైన స్థలం అంటూ విశాఖ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. అంటే ఇక రాజధాని మార్పు గురించి ఎలాంటి సందేహాలు ఎవరికీ అవసరం లేదన్నమాట. అయితే విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ అభిలాష మాత్రం వేగంగా నెరవేరడం లేదు. ప్రస్తుతం రాజధాని బిల్లు మండలి వద్ద పెండింగులో ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందిందో లేదో తెలియదు. సెలెక్టు కమిటీ తన పని మొదలు పెట్టిన దాఖలాలు లేవు. మరోవైపు అసలు మండలినే రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ రాజధానిగా ఎప్పుడవుతుందన్నది ఆలోచించాల్సిన అంశమే.

జగన్ మేధోమథనం : జగన్ నోట మళ్లీ ఆ మాట.. ఉలిక్కిపడిన ఆంధ్రాజనం..?
జగన్ మేధోమథనం : జగన్ నోట మళ్లీ ఆ మాట.. ఉలిక్కిపడిన ఆంధ్రాజనం..?

ప్రత్యేక హోదా.. ఒకప్పుడు ఏపీని ఊపేసిన మాట ఇది. రాజకీయ వర్గాల్లో చాలాసార్లు వాదనలకు, మాటల యుద్ధాలకు దారి తీసిన మాట. కానీ ఈ మాట కొన్నేళ్లుగా అసలు ఏపీలో వినిపించడం లేదు. ఈ డిమాండ్ గురించి అసలు ఎవరూ మాట్లాడటం లేదు. అలాంటిది మళ్లీ సీఎం జగనే మరోసారి ఈ మాటతో అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ‘మన పాలన– మీ సూచన కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ ఆరంభంలోనే ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత మనకు నష్టం జరిగిందని చెప్పకతప్పదన్న జగన్ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్‌ స్టేషన్‌ ఇస్తామని మాటిచ్చి దాని తరువాత ఇవ్వకుండా పోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాదు.. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇండస్ట్రీ ఇన్సెన్టివ్స్‌ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చిఉండేవని. కేంద్ర ప్రభుత్వం భారాన్ని పంచుకునేదని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2014–19 వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ప్రత్యేక హోదాను రాష్ట్రం తెచ్చుకోలేకపోయిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మన పార్టీ ఘన విజయాన్ని సాధించినా.. 25కు 22 పార్లమెంట్‌ సీట్లు, 175 అ సెంబ్లీ సీట్లకు 151 సీట్లను స్వీప్‌ చేయగలిగినా కేంద్రంలో వారికి సంపూర్ణమైన మెజార్టీ వచ్చినందువల్ల హోదా తేలేకపోయామని కుండబద్దలు కొట్టేశారు. బీజేపీకి మెజారిటీ రాకపోయి ఉండి ఉంటే రాష్ట్రానికి బెనిఫిట్స్‌ వచ్చేవని.. మనం ఎవరికి సపోర్టు చేయాల్సి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు పెట్టేవాళ్లమని మరోసారి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు అది జరగలేదని... కేంద్రంలో ఎన్డీయే సంపూర్ణ మెజార్టీ సాధించినందువల్ల వారికి అవసరం.. పని కూడా లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రత్యేక హోదా మళ్లీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ, హోదా అడగడం మానేస్తే అది ఏ రోజూ మనకు రాదు అనే సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈ రోజుకు కాకపోతే రేపయినా వస్తుంది. ఈరోజు కాకపోయినా కేంద్రం మనపై ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామనే మన ఆలోచన ముందుకు తీసుకువస్తాం. ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు జగన్.

జగన్ మేధోమథనం : ఒక్క మాటలో తానేంటో చెప్పేసిన జగన్..? బాబు గాలి భలేతీసేశాడుగా..!
జగన్ మేధోమథనం : ఒక్క మాటలో తానేంటో చెప్పేసిన జగన్..? బాబు గాలి భలేతీసేశాడుగా..!

ఏపీ సీఎం జగన్ తన ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వించిన జగన్ ఒక్కమాటలో తానేంటో తన పనితీరు ఏంటో తేల్చి చెప్పేశారు. పారిశ్రామిక వేత్తలకు క్లారిటీ ఇచ్చేశారు. ‘పారిశ్రామికవేత్తలకు తాను ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ నిబద్ధత, నిజాయితీ. ఇవి తన దగ్గర ఉన్నాయి. ఏదైతే చెబుతానో.. వాటిని కచ్చితంగా చేసి తీరుతా.. అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇదే సమయంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మనం ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని ఆ మాటలే నేను మాట్లాడితే విలువ ఉండదు. గత ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం నెలకో విదేశీ పర్యటనల హడావిడి చేసిందని.... రూ.50 వేల కోట్లతో సెమీకండక్టర్‌ పార్కును నెక్ట్‌ హార్బిట్‌ ఏర్పాటు చేస్తుందని ఒక రోజు.. ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని ఒకరోజు.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తుందని ఒక రోజు.. బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తుందని మరో రోజు.. హైపర్‌లూప్‌ వచ్చేస్తుందని మరోరోజు హడావిడి చేశారని గుర్తు చేశారు. అంతే కాదు.. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో దివాళా తీసిన బీ.ఆర్‌.శెట్టి.. ఈ పక్కనే 1500 పడకల ఆస్పత్రి కోసం రూ. 6 వేల కోట్లతో దిగుతున్నాడని ఇలాంటి అబద్ధాలు, గ్రాఫిక్స్‌ చెప్పారు.. చూపించారని ఎండగట్టారు. ఇలాంటి మాటలు తాను కూడా చెప్పడం మొదలుపెడితే ఎక్కడా న్యాయం అనేది ఉండదన్నారు జగన్. గతంలో ఆశ్చర్యం కలిగించే మాటలు.. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా చెప్పుకునేవారు... టాప్‌ 1, 2, 3 స్థానంలో మన రాష్ట్రం ఉందని గొప్పగా చెప్పుకునేవారు. కానీ తాను చేతల మనిషినని... చెప్పిందే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు జగన్.

టీటీడీ అద్భుత నిర్ణయం.. ఇక పసివాళ్లకు బెంగలేదు..?
టీటీడీ అద్భుత నిర్ణయం.. ఇక పసివాళ్లకు బెంగలేదు..?

టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానములు.. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానం ఇది. అందుకే భక్తులు సమర్పించిన సొమ్ముతో వారి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. కేవలం తిరుమల, తిరుపతికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు కట్టిస్తోంది. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో మణికిరీటం చేరబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకు ఓ ప్రత్యేకమైన ఆసుపత్రిని నిర్మించబోతోంది. అవును.. ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిలోఫర్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి ఉండేది. కానీ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పిల్లల ఆస్పత్రి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచన మేరకు ఇంతకు ముందే పద్మావతి ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్, స్విమ్స్‌లో ఎక్కడ అవకాశం ఉంటే .. అక్కడ తక్షణమే చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. అందుకు అనుగుణంగానే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే.. ఏపీలోని పసివాళ్ల ఆరోగ్యానికి భరోసా వస్తుంది. ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకోసం ట్రయల్‌ కూడా వేయడం జరిగిందని, అధికారులు చేసిన ఏర్పాట్లకు కొన్ని మార్పులు సూచించామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ ఏ విధంగా దర్శనం త్వరితగతిన కల్పించాలనే అంశంపై ఈ నెల 31 తరువాత నిబంధనలు సడలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని తప్పకుండా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

దమ్మున్న టీవీ ఛానల్‌ యాంకర్‌కు చుక్కలు చూపించిన నాగబాబు...?
దమ్మున్న టీవీ ఛానల్‌ యాంకర్‌కు చుక్కలు చూపించిన నాగబాబు...?

టాలీవుడ్ సినీ పెద్దలతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ వ్యవహారంపై తాజాగా సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే లేపాయి. ఎవడు పిలిచాడండీ నన్ను.. నన్ను ఎవడూ పిలవలేదు.. ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తో కలసి వీళ్లంతా భూములు పంచుకుంటున్నారా.. ... బీప్.. బీప్.. బీప్.. బీప్.. ఇదీ నందమూరి బాలకృష్ణ సినీ పెద్దల సమావేశంపై చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి కలకలం రేపుతున్నాయి. దీనికి తోడు దీనికి కౌంటర్ గా నాగబాబు.. బాలయ్య నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ పెట్టిన వార్నింగ్ వీడియో ఇంకాస్త వేడిని పెంచేసింది. ఈ వ్యవహారాన్ని టీఆర్పీ రేటింగ్‌తో సొమ్ము చేసుకోవాలని ఓ టీవీ ఛానల్ ప్రయత్నించింది. ఏకంగా నాగబాబును ఈ అంశంపై డిబేట్ కు పిలిపించింది. అయితే తెలుగు దేశం తోక పత్రికగా చెప్పుకునే డైలీకి అనుబంధంగా ఉన్న ఆ ఛానల్‌ లో డిబేట్‌కు ఓకే చెప్పిన నాగబాబు ఆ తర్వాత యాంకర్ కు చుక్కలు చూపించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సీఐడీ తరహాలో ఇంటరాగేషన్ చేయబోయిన యాంకర్‌ కు నాగబాబు మొదట్లోనే అడ్డుకట్ట వేశారు. మీ చానల్ సంగతి అందరికీ తెలిసిందే. ఇది నూటికి నూరు శాతం తెలుగుదేశం అనుకూల ఛానల్. ఆ విషయం అందరికీ తెలుసు. నాకూ తెలుసు కానీ .. మీరంటే ఉన్న కన్సర్న్‌ తో డిబేట్ కు ఒప్పుకున్నారు. మీరు మరీ అడ్డంగా వాదించరని నాకు తెలుసు అంటూ ముందర కాళ్ల బంధం వేశారు నాగబాబు. నాగబాబు.. మీది టీడీపీ అనుకూల ఛానల్ అంటూ లైవ్ లోనే ఏకేస్తుంటే పాపం.. ఆ యాంకర్ కు ఏం చేయాలో ఒక్కసారిగా పాలుపోలేదు. దీనికి సమాధానం చెప్పలేక.. విషయాన్ని సినీ ఇండస్ట్రీ రాజకీయాలవైపు చాకచక్యంగా తిప్పి డిబేట్ ను కాస్త పక్కదారి పట్టించేశారు. అయితే ముందుగానే సిద్ధంగా వచ్చిన నాగబాబు మాత్రం డిబేట్ ఆసాంతం సదరు యాంకర్‌ను ఇబ్బంది పెడుతూనే పై చేయి సాధించారనే చెప్పాలి.

బాబోయ్.. సోషల్ మీడియా కేసులు.. ఇక వారికీ చుక్కలు చూపిస్తారా...?
బాబోయ్.. సోషల్ మీడియా కేసులు.. ఇక వారికీ చుక్కలు చూపిస్తారా...?

సోషల్ మీడియా.. ఇప్పుడు సెల్ ఫోన్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్క వేలి దూరంలో ఉన్న మీడియా ఇది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా తమ మనసులో ఉన్నది తక్షణమే జనం మీదకు వదిలే అవకాశం వీటి ద్వారా అందివచ్చింది. అయితే ఈ సోషల్ మీడియా కారణంగా విద్వేషాలూ పెరుగుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల అభిమానుల వీరంగం సోషల్ మీడియాలో మరీ శ్రుతిమించిపోతోంది. అందుకే.. ఇప్పుడు వీటికి ముకుతాడు పడుతోంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీ సర్కారుపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే రంగనాయకుమ్మ అనే ఓ వృద్ధరాలిపై అనూష అనే అమ్మాయిపై కేసులు పెట్టారు కూడా. అయితే ఇప్పుడు టీటీడీ పై ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయట. ఈ మేరకు టీటీడీ తన తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. గత వారం రోజుల నుంచి టీటీడీ ఆస్తుల వేలం అంటూ కొన్ని మీడియా చానళ్లు, రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై, దేవస్థాన పాలక మండలిపై దుష్ప్రచారం చేశారని టీటీడీ భావిస్తోంది. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. దేవుడి సేవలో ఉన్న పాలకమండలిపై మళ్లీ ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాలని తీర్మానం చేశారు. ఏ స్థాయి ఎంక్వైరీ అయినా వేసి కుట్ర నిగ్గుతేల్చాలని ప్రభుత్వాన్ని కోరబోతోందట. ఇలా జరిగే ఎంక్వయిరీలో కుట్ర పూరితంగా పోస్టులు పెట్టారని తేలితే తగిన చర్యలు తీసుకుంటారన్నమాట. అందుకే సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త.. ఆవేశంలో ఏదో ఒక పోస్టు పెడితే ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక.. పోలీసుల చుట్టూ తిరగలేక చాలా ఇబ్బందిపడతారు సుమా.

మీడియా మంటలు: కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు దిక్కెవరు..?
మీడియా మంటలు: కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు దిక్కెవరు..?

కరోనా కష్టకాలం.. జర్నలిస్టుల పాలిట శాపంగా తయారైంది. మీడియాలో చాలా మంది గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. చిన్నాచితకా పత్రికలే కాదు.. బడా పత్రికలు కూడా ఉద్యోగులను పీకేస్తున్నారు. ఇక ప‌ని చేస్తున్నవారిలో స‌గం జీతం ఇస్తామ‌నే మాట‌లు కొంద‌రికి ఓదార్పు. త‌మ‌కు ఆ మాత్రం ప‌ని కూడా లేదే అని బాధ‌, ఆరాటం... మ‌రి కొంద‌రిలో. ఈ స‌గం జీతం ఈ ఏడాదంతా ఉన్నా ఆశ్చర్యపోవ‌ల‌సిన ప‌రిస్థితులు. క‌రోనా కాలంలో జ‌ర్నలిస్టు మిత్రులలోనూ ఎడ‌తెగ‌ని ఆందోళ‌న‌. దిగులు మేఘాలు కమ్ముకున్న ముఖాల‌కు ఏవో న‌వ్వులు పూస్తారే గానీ లోలోప‌ల సుడి తిరిగే దుఃఖం క‌న‌లుతూనే ఉంటుంది. న‌మ్ముకున్న అక్షరం అన్నం పెట్టద‌ని తెలిసినా పాత్రికేయుల రొద వినిపించే వేదిక‌లు ఉండ‌వు. నింద మోప‌లేరు, ఫిర్యాదు చేయ‌లేరు. త‌మ గురించి తాము చెప్పుకోలేని ఉద్యోగ‌వ‌ర్గం ఏదైనా ఉందంటే అది జ‌ర్నలిస్టుల స‌మూహ‌మే. ఈ దేశంలో అత్యంత బ‌ల‌హీన‌మైన సంఘాలు ఏవైనా వున్నాయంటే అవి జ‌ర్నలిస్టు సంఘాలే. క‌రోనా కాలంలో అభ‌ద్రత తీరుతెన్నులు మ‌రింత‌గా మ‌రింత మంది అనుభ‌వంలోకి వ‌చ్చాయి. చేదు వాస్తవాల వెక్కిరింత‌లో ఒక‌రికొక‌రు ఫోన్లలో వ‌ల‌పోసుకోడ‌మే త‌ప్ప ఎవ‌రికీ ఏ భ‌రోసా క‌నిపించ‌దు. క‌రోనా కాలాన కొంద‌రికి కొన్ని నెల‌ల పాటు స‌గం జీతాలే. ఇంకొంద‌రు ఉన్న ఉద్యోగాల నుంచి నిష్ర్కమించ‌వ‌లసిన స్థితి. ఉద్యోగుల లోంచి తొల‌గించ‌వ‌ద్దనే వార్తలే కాదు సంపాదకీయాలు కూడా రాస్తాయి ప‌త్రిక‌లు. కానీ త‌మ వ‌ద్ద ఉన్నవారిని ఉద్యోగాల నుంచి పంపించే తంత్రం గురించి యోచిస్తారు. ఆ విష‌యం తెలిసినా కిమ్మన‌లేని వారు ఎంద‌రో. ఈ సమయంలో జర్నలిస్టులకు కావ‌ల‌సింది ఆర్థిక స‌హాయం. బ్యాంకు ఎకౌంట్ నెంబ‌ర్ తీసుకొని వారికి కొంత మొత్తం డ‌బ్బును బ‌దిలీ చేయాలి. ఈ ప‌ని ఎవ‌రు చేస్తారు? ఎవ‌రు చేయాలి? క‌నీసం జ‌న‌వ‌రి 2020 నుంచి ఇప్పటివ‌ర‌కు ఉపాధి కోల్పోయిన జ‌ర్నలిస్టుల‌కు తోడ్పడ‌టం అధికారంలో ఉన్నవారి విధి, బాధ్యత‌. జ‌ర్నలిస్టు సంఘాల వారు, మీడియా అకాడ‌మీ, ఇత‌ర సంస్థల వారు ఈర‌క‌మ‌యిన ప‌ని చేయ‌వ‌చ్చు క‌దా. ఎందుకీ ఆలోచ‌న రాదు. వ‌చ్చినా స్పందించే చొర‌వ ఎందుకు చూప‌రు? ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలను అడ‌గ‌లేరు, క‌నీసం ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయ‌కూడ‌దు. ఏదేమైనా అమాయ‌కంగా అక్షరాల‌ను న‌మ్ముకున్న జ‌ర్నలిస్టుల‌కు ఇది గ‌డ్డుకాలం. - గుడిపాటి , సీనియర్ జర్నలిస్టు, పాలపిట్ట మాస పత్రిక సంపాదకులు

జీవిత సత్యాలు: ఈ సీక్రెట్స్ మీరు పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి..?
జీవిత సత్యాలు: ఈ సీక్రెట్స్ మీరు పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి..?

నోరు అదుపులో ఉంటే మన భవిష్యత్ బావుంటుంది. నోరు అదుపు తప్పితే అది అగమ్యగోచరం అవుతుంది. మనకు సంబంధించిన విషయాలు అన్నీ అందరితో పంచుకుంటే నలుగురిలో మనమే పలుచని అవుతాము. ఏ విషయం చెప్పాలి.. ఏది చెప్పకూడదు అన్న విచక్షణ మనిషికి చాలా అవసరం. మనం మన వయస్సు గురించి గానీ, ధనం గురించి గానీ, ఆయుస్సు గురించి గానీ ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు. ఆయువు,అంటే వయస్సు చెప్పకూడదు అని ఒక అర్థం. అలాగే.. ఇద్దరు కలిసి ఇష్టపడి పంచుకున్న ప్రేమను మరియు యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు. మరికొందరు తాము చేసిన దానాల గురించి డప్పు కొట్టుకుంటారు. మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదట. అలాగే మనకు జరిగిన అవమానమును కూడా ఎవరికీ చెప్పకూడదట. ఇద్దరు ఎంతో మంచి హృదయంతో కలిసిన సంగమము గురించి కూడా చెప్పకూడదట.

జగన్ సర్కారుకు కొత్త పేరు పె‌ట్టిన చంద్రబాబు ? మరీ అంత వెటకారమా..?
జగన్ సర్కారుకు కొత్త పేరు పె‌ట్టిన చంద్రబాబు ? మరీ అంత వెటకారమా..?

తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మహానాడు జరుగుతోంది. కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారానే చంద్రబాబు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అయితే ఈ మహానాడు వేళలోనే జగన్ సర్కారు ఏడాది పాలన పూర్తయింది. అందుకే మహానాడును జగన్ సర్కారుపై విమర్శలకు కేటాయించేశారు చంద్రబాబు. పార్టీ ప్రక్షాళన వంటి విషయాలపై ఫోకస్ చేయకుండా జగన్ సర్కారును తిట్టేందుకే నేతలు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. ఇక చంద్రబాబు ఈ విషయంలో అందరికంటే ముందే ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ది జంగిల్ రాజ్ అంటూ ఘాటుగా మండిపడ్డారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రజావేదికను కూల్చివేసిన జగన్ సర్కారు.. తాజాగా మూడు లాంతర్ల స్తంభాల వరకు అనేక కూల్చివేతలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసిందన్నారు చంద్రబాబు. రైతులకు చెప్పిన విధంగా 12500 ఇవ్వలేదని, 7500 రూపాయలే ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. భూముల్లో, గనుల్లో దోపిడీలకు పాల్పడ్డారు. సింహాచలం భూములపై కన్నేశారు. రాజమండ్రిలో ఆవ భూముల్లో అవినీతి చేశారు. కరోనా వల్ల ఎన్నికలు ఆపేస్తే...ఎన్నికల అధికారిని తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. కరోనా కాలంలో పింఛనర్లు, ఉద్యోగులకు జీతాల్లో 50శాతం కోత విధించారని.. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం వేలకోట్ల బిల్లులు చెల్లించారని చంద్రబాబు విమర్శించారు. రాజధాని తరలింపు అంశంపై సెలక్ట్‌ కమిటీ వేయమన్నందుకు శాసనమండలి రద్దు తీర్మానం చేస్తారా? చైర్మన్‌ చెప్పింది మండలి కార్యదర్శి చేయరా ? అంటూ మండిపడ్డారు. అయితే అసలు మహానాడు తెలుగుదేశం పార్టీ కోసం అన్న విషయం మాత్రం చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు.

జగన్ మేధోమథనం : ఇక చదువు పూర్తవుతూనే ఉద్యోగం గ్యారెంటీ..?
జగన్ మేధోమథనం : ఇక చదువు పూర్తవుతూనే ఉద్యోగం గ్యారెంటీ..?

సర్కారీ చదువులు అంటే.. అవి యువతనూ రెంటికీ చెడ్డరేవడిగా మారుస్తాయన్న అభిప్రాయం ఉంది. సర్కారు బళ్లలో చదువుకున్న వాళ్లు పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేదు.. ఇటు పోనీ గ్రామాల్లో వ్యవసాయం అయినా చేసుకుంటారా అంటే.. చదువుకున్నామన్న ఫీలింగ్‌ తో అదీ చేయరు. అటు ఉద్యోగాలు రాక.. ఇటు పొలం పనులు రాక.. వారు రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే దీన్ని సమూలంగా మార్చాలని జగన్ సర్కారు నిర్ణయించింది. జగన్ ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో విద్యారంగం ఎలా ఉందన్న విషయంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ ఏమన్నారంటే.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మంచి చదువులు దక్కాలంటే చైతన్య, నారాయణ వంటి ప్రైవేటు సంస్థలే దిక్కు అనే పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయ దలిచారు. ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ ఉండాలని నిర్ణయించారు. 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ ఏడాదికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.4200 కోట్లను ఇప్పటికే చెల్లించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బులను.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తాంరు. అంతే కాదు.. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు వసతి దీవెన కింద రెండు దఫాల్లో రూ.20వేలు ఇస్తారు. కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసి.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేయబోతున్నారు. అందుకు అనువుగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్నారు. పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కోసం ఇద్దరు రిటైర్డ్‌ జడ్జిలను నియమించారు. ఈ మార్పులన్నీ అమలైతే చదువు పూర్తి కాగానే ఉద్యోగం అందుకునేంత సత్తాతో విద్యార్థులు విద్యాసంస్థ నుంచి బయటకు వస్తారు.

జగన్ మేధోమథనం : విద్యారంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న జగన్..?
జగన్ మేధోమథనం : విద్యారంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న జగన్..?

జగన్ ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో విద్యారంగం ఎలా ఉందన్న విషయంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష చూస్తే.. జగన్ పాలనలో విద్యారంగం సమూలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెప్పక తప్పదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చక్కటి విద్య అందాలనే ఆశయంతో పనిచేస్తున్న జగన్ సర్కారు.. ఆ దిశగా తొలి ఏడాదిలో చక్కటి అడుగులు వేసింది. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నారు.. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలున్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్‌, టాయిలెట్లు ఉండాలి. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించారు. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశారు. అంతే కాదు. బడికి వచ్చే పిల్లల కోసం జగనన్న గోరు ముద్ద.. పథకం అమలు చేస్తున్నారు. పిల్లల కోసం రుచికరమై మెనూ తయారు చేశారు. ఇకపై పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక అందచేస్తారు. ఇక ఇంగ్లిష్‌ మీడియం కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నారు. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో జగన్ సర్కారు విప్లవం తీసుకొచ్చినట్టే చెప్పాలి. అంతే కాదు.. దీని కోసం వేల కోట్లు ఖర్చువుతున్నా లెక్క చేయడం లేదని.. ఇదంతా మన పిల్లల భవిష్యత్‌పై పెడుతున్న పెట్టుబడిగా జగన్ చెప్పారంటే.. విద్యారంగం ప్రక్షాళనపై జగన్ సర్కారుకు ఉన్న చిత్త శుద్ధి అర్థం చేసుకోవచ్చు.

బాహుబలిని మించిన అమితాబ్ సినిమా రికార్డులు...?
బాహుబలిని మించిన అమితాబ్ సినిమా రికార్డులు...?

బాహుబలి.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన చిత్రం.. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి రికార్డులు ఏ సినిమా కూడా నమోదు చేయలేదు.. ఇప్పట్లో చేసే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు వచ్చే రికార్డులను నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఓ అమితాబ్ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిందట. ఈ విషయం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ స్వయంగా చెబుతున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా.. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ కలిసి నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ'. అదేంటి ఇది పాత సినిమా కదా అంటారా.. అవును ఆ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తైంది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఈ విషయాన్ని అమితాబ్ మరోసారి తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఆయన ఈ సినిమాను బాహుబలితో పోల్చారు. 'బాహుబలి: ది కన్ క్లూజన్' కంటే 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఎక్కువ వసూళ్లను రాబట్టిందని అమితాబ్ అంటున్నారు. ఎందుకో కూడా ఆయన వివరిస్తున్నారు. 43 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే ఈ చిత్రం అప్పట్లో రూ. 7.25 కోట్లను రాబట్టిందట. ఇప్పటి కరెన్సీతో పోలిస్తే.. అప్పటి కరెన్సీ విలువ చాలా తక్కువ కాబట్టి.. ఇప్పటి లెక్కల్లో దాన్ని మొత్తం రూ. 543 కోట్లు వసూలు చేసినట్టు అమితాబ్ లెక్కలు వేశారు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' ముంబైలో 25 థియేటర్లలో 25 వారాల పాటు ఆడిందట. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా వసూళ్లు రూ. 7.25 కోట్లు. 43 ఏళ్ల క్రితం టికెట్ విలువ రూ. 2 ఈ లెక్కన మొత్తం 3,62,50,000 మంది సినిమా చూశారట. ఇదే లెక్కను ఇప్పటికి పోల్చి చూస్తే.. 'బాహుబలి-2' విడుదల నాటి టికెట్ ధర రూ. 150తో లెక్కిస్తే... మొత్తం రూ. 543 కోట్లు వసూలు చేసినట్టు లెక్క తేలుతోందట. అంటే.. 'బాహుబలి-2' చిత్రం ఇండియాలో రూ. 510 కోట్లు రాబట్టింది. సో.. అమితాబ్ లెక్క ప్రకారం బాహుబలి కంటే మరో 30 కోట్లు ఎక్కువే అమర్ అక్బర్ ఆంటోనీ రాబట్టిందన్నమాట.

అప్పట్లో చెన్నారెడ్డి.. ఇప్పుడు జగన్ రెడ్డి.. ఆ విధంగా ఏపీ చరిత్ర మార్చేస్తారా..?
అప్పట్లో చెన్నారెడ్డి.. ఇప్పుడు జగన్ రెడ్డి.. ఆ విధంగా ఏపీ చరిత్ర మార్చేస్తారా..?

ఏపీని పాలించిన ముఖ్యమంత్రుల్లో మర్రి చెన్నారెడ్డికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీని కూడా లెక్క చేయకుండా ధిక్కరించిన రెబల్ క్యారెక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా రెబల్ క్యారెక్టర్లో తక్కువేమీ కాదు కదా. ఏకంగా పార్టీ హైకమాండ్ సోనియా గాంధీనే లెక్కచేయకుండా సొంత పార్టీ పెట్టుకుని సత్తా చాటిన నాయకుడు జగన్. అంటే గట్స్ విషయంలో చెన్నారెడ్డికీ, జగన్ మోహన్ రెడ్డికీ పోలిక ఉందన్నమాట. అయితే గట్స్ విషయంలోనే కాదు మరో విషయంలోనూ ఈ ఇద్దరికీ పోలిక ఉంది. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి కాలంలోనే.. మద్రాసులో స్థిరపడిన తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి వచ్చింది. ఇందుకు చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హైదరాబాద్ లో నిర్మాతలకు చాలా తక్కువ ధరకే పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. దాని ఫలితంగానే హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్థిరపడింది. ఇప్పుడు ఏపీ విడిపోయిన నేపథ్యంలో జగన్ కూడా ఇలాంటి చొరవ తీసుకోవాలంటున్నారు సినీ నిర్మాతలు. ఏపీలో చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలుగు నిర్మాతల మండలి ముఖ్యమంత్రిని కోరుతోంది. ఏపీలో నిర్మాతలకు స్టూడియోలు, ల్యాబ్స్ నిర్మించుకునేందుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతోంది. అంతే కాదు సినీ పరిశ్రమ వర్గాలకు ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది. ఇప్పటికే.. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన నిర్మాతల మండలి థ్యాంక్స్ చెప్పింది. మరి ఇప్పుడు జగన్ కూడా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు భారీగా భూములు ఇస్తారా అన్నది చూడాలి. అందులోనూ జగన్ విశాఖను రాజధానిగా చేసుకుంటున్నారు. విశాఖ సినీ పరిశ్రమకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి జగన్ తలచుకుంటే విశాఖకు సినీపరిశ్రమను తీసుకెళ్లడం కూడా అంత కష్టంకాబోదు. చూడాలి ఏం జరుగుతుందో..?

జగన్ మేధోమథనం : జగన్‌ను కంట తడి పెట్టించిన ఓ విద్యార్థి కథ..?
జగన్ మేధోమథనం : జగన్‌ను కంట తడి పెట్టించిన ఓ విద్యార్థి కథ..?

జగన్ సర్కారు విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తోంది. ఏడాది కాలంలోనే ఆ దిశగా ఎన్నో అడుగులు వేసింది. వాటిలో పూర్తి స్థాయి ఫీజ్‌ రీఎంబర్స్ మెంట్‌ ఒకటి. అంటే ఎవరైనా పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే.. అతడికి పూర్తి గా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది ఓ విప్లవాత్మక నిర్ణయం. గతంలోనూ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉన్నా.. దానికి ఓ లిమిట్ ఉండేది. ఆ మిగిలిన సొమ్ము విద్యార్థే కట్టుకోవాల్సి వచ్చేది. కానీ జగన్ సర్కారు మొత్తం ఫీజు కడుతోంది. అయితే ఈ పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సమయంలో గోపాల్ అనే వ్యక్తి, ఆయన భార్య వచ్చి కలిశారట. జగన్ ను కలిసి చాలా బాధపడ్డాడట. ఎందుకు బాధపడుతున్నావు అన్నా.. అని అడిగితే.. ఆ ఫ్లెక్సీ నా కొడుకుది.. నా కొడుకు బాగా చదువుతాడు.. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చాయి. నా కొడుకును ఇంజనీరింగ్‌ చదివించడానికి కాలేజీకి తీసుకెళ్లా.. ఫీజు చూస్తే దాదాపు మెస్‌ ఖర్చులతో కలిపి దాదాపు రూ. 1 లక్షా అవుతుంది. ప్రభుత్వం కేవలం ముష్టి వేసినట్లుగా రూ. 35 వేలు ఇస్తుంది. మిగిలిన డబ్బు అప్పోసొప్పో చేస్తే తప్ప నా పిల్లాడిని చదివించలేని పరిస్థితి.. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తరువాత నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావ్‌ అని.. నువ్వు చదువు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి అప్పుతీసుకొచ్చి నా కుమారుడిని కాలేజీలో చేర్పించాను. నేను అప్పు తెచ్చాననే సంగతి నా కొడుకుకు అర్థం అయ్యింది. మొదటి ఏడాది పూర్తయింది.. సెలవులకు ఇంటికి వచ్చాడు.. రెండవ ఏడాది ఫీజుల గురించి ఏ చేయబోతున్నావ్‌ నాన్న అని అడిగాడు.. ఏదో ఒకటి చేస్తానులే నాన్న అని చెప్పాను.. ఎలా చేయబోతున్నాననేది నా కుమారుడికి అర్థం అయ్యింది.. కాలేజీకి వెళ్లాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తన చదువు కోసం నేను అప్పులపాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని గోపాల్ చెప్పి కన్నీరు పెట్టుకున్నాడని జగన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే జగన్ మదిలో ఈ పూర్తి స్థాయిఫీజురీఎంబర్స్ మెంట్ పథకం రూపుదిద్దుకుందని గద్గద స్వరంతో జగన్ వివరించారు.

బిగ్ బ్రేకింగ్: జయలలిత ఆస్తులన్నీ వారికేనట.. ఉన్నపళంగా వందల కోట్లు వచ్చిపడ్డాయ్ కదా..?
బిగ్ బ్రేకింగ్: జయలలిత ఆస్తులన్నీ వారికేనట.. ఉన్నపళంగా వందల కోట్లు వచ్చిపడ్డాయ్ కదా..?

జయలలిత.. తమిళనాడు ఒక దేవత. సినీరంగంలో, రాజకీయ రంగంలో ఆమె సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆమె కూడబెట్టిన ఆస్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎంత తక్కుగా లెక్కవేసినా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఆమె పేరిట ఉన్నాయి. కానీ ఆమె అవివాహిత కావడంతో ఆమె ఆస్తులు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందాన్న అంశంపై వివాదం ఉంది. జయఆస్తులకు సంబంధించి ఓ అన్నాడీఎంకే వేసిన కేసు ఆధారంగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని ప్రకారం.. జయ ఆస్తులు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లకే చెందుతాయని తేల్చి చెప్పింది. జయలలిత చట్టబద్ధమైన వారసులు వీరేనని ప్రకటించింది. ఎందుకంటే.. చనిపోయేంత వరకు జయ పెళ్లి చేసుకోలేదు. అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఇప్పుడు జయలలిత ఆస్తిపాస్తులన్నీ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ లేక చెందనున్నాయి. జయలలిత పేరుపై అధికారిక లెక్కల ప్రకామే రూ. 913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కూడా జయ నివాసమైన వేదనిలయం కాకుండా.. మద్రాసులో కీలక ప్రాంతంలో ఉన్న ఈ వేద నిలయం విలువ కనీసం రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా.. అందువల్ల జయ ఆస్తి దీప, దీపక్ లకు దాదాపు చెరో 500 కోట్లు దక్కే అవకాశం ఉంది. అయితే కోర్టు మాత్రం వేద నిలయంలో సగభాగాన్ని సీఎం కార్యాలయంగా, మిగిలిన సగభాగాన్ని ఆమె స్మారకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే వేద నిలయంపై వారసులకూ హక్కులు ఉంటాయి కాబట్టి వారి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పింది. మొత్తానికి జయ వారసులకు ఉన్నపళంగా వందల కోట్ల రూపాయలు దక్కనున్నాయి.

నేడు టీటీడీ చరిత్రలోనే కీలకమైన రోజు.. ఏం నిర్ణయం తీసుకున్నా వివాదమే..?
నేడు టీటీడీ చరిత్రలోనే కీలకమైన రోజు.. ఏం నిర్ణయం తీసుకున్నా వివాదమే..?

టీటీడీ ఇటీవల తీసుకున్న శ్రీవారి భూముల వేలం నిర్ణయం రాజకీయంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు, హిందూ సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. దీంతో జగన్ సర్కారు కూడా ఆ వేలం ప్రకటన సహా టీటీడీ తీర్మానాన్ని నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో నేడు పాలక మండలి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. తనకు చెడ్డ పేరు తీసుకొచ్చే శ్రీవారి భూముల వేలం నిర్ణయాన్ని సీఎం గట్టిగానే వ్యతిరేకించినట్టు భావిస్తున్నారు. అందుకే.. ఏకంగా ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆపేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం నిలుపుదల చేయడం కాకుండా.. మొత్తానికి రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విపక్షాలు ఏం జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. అందుకే.. కలియుగ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తులపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. టీటీడీ ఆస్తులు విక్రయించాలని తీర్మానాలు చేసింది టీడీపీ పాలనలోని టీటీడీ పాలక మండలి కాదా..? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత బోర్డు చేసిన తప్పును తమపై రుద్ధి రాజకీయ లబ్ధిపొందాలని చూడడం దారుణమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. ఇక స్వామి వారి దర్శనం గురించి మాట్లాడుతూ.. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు చెబితే అప్పుడు భక్తలకు స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, చాలా ప్రాంతాల వాసులు శ్రీవారి ప్రసాదాలు అందించాలని కోరుతున్నట్లు చెప్పారు.

అవినీతి నిరూపించు.. ఇప్పుడే రాజీనామా చేస్తా.. చంద్రబాబుకు వైసీపీ మంత్రి సవాల్..?
అవినీతి నిరూపించు.. ఇప్పుడే రాజీనామా చేస్తా.. చంద్రబాబుకు వైసీపీ మంత్రి సవాల్..?

మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి కి వచ్చాక జగన్ సర్కారుపై విమర్శల డోసు పెంచారు. భూకబ్జాల కోసమే విశాఖను రాజధానిగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తాజాగా చంద్రబాబు ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి విశాఖ నేతలు చంద్రబాబు ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖలో గజం స్థలం అవినీతి జరిగిందని, భూకుంభకోణం జరిగిందని చంద్రబాబు నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. తన సవాల్ కు చంద్రబాబు అంగీకరించాలని.. అంతే తప్ప.. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదే సమయంలో అవంతి శ్రీనివాస్ మిగిలిన అంశాలపైనా స్పందించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు ఇష్టారీతిన బురద చల్లుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్న మంత్రి అవంతి.. విద్యతోనే పేదల జీవితాల్లో మార్పులొస్తాయని సీఎం గట్టిగా నమ్మారన్నారు. అందుకే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,500 కోట్లు జమ చేశారని మంత్రి అవంతి అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని మంత్రి అవంతి ప్రశ్నించారు. రెండు నెలల తరువాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడులో ప్రజలను మభ్యపెడుతూ మాట్లాడుతున్నారన్నారు. మహానాడు వేదికపై 2019 ఓటమిపై విశ్లేషించుకుంటే బాగుండేదని సలహా ఇచ్చారు.

మీడియా మంటలు: నా యుద్ధం ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌తో.. తేల్చి చెప్పిన జగన్..?
మీడియా మంటలు: నా యుద్ధం ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌తో.. తేల్చి చెప్పిన జగన్..?

ఏపీ సీఎం జగన్ మరోసారి మీడియాకు వార్నింగ్ ఇచ్చారా.. తన వ్యతిరేక మీడియాను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారా.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలో ఆయన తన వ్యతిరేక మీడియాకు హెచ్చరికలు పంపారా.. ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా... నిర్వహించిన మనపాలన మీ సూచన కార్యక్రమంలో జగన్ ఈ విషయంపై మరోసారి కుండబద్దలు కొట్టేశారు. ఆయన ఏమన్నారంటే.. “ రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టులు తీసుకువస్తున్నామో.. వాటిపై ఎంత ఆరోపణలు చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. మనం యుద్ధం చేస్తుంది.. చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. యుద్ధం చేస్తుంది.. ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌తో, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని మీ అందరికీ చెప్పాల్సిన పనిలేదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాగుపడాలంటే.. నీరు రాని పరిస్థితి అంటూ తన శత్రు మీడియాపై సమర శంఖం మరోసారి పూరించారు. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ ఇలా మాట్లాడటం ఇదేమీ కొత్త కాదు. ఆయన ప్రమాణ స్వీకారం వేదికపైనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇవే మాటలు చెప్పారు. ఇప్పుడు ఏడాది తర్వాత కూడా జగన్ అవే మాటలు చెబుతున్నారు. అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయన వ్యతిరేక మీడియా ధోరణిలో మాత్రం ఏమార్పూ లేదు. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ కథనాలు అచ్చొత్తుతూనే ఉన్నాయి. అయితే జగన్ సర్కారు మాత్రం ఈ ఏడాది కాలంలో పెద్దగా తన శత్రు మీడియాపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓ జీవో తెచ్చి చాలా కాలమే అయినా దాన్ని ప్రయోగించింది చాలా తక్కువ సార్లు. మరి ఇప్పుడు మరోసారి జగన్ నోటి వెంట వార్నింగ్ రావడం దేనికి సంకేతం.. ఇకపై జగన్ తన వ్యతిరేక మీడియాపై జూలు విదులుస్తారా.. లేక.. గతంలోలాగే వార్నింగ్ ఇచ్చేసి ఆ తర్వాత లైట్ గా తీసుకుంటారా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. రైతుల జీవితాల్లో ఇక పెను మార్పులు..?
జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. రైతుల జీవితాల్లో ఇక పెను మార్పులు..?

మనది వ్యవసాయ ప్రధాన దేశం, ఏపీ కూడా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్న మాత్రం నిత్యం కష్టాలసాగులోనే జీవితం చాలిస్తున్నాడు. ఈ పరిస్థితి మార్చేందుకు జగన్ సర్కారు ఓ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. అదే రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి. రైతు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఎప్పుడు ఏ పంట వేయాలి.. ఏ పంటకు గిట్టుబాట ధర వస్తుంది. పంట ఎప్పుడు అమ్ముకోవాలి.. వంటి అనేక అంశాలు రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల్లోసమాచారం ఉంటుంది. వీటి ద్వారా గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆర్‌బీకేలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం అవుతాయి. అక్కడి నుంచి విప్లవాత్మక మార్పు ప్రారంభం అవుతుంది. అంతే కాదు..ఇకపై కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకింగ్‌ యూనిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటే.. 30 శాతం పంటలు ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే సాధ్యమవుతుందని ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నారు. రైతులు పండించే పంటలు, చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు జనతా బజార్లలో ఉంటాయి. ప్రభుత్వం 30 శాతం కొనుగోలు చేస్తే.. వెంటనే మార్కెట్‌లో పోటీతత్వం మొదలవుతుంది. ఏ దళారీ అయినా గవర్నమెంట్‌ కొనుగోలు చేసే రేట్‌ కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తాడు. వచ్చే సంవత్సరం చివరికల్లా జనతా బజార్లు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు.. 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు తీసుకురాబోతున్నారు. పంటలు పండించే నియోజకవర్గాలు 147గా గుర్తించడం జరిగింది. అక్కడ మొత్తం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌బీకే స్థాయిలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భూసార పరీక్షలు చేయిస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక వ్యవసాయ సలహా బోర్డు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నారు.

జీవిత సత్యాలు : అసలు మీ విలువ ఎంతో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా..?
జీవిత సత్యాలు : అసలు మీ విలువ ఎంతో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా..?

మీ విలువ ఎంతో మీకు తెలుసా.. ఇదేం ప్రశ్న అనుకోకండి.. ఎందుకంటే.. మీ విలువ ఎంతో మీరు సరిగ్గా అంచనా వేసుకున్నప్పుడే మీ జీవితం మీరు అనుకున్న దిశలో వెళ్తుందో లేదో అంచనా వేసుకోగలుగుతారు. సరిగ్గా అర్థం కాలేదా... అయితే మీకో కథ చెబుతాను. దాంతో మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకు ని పిలిచి...ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాభట్టి 150 రూపాయలు ఇవ్వగలం అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా త్రుప్పు పట్టి ఉంది 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు. ఈ సారి తండ్రి కొడుకుతో .. మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియూ అత్యంత అరుదైనది. 5 లక్షలు ఇవ్వగలం అంటారు. అప్పుడు తండ్రి కొడుకుతో..."ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు, అలా అని వారి మీద కోపం వద్దు; వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు" అని చెప్తాడు. కథ చూశారుగా.. ఇప్పుడు మీరు మిమ్మల్ని అంచనా వేసుకోండి. మీరు మీ విలువ పెంచుకునే అవకాశం ఉందా.. మీరు చేస్తున్న ఉద్యోగం.. మీరు అందుకుంటున్న వేతనం.. మీ విలువకు తగ్గవేనా.. ఓసారి ఆలోచించుకోండి. సమాధానం సంతృప్తి కలగకపోతే.. అప్పుడు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది.

ఈ వైసీపీ నేత సవాల్ స్వీకరించే దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా..? ఉంటే కథ భలే రంజుగా ఉంటుందిగా...?
ఈ వైసీపీ నేత సవాల్ స్వీకరించే దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా..? ఉంటే కథ భలే రంజుగా ఉంటుందిగా...?

ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విపక్షం టీడీపీ అనేక విమర్శలు చేసింది. ఏడాదిలో జగన్ చేసిందేమీ లేదని మండిపడుతోంది. అందుకే ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. అందుకే ఆయన బహిరంగ సవాల్ విసిరారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలంటున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించిందన్నారాయన. హైదరాబాద్‌లో ఉండి జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్‌ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు.. అని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాలకు కూడా లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందన్న శ్రీకాంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా కుట్ర రాజకీయాలతో అడ్డుతగులుతున్నాడన్నారు. జగన్ అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా మా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఓ వ్యక్తి తప్పతాగి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే డిబేట్లు పెడుతుంది.. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని... టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మరి ఈ సవాల్ పై టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా..? చూడాలి.

ఈనెల 30 న మరో సంచలనానికి తెర తీయనున్న జగన్..?
ఈనెల 30 న మరో సంచలనానికి తెర తీయనున్న జగన్..?

ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్.. ఈనెల 30 న మరో సంచలానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే విధంగా రైతుభరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసివేయడమే లక్ష్యంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రైతు పంట పండించే చోటే పంట కొనుగోలు చేస్తారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయని జగన్ సర్కారు నమ్ముతోంది. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల ముందులు రైతుకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే కార్యక్రమం ఆర్‌బీకేల ద్వారా చేస్తారు. అంతే కాదు.. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ ఉంటుంది. ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆర్‌బీకేలో టీవీ.. చిత్రాలు అన్నీ ఉంటాయి. ప్రతి రైతుకు సూచనలు, సలహాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆర్‌బీకే విజ్ఞాన, శిక్షణ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్పించేందుకు ఆర్‌బీకేల ద్వారా నాంది పలుకుతున్నారు. ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉంటాడు. గ్రామ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు. వీరిద్దరూ కలిసి పంట వేసేటప్పుడే ఈక్రాపింగ్‌ చేస్తారు. రైతుకు పంట రుణాలు ఇప్పిస్తారు. ఈ క్రాపింగ్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ కూడా ఆర్‌బీకే కేంద్రం చేస్తుంది. ఆర్‌బీకేలోనే పూర్తిగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అని బోర్డు ప్రదర్శిస్తాం. ఆ గ్రామంలో ఏ రైతుకయినా గిట్టుబాటు ధర రాకపోతే ఆర్‌బీకేలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ దగ్గర ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఉంటుంది. ప్రతి రోజు ఏ పంట పరిస్థితి ఏమిటీ.. ఎన్ని పంటలు వేశారు..ఆ పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా.. లేదా..? ఆ పంటల్లో మనం ఇంటర్వీన్‌ కావాల్సిన అవసరం ఉందా..? రైతు నష్టపోకుండా పంట అమ్ముకుంటున్నాడా..? అని ప్రతి రోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సమాచారం పంపించాలి. ఈ ఆర్‌బీసీల నియంత్రణ కోసమే జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించారు.

షాకింగ్ : చంద్రబాబుకు ఈసారి హైకోర్టులో షాక్ తప్పదా..?
షాకింగ్ : చంద్రబాబుకు ఈసారి హైకోర్టులో షాక్ తప్పదా..?

మాజీ సీఎం చంద్రబాబుకు ఈసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తప్పేలా లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయ స్థానాన్ని కోరారు. ఇంతకూ అసలేం జరిగిందేటే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల ఆగారు. ఇందు కోసం టీడీపీ నేతలు భారీగా జనసమీకరణ చేశారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఇవన్నీ లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయి. ఈ విషయాన్నే పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయ స్థానం మందు వుంచారు. అంతే కాదు.. వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి కూడా చంద్రబాబు ఉల్లంఘనలను సుమోటో తీసుకోవాలని కోరుతూ హైకోర్టుకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే.. దాదాపు ఇవే ఆరోపణలపై పలువురు వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఇది కూడా దాదాపు అదే తరహా కేసు కాబట్టి ఈ కేసులో చంద్రబాబు కు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఏపీ హైకోర్టు చాలా కేసులు సుమోటోగా స్వీకరిస్తోంది. డాక్టర్ సుధాకర్ కేసును టీడీపీ నేత వంగల అనిత లేఖ రాయడం వల్లే హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇదొక్కటే కాదు.. మిగిలిన చాలా కేసులు సుమోటోగా తీసుకుంది హైకోర్టు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే వ్యూహం ఫాలో అవుతున్నారు. మరి హైకోర్టు వీరి లేఖలను కూడా పరిగణనలోకి తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

జగన్ సర్కారు కొత్త వరం.. ఆ వ్యాధితో చనిపోతే రూ. 5 లక్షలు పరిహారం..?
జగన్ సర్కారు కొత్త వరం.. ఆ వ్యాధితో చనిపోతే రూ. 5 లక్షలు పరిహారం..?

జగన్ సర్కారు మరో వరం ప్రకటించింది. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధితో పలువురు మరణిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టారు. అత్యవసరంగా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే.. గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏజెన్సీలో కాళ్ల వాపు వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు కాళ్ల వాపు వ్యాధితో 14 మంది మృతి చెందారని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి ఆళ్లనాని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో ఇప్పటికే 45 విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయని, మరో 20 క్లినిక్‌లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. చింతూరు ఏరియా ఆస్పత్రిని త్వరలో వంద పడకల ఆస్పత్రిగా మార్చుతామన్నారు. తూర్పు మన్యంలోని గిరిజన ప్రాంతాల్లో కాళ్ల వాపు వ్యాధి నివారణపై కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో క‌లిసి మంత్రి ఆళ్ల నాని స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లోనే ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని, పలు గ్రామాలను హాట్‌ స్పాట్లుగా గుర్తించామన్నారు. బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి, నివేదికల ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం సేకరించిన 103 మంది శాంపిల్స్‌లో 16 మందికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఏజెన్సీలో కాళ్ల వాపుపై రెండో దశ సర్వే రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు ఏజెన్సీలో అదనంగా మరో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. రక్షిత మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన గిరిజన గ్రామాల్లో యూవీ వాటర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

మేధోమథనం : ఆ విషయంలో కొత్త రికార్డులు సృష్టించిన జగన్ ?
మేధోమథనం : ఆ విషయంలో కొత్త రికార్డులు సృష్టించిన జగన్ ?

జగన్ ఏడాది పాలనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. రైతులు ఆయన పాలనపై చాలా సంతృప్తిగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన ఏడాదిలో రైతుల కోసం దాదాపు 10 వేల 200 కోట్లు రూపాయలకు పైగా ఖర్చుచేశారు. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో రూ.12,500 నగదు 4 ఏళ్ల పాటు కలిపి రూ.50 వేలు ఇస్తామని చెప్పాడు జగన్. అధికారంలోకి వచ్చాక.. చెప్పినదానికంటే ముందుగా నాలుగేళ్లు చెబితే ఐదేళ్లు ఇచ్చేట్లుగా.. మాటిచ్చింది రూ.12,500 అయితే ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా.. ఐదేళ్ల పాటు రూ.67,500 రైతుల చేతులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంట వేసే సమయానికి ఆ రైతు విత్తనం కొనుగోలు చేసేందుకు, వ్యవసాయ ఖర్చుల కోసం రూ.7500 మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. . ఖరీఫ్‌ పంట కోయడం కోసం, రబీ పంట వేసేందుకు ఏరకంగానైనా రైతుకు మళ్లీ ఉపయోగపడేలా ఉండేందుకు మళ్లీ అక్టోబర్‌ మాసంలో రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం ఇంటికి చేరేవేళ సంక్రాంతి సందర్భంగా మరో రూ. 2 వేలు రైతులకు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించారు. జూన్‌లో జగన్ అధికారం చేపట్టారు.. అప్పటికే మే మాసంలో అయిపోయింది కాబట్టి రబీ పంటకైనా ఇవ్వాలని అక్టోబర్‌లోనే రైతుభరోసా సాయం అందించారు. దాదాపు 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019–20 సంవత్సరంలో రైతు భరోసా కింద రూ.13500 రైతులకు ఇచ్చాంరు. రూ.6,534 కోట్లను రైతు అకౌంట్లలో జమ చేశారు. 2020–21లో మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద రూ.7,500 జమ చేశారు. దాదాపు మరో రూ.3,670 రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంటే.. సంవత్సరం కూడా పూర్తికాక ముందే రైతులకు జగన్ సర్కారు ఇచ్చింది అక్షరాలా రూ.10,209 కోట్లు. అంతే కాదు.. రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా పెట్టుబడి సాయంగా అందేలా బ్యాంకర్స్‌తో మాట్లాడి రైతులకు ఈ సొమ్ము ఇచ్చారు.

జగన్ మేధోమథనం : సాగునీటి ప్రాజెక్టులపై ఫుల్ క్లారిటీతో జగన్.. కుండబద్దలు కొట్టేశాడుగా..?
జగన్ మేధోమథనం : సాగునీటి ప్రాజెక్టులపై ఫుల్ క్లారిటీతో జగన్.. కుండబద్దలు కొట్టేశాడుగా..?

వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. తన పాలనపై తానే సమీక్షించుకుంటున్నాడు. ఏడాది పాలన వివరాలను వివరిస్తున్నాడు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మన పాలన మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి పక్కా క్లారిటీగా మాట్లాడాడు. ఏయే ప్రాజెక్టులు చేపట్టాలో అంతా తన మనసులో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉందంటూ చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రాముఖ్యత ప్రకారం ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే విషయంలో జగన్ కు పూర్తి క్లారిటీతో ఉన్నాట్టే. ఇక మీద నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతాయి. ఈ సంవత్సరం వంశధార ఫేజ్‌ –2, వంశధార, నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్‌–1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవకు టన్నల్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కోవిడ్‌ వల్ల పనులు జాప్యం జరిగిందని.. అయినా కూడా పోలవరం 2021కి పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. ఇక రాయలసీమ డ్రౌట్‌మెట్రిగేషన్‌ 800 అడుగులకే నీళ్లను తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అక్షరాల రూ.27 వేల కోట్లతో డ్రౌట్‌మెట్రిగేషన్‌ ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు సంబంధించి చేస్తున్నామని... పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతున్నామని జగన్ తెలిపారు. పోలవరం కెనాల్‌ 17500 క్యూసెక్కులు.. దాన్ని 50 వేల క్యూసెక్కులు చేసి ప్రకాశం బ్యారేజ్‌ వరకు నీరు తీసుకువస్తే నాగార్జునసాగర్‌ అంతా సస్యశ్యామలం అయిపోతుందన్నారు. ఇక్కడి నుంచి 25 వేల క్యూసెక్కులు మళ్లీ శ్రీశైలంలోకి కలిపేస్తామని.. ఈ ప్రాజెక్టు ఈ ఏడాదిలోని పిలుస్తామని చెప్పారు. మొత్తానికి జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది.

జగన్ మేధోమథనం : అదే జరిగితే రాయలసీమ పాలిట దేవుడు జగన్...?
జగన్ మేధోమథనం : అదే జరిగితే రాయలసీమ పాలిట దేవుడు జగన్...?

రాయలసీమ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. నీటి వసతి లేక నిత్యం కరవుతో అల్లల్లాడిన ప్రాంతం. కృష్ణా, గోదావరి రెండూ ఉప్పొంగినా రాయలసీమలో నీటి వెతలు మాత్రం తప్పవు. ఇందుకు కారణం.. రాయలసీమకు నీటిని తీసుకెళ్లే సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే. రాయలసీమకు నీటిని అందించే పోతిరెడ్డి పాడు సామర్థ్యం చాలా తక్కువ. అది కూడా శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటేనే నీటిని తీసుకెళ్లడం కుదురుతుంది. అందుకే ఇప్పుడు జగన్ సర్కారు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతోంది.ఇది తెలంగాణ ఆగ్రహానికి కారణమైంది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నట్టున్నాడు. అందుకే మేధోమథన సదస్సులో ఈ విషయంపై గట్టిగానే మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే.. “ శ్రీశైలంలో 885 అడుగులు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్, కానీ పోతిరెడ్డిపాడు 44 వేల క్యూసెక్కులు డ్రా చేసే పరిస్థితి.. నీరు 881 అడుగులు ఉంటే మాత్రమే డ్రా చేయగలం. శ్రీశైలం 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు పడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రాయలసీమలో కరువు ఎప్పుడు తీరుతుంది. ఆల్‌మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు కర్ణాటకలో పెంచుతున్నారు. పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే వరద నీరు ఎన్ని రోజులు ఉంటాయని చూస్తే కేవలం 10 రోజులు మాత్రమే. 881 అడుగులు పది రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. అన్ని ప్రాజెక్టులు 800 అడుగుల్లోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి వారు పవర్‌ జనరేషన్‌ 796 అడుగులకు రాగానే పవర్‌ జనరేషన్‌ మొదలుపెడుతున్నారు. ఏరకంగా ప్రాజెక్టులు బతుకుతాయి. ఏరకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు వస్తాయని ఆలోచన చేస్తేనే మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకనే పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 800 అడుగుల్లో వారు ఆపరేట్‌ చేస్తున్న పంపులతో.. మనం కూడా 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో పంపులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఉంటాం. మన నీళ్లు మనం.. వారి నీరు వాళ్లు తీసుకుంటారు. ఎవరికీ అన్యాయం జరగదు... అంటూ తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టేశాడు జగన్. నిజంగా ఇది జరిగితే రాయలసీమ పాలిట జగన్ దేవుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

తిరుపతి వెంకన్న ఆస్తులపై రమణ దీక్షితుల సంచలన డిమాండ్.. అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏంటి..?
తిరుపతి వెంకన్న ఆస్తులపై రమణ దీక్షితుల సంచలన డిమాండ్.. అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకం వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట్లో తమిళనాడులోని శ్రీవారి నిరర్థక ఆస్తులను వేలం వేయాలన్న టీటీడీ నిర్ణయంతో తేనెతుట్టె కదిలింది. దీన్ని విపక్షాలు అందుకున్నాయి. శ్రీవారి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారన్న రేంజ్ లో విమర్శలు గుప్పించాయి. తిరుపతి వెంకన్నకు సంబంధించిన విషయం ఏదైనా భక్తుల సెంటమెంట్ తో ముడిపడి ఉంటుంది కనుక సహజంగానే ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది. జగన్ సర్కారు అనవసరంగా ఈ తేనెతుట్టెను కదిపిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత కానీ అసలు విషయాలు వెలుగు చూడలేదు. ఇదేమీ కొత్త నిర్ణయం కాదని చంద్రబాబు హయాంలో చేసిన తీర్మానం అమలు చేయడంతోనే ఈ రచ్చ మొదలైందని తెలిసింది. దీంతో వైసీపీ నేతలు కూడా విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే గత ప్రభుత్వం తప్పు చేస్తే మీరు దాన్ని కొనసాగిస్తారా అన్న ఎదురుదాడి మొదలైంది. దీంతో అసలు ఎందుకొచ్చిన గొడవ అని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగంది. నిర్ణయాన్ని ఆపేసింది. ప్రభుత్వం శ్రీవారి ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని ఆపేసినా విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై పూర్తి స్థాయిలో ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అది కూడా ఎన్టీఆర్ కాలం నుంచి ఈరోజు వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఈ ఆడిట్ జరిగితే చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు ఏమైనా ఉంటే బయటపడే అవకాశం ఉంది. మరి దీనికి జగన్ సర్కారు ఏమంటుందో చూడాలి. ఏదేమైనా శ్రీవారి ఆస్తుల అంశం మాత్రం రాజకీయాల్లో పెను దుమారమే లేపింది.

మీడియా మంటలు : టీవీ5 ఛానల్‌ ను టార్గెట్ చేసిన జగన్..! అరెస్టులు తప్పవా..?
మీడియా మంటలు : టీవీ5 ఛానల్‌ ను టార్గెట్ చేసిన జగన్..! అరెస్టులు తప్పవా..?

టీవీ5.. తెలుగుదేశం అనుకూల ఛానళ్ల జాబితాలో ప్రముఖంగా ఉండే చానల్. ఈ ఛానళ్లో వచ్చే కథనాలు, ఇంటర్వ్యూలు, డిబేట్లు అన్నీ తెలుగు దేశం కు అనుకూలంగానా.. వైసీపీకి వ్యతిరేకంగానూ ఉంటాయని మీడియా సర్కిళ్లో జోరుగా ప్రచారం ఉంది. అందులోనీ ఈ ఛానల్ కు మూర్తి వచ్చాక ఇంకాస్త జోరు పెరిగింది. వైసీపీ వ్యతిరేక చర్చలు మరింతగా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల టీవీ5 యాంకర్ మూర్తిని అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంకేముంది అరెస్టే తరువాయి అన్నట్టు గా మూర్తి అనుచరులు ప్రచారం చేశారు. కానీ అది వాస్తవం కాలేదు. తన పై ఏ కేసూ పెట్టలేదని మూర్తి నేరుగా తన టీవీ చానళ్లోనే వివరణ ఇచ్చారు. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో తాజాగా మరో ఇష్యూ ముందుకొచ్చింది. అదేంటంటే.. ఈ ఛానల్ సర్కారుకు చెందిన ఓ రహస్య డాక్యుమెంట్ ను తన చానళ్లో ప్రసారం చేసిందన్నది అభియోగం. ఈ మేరకు ఓ రహస్య డాక్యుమెంట్ ను టీవీ5 దొంగింలించడమో.. ఫోర్జరీ చేయడమో జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని కోరుతూ.. ఉన్నత విద్యాశాఖ అధికారి సతీష్ చంద్ర ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ వన్ గా శ్రావణ్ కుమార్ అనే లాయర్‌.... ఏ 2గా టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు.. ఏ 3గా ప్రజంటర్ మూర్తి ఉన్నారు. జగన్ సర్కారు కొన్నాళ్ల క్రితం మీడియాపై కేసులు పెట్టేందుకు అధికారులకు అవకాశం కల్పిస్తూ తెచ్చిన జీవో ప్రకారం కేసులు పెట్టారు. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీవీ5 లో అరెస్టులు ఖాయమన్న భావన మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ సర్కారు కేసులతోనే బెదిరించి వదిలేస్తుందా.. లేక.. అరెస్టుల వరకూ వెళ్తుందా అన్న సంగతి తేలాల్సి ఉంది. ఇటీవల ఈ ఛానల్ లో మరో న్యూస్ ప్రజంటర్ సాంబశివరావును కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగింది. మొత్తానికి జగన్ సర్కారు టీవీ5 ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.

మేథోమథనం : జగన్‌ ఏడాది పాలన – విప్లవాత్మక వ్యవస్థలకు శ్రీకారం..!
మేథోమథనం : జగన్‌ ఏడాది పాలన – విప్లవాత్మక వ్యవస్థలకు శ్రీకారం..!

ఏపీ సీఎంగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. మరి ఆయన సాధించిందేంటి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన ఉందా.. ఏడాది పాలన సందర్భంగా జగన్ మేధోమథన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి జగన్ ఏడాది పాలనను ఓసారి పరిశీలిద్దాం. ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. ప్రజలకు మరింత అందుబాటులో పాలన ఉండేందుకు జగన్ తక్కువ కాలంలోనే కొత్త వ్యవస్థలను అందుబాటులో తెచ్చారు. అవే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు.. పాలనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. వాలంటీర్ తనకు అప్పగించిన 50 కుటుంబాలకు జవాబుదారీగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో వాలంటీర్ల వ్యవస్థ విజయవంతమైందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలని జగన్ వారిని ఆదేశించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చాలా సులభమైంది. ఏ సమాచారం కావాలన్నా అధికారులకు చిటికెలో లభిస్తోంది. మొన్నటికి మొన్న కరోనా కట్టడిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గతంలో ఏవో కాకి లెక్కల ద్వారా ఉజ్జాయింపు గణన ద్వారా ప్రభుత్వ పథకాలు రూపొందేవి. లబ్దిదారుల జాబితాలు రూపొందేవి. కానీ ఇప్పుడు పకడ్బందీగా పాలన సాగేందుకు వాలంటీర్లు పునాదులుగా మారారు. ఈ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే అంటూ మొదట్లో టీడీపీ నానా హడావిడి చేసింది. కానీ దాన్ని నిరూపించడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు అక్కడక్కడా వాలంటీర్లపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేస్తోంది. మరి వాలంటీర్లంతా వైసీపీ వారే అయితే వారిపై వారే దాడులు చేసుకుంటారా.. టీడీపీ డొల్లవాదనలకు ఇదో నిదర్శనంగా మారింది. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ జగన్ ఏడాది పాలనలో విప్లవాత్మక మార్పుగానే చెప్పుకోవాలి.

జీవిత సత్యాలు: మిమ్మల్ని ముంచాలని చూస్తున్నది వీళ్లే.. కాస్త జాగ్రత్త..?
జీవిత సత్యాలు: మిమ్మల్ని ముంచాలని చూస్తున్నది వీళ్లే.. కాస్త జాగ్రత్త..?

రోజూ ఎందరితోనూ కలసి పని చేస్తుంటాం. కానీ కొందరి వల్ల మనం అనుకోకుండా నష్టపోతాం.. కనీసం అలా నష్టపోతున్నామని మనం గుర్తించేలోపే జరిగే నష్టం జరిగి తీరుతుంది. మనిషి సంఘజీవి. మన విజయం, పరాజయం మనపై కంటే... ఎక్కువగా ఇతరులపై ఆధారపడే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మనం మన చుట్టూ ఉండేవారిని ఓ సారి గమనించాలి. ఎలాంటి వాళ్లతో కలసి పనిచేస్తున్నామన్న విషయంలో క్లారిటీ ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యతిరేక దృక్పథం ఉన్నవాళ్లు మన విజయాలపై ప్రభావం చూపుతారు. కొందరు పనిదొంగలు ఉంటారు. వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు.పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా కనబడతారు. అందుకే.. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది. ఇంకొందరు పుకారుగాళ్ళు ఉంటారు. వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే వీరికి చాలా ఇష్టం. నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్లను జాగ్రత్తగా గమనించాలి. మన విజయానికి తోడ్పడే వాళ్లతోనే పని చేయాలి. అదే మన విజయానికి దారి తీస్తుంది.

జగన్ మేధోమథనం: ఏడాది పాలన సింహావలోకనం..!
జగన్ మేధోమథనం: ఏడాది పాలన సింహావలోకనం..!

ఏపీ సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ పాలకుడైనా విజయోత్సవాలు జరుపుకుంటారు. పార్టీ శ్రేణులూ అదే పని చేస్తాయి. మా పాలన అదుర్స్.. మేం మహా గొప్పగా పాలించాం అని డబ్బా కొట్టుకుంటారు. రాజకీయాల్లో ఇది చాలా సహజంగా మారింది. ఇన్నాళ్లూ అదే జరిగింది. కానీ జగన్ రూటే సెపరేటు అని మరోసారి నిరూపించుకున్నారు. ఏడాది పాలన బాగానే సాగిందని మనం అనుకుంటే కాదు కదా. జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇంకా లోపాలు ఉంటే దిద్దుకోవాలి. రాబోయే నాలుగేళ్లు ఇంకా బాగా పాలించాలి. ఇదీ జగన్ ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఏడాది పాలనపై సమీక్షలు. అందుకే ఆయన మన పాలన – మీ సూచన పేరుతో తన ఏడాది పాలనపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సమీక్షల్లో ఏం చేస్తారు.. ఈ ఏడాది పాలనలో వైకాపా సర్కారు ఏం చేసిందో వివరిస్తారు. తన ఏడాది పాలన ప్రజల్లో ఏ మేరకు మార్పు తెచ్చిందో వివరిస్తారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఇంకా జనం ఏమేం కోరుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ మేరకు పాలనలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఏడాది విజయోత్సవాల సమయంలో జగన్ చేపట్టిన ఈ సమీక్ష కార్యక్రమం ప్రజలకు మరింత మేలు చేసేదే అని చెప్పొచ్చు. గడచిన సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేసింది. అడుగులు బాగానే వేశామా.. ఇంకా ఎక్కడైనా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు సీఎం జగన్. ఈ ఐదు రోజుల పాటు ఒక్కొక్క అంశంపై చర్చలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారాయన.

2 నెలల తర్వాత చంద్రబాబు ఏపీకి ఇప్పుడే రావడం వెనుక అసలు కారణం ఇదా...?
2 నెలల తర్వాత చంద్రబాబు ఏపీకి ఇప్పుడే రావడం వెనుక అసలు కారణం ఇదా...?

నారా చంద్రబాబునాయుడు.. తెలుగు రాజకీయాల్లో విస్మరించలేని పేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం జనం మధ్య ఉంటారన్న పేరున్న నాయకుడు. అధికారంలో ఉంటే.. సీఎంగా బిజీబిజీ.. ప్రతిపక్షనేతగా ఉంటే.. ప్రజాసమస్యలపై పోరాటం పేరుతో బిజీబిజీ.. అలాంటి తీరిక లేని వ్యక్తి.. తొలిసారిగా దాదాపు 2 నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోని ఇల్లు వదిలి ఎక్కడకూ వెళ్లలేదు. ఇలా దాదాపు 2 నెలలు ఇంటికే పరిమితం కావడం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇదే ప్రథమంగా చెబుతున్నారు. మరి ఆయన ఎందుకు రెండు నెలలు ఇంటిలోనే ఉండిపోయారు. మిగిలిన పార్టీల నేతలు జనంలోకి వచ్చారు కదా. మరి ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని పరిశీలిస్తే.. వైసీపీ నేతలు మాత్రం ఓ సమాధానం చెబుతున్నారు. ఏపీలో కరోనా ప్రభావం తగ్గడంవల్లే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాగలిగారని చెబుతున్నారు. ఇంతకాలం హైదరాబాద్ లోని తన ఇంటిలో గడిపిన చంద్రబాబు...ప్రజల వద్దకు వెళితే ఎక్కడ కరోనా సోకుతుందో అన్న భయంతోనే ఇంతకాలం బయటకు రాలేదని మంత్రి బాలినేని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో కరోనా తగ్గిందన్న అభిప్రాయం, నమ్మకం కలగడంతో చంద్రబాబు ఎట్టకేలకు రాష్ట్రానికి వచ్చారని బాలినేని వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షం కోర్టు తీర్పులు, మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బాలినేని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ టూర్‌ ఎంచుకున్నారని విమర్శించారు. ఏదేమైనా చంద్రబాబు మళ్లీ అమరావతికి వచ్చేశారు. రెండు నెలల గృహవాసం వీడి మళ్లీ జనం మధ్య కనిపించారు.

కరోనాయే కాదు.. ఏపీని వణికిస్తున్న మరో వ్యాధి.. ఆరా తీసిన జగన్..?
కరోనాయే కాదు.. ఏపీని వణికిస్తున్న మరో వ్యాధి.. ఆరా తీసిన జగన్..?

దేశమంతటా ఇప్పుడు కరోనా కలకలం రేగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక ఏపీలోనూ ఇదే సీన్. అయితే ఇప్పుడు కరోనాతో పాటు మరో వ్యాధి కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల వారిని వణికిస్తోంది. అదే కాళ్ల వాపు వ్యాధి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సీఎం జగన్ వరకూ వెళ్లడంతో తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ కాళ్ల వాపు వ్యాధిబాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మళ్లీ ఈ కాళ్లవాపు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఓవైపు కరోనా తో రాష్ట్రమంతా పోరాడుతున్నా.. ఇతర వ్యాధుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని జగన్ చెబుతున్నారు.

జగన్‌కు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ..? ఉద్వాసన ఖాయమా..?
జగన్‌కు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ..? ఉద్వాసన ఖాయమా..?

ఆయన వైసీపీ ఎంపీ.. మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి టికెట్ సంపాదించి ఎంపీ అయ్యారు. కానీ ఈయన పేరుకే వైసీపీ ఎంపీ.. ఆయన అన్ని విషయాల్లోనూ బీజేపీకే అనుకూలంగా ఉంటారన్న వాదన ఉంది. తాజాగా ఆయన సొంత పార్టీని ఇబ్బంది పెట్టే రీతిలో మీడియాకు ఎక్కడం సంచలనం సృష్టిస్తోంది. ఆయనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుపతి వెంకన్న భూముల అమ్మకం విషయంలో ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తోంది. టీటీడీ భూముల అమ్మకం విషయంపై ఆయన తెలుగు దేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సొంత పార్టీ తీరునే తీవ్రంగా తప్పుబట్టారు. భూముల అమ్మకం విషయం ముమ్మాటికీ తప్పేనంటూ కుండబద్దలు కొట్టారు. అంతే కాదు..అది ఏకంగా దైవ ద్రోహం కింద వస్తుందంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఈ విషయంలో ఆయన అభిప్రాయాన్ని గౌరవించొచ్చు. కానీ ఆయన మాట్లాడిన వేదిక చూస్తే.. ఆయన వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేనట్టుగా కనిపించింది. గతంలో కూడా ఈయన కొంత తేడాతో ఉన్నారని ప్రచారం జరిగింది. టిటిడి భూముల విషయంలో ఆయనకు ఏదైనా అభ్యంతరం ఉంటే.. ముందుగా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డితో మాట్లాడి ఉండాల్సింది. లేదా.. దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేయాల్సింది. అంతగా కాదంటే.. ముఖ్యమంత్రితోనైనా చర్చించవచ్చు. కానీ అలాంటి పనులు చేయకుండా మీడియాకు ఎక్కిన తీరు చూస్తే పార్టీ పట్ల క్రమశిక్షణారాహిత్యమే కనపించింది. నిరర్ధక ఆస్తుల పేరుతో భూముల వేలం వేయాలని టిటిడి నిర్ణయం భక్తుల మనోభావాలను దెబ్బతీయమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని అనుకోవడం సరికాదని చెప్పారు. ఆస్తుల అమ్మకం భగవంతుడికి టిటిడి చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణంరాజు అన్నారు. మరి జగన్ ఈయన్ను ఇలాగే వదిలేస్తారా.. ఏదైనా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

బిగ్ బ్రేకింగ్ : వెంకన్న భూములపై జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం? తగ్గినట్టేనా..?
బిగ్ బ్రేకింగ్ : వెంకన్న భూములపై జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం? తగ్గినట్టేనా..?

తిరుమల తిరుపతి వెంకన్నకు చెందిన భూములను అమ్మాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తుల విక్రయాన్ని చేపట్టవద్దని ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 లో అప్పటి టిటిడి బోర్డు ఆస్తుల అమ్మకానికి సంబందించి తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016లో అప్పట్లో ఏభై ఆస్తుల విక్రయానికి టిటిడి బోర్డు తీర్మానం చేసింది. అయితే ఇప్పుడు దాన్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు.. ఈ అంశాన్ని స్వామీజీలు, ధార్మిక వేత్తలతో పరిశీలింప చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో తెలిపింది.టిటిడి భూములలో హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం గురించి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఈ ఉత్తర్వులతో తిరుపతి వెంకన్న భూముల అమ్మకం వివాదం సద్దుమణిగినట్టే భావించాలి. అయితే ఈ విషయంలో జగన్ సర్కారు చురుగ్గా వ్యవహరించకుండా కాలయాపన చేయడం ద్వారా చెడ్డపేరు మూటగట్టుకున్నట్టయింది. తిరుపతి వెంకన్నకు సంబంధించిన ఏ విషయాన్నైనా భక్తులు చాలా సెంటిమెంట్ గా ఫీలవుతారు. అది గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమైనా.. ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వేలం కోసం ఇచ్చిన ప్రకటన వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే.. ఇవిగో నిజాలు అంటూ మీడియా మందు ప్రకటించింది. దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే జగన్ సర్కారుపై విమర్శలు వచ్చేవి కావు. గత ప్రభుత్వం చేపట్టింది కదా మనమూ అదే చేద్దాం అని అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ తిరుపతి వెంకన్న విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం.

సీతక్కతో పాటు కొండలు, గుట్టల్లో నడిచిన ఈ తస్లీమా కథ తెలిస్తే కంట తడి ఖాయం...?
సీతక్కతో పాటు కొండలు, గుట్టల్లో నడిచిన ఈ తస్లీమా కథ తెలిస్తే కంట తడి ఖాయం...?

కరోనా కాలంలో తన ప్రజలను ఆదుకుంటూ ఇటీవల ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో అభినందనల వర్షం అందుకున్నారు. అయితే ఆమెతోపాటు.. పేదలకు నిత్యావసరాలు అందించేందుకు కొండకొనల్లో నడిచిన ఓ అధికారి తస్లీమా మహమ్మద్.. ఓ సబ్ రిజిస్ట్రార్.. కొందరి జీవితాలే చరిత్రలో మిగిలిపోతాయి.. అలా కొద్దిమందిలో మేము చూసినా ప్రభుత్వ అధికారిగా కొనసాగుతూ తన చుట్టూ వున్న వాళ్ళ కోసం ఒక అక్క, చెల్లి, అమ్మ లాగా ముందుకు వస్తూ మీడియాకు కూడా తెలియని మార్గాలలో కాలినడకన గోండు, గుతికొయా ఆదిమ వాసులకు , మార్గం చూపిన ఉన్నతమైన వ్యక్తి ఆమె. తస్లీమా మహమ్మద్ .. సబ్ రిజిస్ట్రార్.. ఈ మధ్య లాక్ డౌన్ లో ఎమ్మెల్యే సీతక్కతో మూటలెత్తుకొని అడవుల్లోకి నడుస్తూ కనిపించిన సెల్వార్ కమీజ్ స్త్రీమూర్తి! అదిగో అప్పుడు ఎవరా ఈ తస్లీమా అని వెతుకులాడామ్.. చూస్తే భోలీ భాలీసీ, ధైర్యమ్ పట్టుదల కలగలిసిన ఒక మాతృ హృదయ తస్లీమా సాక్షాత్కరించింది! ఆమె అధికారిగా హాయైన జిందెగీ గడపొచ్చు.. కానీ ఆమెను ఎక్కడ వెతికినా ఎవరికో సాయం చేస్తూనో ఎవరికో నీళ్లు తాపిస్తూనో అన్నం తినిపిస్తూనో పేద పసి పిల్లల్ని చూడగానే వళ్ళోకి తీసేసుకొని లోకాన్ని మరచిపోతూనో కనిపిస్తుంది! వరంగల్ జిల్లా ములుగు మండల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా! వరంగల్ కు ములుగు 45 కిమీ. ఆమె ఊరు రామచంద్రాపురం ములుగు నుంచి 12 కిమీ. తన మండలానికే సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తుండడం ఆమె కార్యదక్షతకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దాంతో తన సొంత ప్రజలకు సేవ చేస్తున్న భావనతో ఆమె మరిన్ని మంచి పనులు చేస్తున్నారు. తండ్రి సర్వర్ ఎమ్ సీపీఐ నాయకుడు. ములుగు టైగర్ అని ఆయనకు పేరు. తస్లీమా రెండేళ్ల వయసులో హత్యకు గురయ్యాడు. భర్తను కోల్పోయిన తల్లికి తాము ఐదుగురు పిల్లలు! నాలుగో సంతానం తస్లీమా. తల్లి వ్యవసాయం చేస్తూ పిల్లల్ని సాకింది. నాలుగో తరగతిలోనే తస్లీమాను కాజీపేట హాస్టల్లో వేసేశారు. హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఎంపీసీ చేశారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. గ్రూప్స్ రాయాలంటే కోచింగ్ కు పైసల్లేవు.. ఊరి నుంచి వచ్చిన అమ్మ తన వ్యవసాయ కష్టార్జితం 13 వేల రూపాయలు తెచ్చి కాలేజీలో తన కళ్ళ ముందు కడుతుంటే చూస్తూ తల్లడిల్లిపోయింది తస్లీమా! తరువాత కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీకి పొద్దున 8 గంటలకు వెళ్లి రాత్రి ఎనిమిది వరకు చదువుతూ నోట్స్ రాసుకునేది. ఆ లైబ్రరీయే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె చెప్తుంటుంది! అమ్మంటే ప్రాణం.. వ్యవసాయం అంటే ఇష్టం తస్లీమాకు! గ్రూప్స్ రాసేరోజు బోర్డు మీద హాల్ టికెట్ నంబర్ కనిపించక టెన్షన్! అరగంట లేటయిపోయింది. కానీ రిజల్ట్ రోజు పేపర్ లో ఆమె నంబర్ కనిపించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు! ఏ పని చేసే ముందయినా కళ్ళు మూసుకొని తన తల్లిని తలుచుకుంటుంది తస్లీమా! ఈ మాట ఆమె చెప్తుంటే మన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి! తన గురించి చెప్పమంటే ఉద్వేగానికి గురికాకుండా, దుఃఖంలో తడవకుండా, తల్లిని తలుచుకోకుండా మాట్లాడలేదు తస్లీమా! అలాంటి తస్లీమా మొన్న లాక్ డౌన్ కాలంలో తన మండలంలోని రోడ్డు మార్గం లేని గుత్తి కోయిల గూడేలకు ఎమ్మెల్యే సీతక్కతో పాటు, తన సిబ్బందితో కలిసి మూటలెత్తుకొని నడవడం చూశాం.! ఎండల్లో చెమటలు కారంగా నడుస్తూ చెట్ల కింద కూర్చొని ఆకుల్లో అన్నం తినడం, కోయలతో కూర్చొని తినడం, వారికి సాయం చేయడం చూశామ్! ఇట్లా ఈ లాక్ డౌన్ కాలంలో ఎందరికో సాయం చేయడమే కాకుండా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు చెప్పడం చేశారు తస్లీమా! ఛత్తీస్ గడ్ బయలుదేరిన ఐదు కుటుంబాల వలసకూలీలు దారితప్పి ములుగు చేరుకుంటే వారికి అన్నం వడ్డించి పెట్టి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఎందరో కూలీలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం, నీళ్లు సరఫరా చేయడం చేశారు. తండ్రులను కోల్పోయిన పిల్లల్ని చూస్తే తల్లడిల్లిపోతుంది తస్లీమా! ఆమె ఫోటోల కోసం వెతికితే పసిపిల్లల్ని ఎత్తుకొని తన్మయంతో కనిపించే ఫోటోలే ఎక్కువ కనిపిస్తాయి. ఐదుగురు పిల్లలున్న ఒక రాజస్తానీ చనిపోతే ఆ కుటుంబాన్ని దత్తతకు తీసుకున్నారు తస్లీమా! వారికి అన్నీ తానే! వారికి తగిన కార్డులు, ఒక ప్లాట్ ఇప్పించారు. వారి హిందూ పండుగల్ని వారితో కలిసి సెలబ్రేట్ చేస్తారు. 11 ఏళ్ల నుంచి కొండగట్లలో నివసించే గుత్తికోయల గూడేలకు తిరుగుతూనే ఉన్నారు తస్లీమా! గుత్తికోయల పెద్దక్క అని పేరు తెచ్చుకున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో 15 రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు వారికి అందజేశారు. తస్లీమా గురించి పత్రికల విమెన్ పేజెస్ లో చాలా ఆర్టికల్సే వచ్చాయి! కాకపోతే అర్హత లేనివారి గురించి కూడా పేజెడు బొమ్మలేసి రాసీ రాసీ ఆ పేజీలు సాధికారతను కోల్పోయాయి. అందుకే బహుశా ఆ రాతలు ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. కాకపోతే ములుగు మండలంలో తస్లీమా అంటే అన్ని వర్గాల వారికి ఎంతో గౌరవం ఉంది! అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

జగన్.. ఎల్లకాలం పదవిలో ఉంటావా..? ఆర్కే మార్కు శాపనార్థాలు..!?
జగన్.. ఎల్లకాలం పదవిలో ఉంటావా..? ఆర్కే మార్కు శాపనార్థాలు..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటేనే తరచూ మండిపడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్తపలుకు వ్యాసంలో మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ జగనే ఎప్పుడూ అధికారంలో ఉంటాడా.. ఇక ఈయన అధికారం పోకుండా ఉంటుందా.. అప్పుడు చూద్దాం.. అప్పటి వరకూ ఓపిక పడతాం అన్నట్టుగా సాగిపోయింది ఏబీఎన్ రాధాకృష్ణ తాజా కొత్త పలుకు వ్యాసం.. ఆయన ఏంరాశారంటే.. “ వివిధ కారణాల వల్ల ప్రజలు ఆయనను నమ్మారు. ప్రజాభిప్రాయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. మందబలం ఉంది కనుక ఎవరూ అడ్డురాకూడదు అనుకునేవారికి రాజ్యాంగం కల్పించిన కట్టుబాట్లు అడ్డు తగులుతూనే ఉంటాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడేవారికి ఏదో ఒకనాటికి శిక్ష తప్పదు...” ఈ రాతల్లోనే ఈ జగన్ ఎప్పుడు అధికారం దిగిపోతాడో అన్న శాపనార్థాలు అంతర్లీనంగా కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితుల్లో జగన్ కు ముకుతాడు వేయగలిగేది ప్రస్తుతం న్యాయవ్యవస్థ మాత్రమేనని ఆర్కే తేల్చి చెప్పేశారు. అంటే .. పాపం.. తాము నమ్ముకున్న చంద్రబాబు కూడా జగన్ ను ఏమీ చేయలేకపోతున్నారనే అసంతృప్తి ఆ రాతల్లో అడగడుగునా కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా చివరకు న్యాయ స్థానాన్నే నమ్ముకుని ఆశలు పెట్టుకుంటున్నట్టు ఆ రాతల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో అధికారుల తీరుపై రాధాకృష్ణ మండిపడ్డారు. పాలకుల మెప్పుకోసం చొక్కాలు చించుకుంటున్న అధికారులు, ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎదురైన దుస్థితిని గుర్తుపెట్టుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అతిగా ప్రవర్తించే అధికారులకు ఏదో ఒక రోజు శిక్షపడటం ఖాయమని గత ఉదంతాలు రుజువు చేస్తున్నాయంటున్నారు. ఏపీ అధికారులలో ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో లేదో వేచిచూద్దామని ఆశావాదం వినిపించారు.

జీవిత సత్యాలు: మీ జీవితంలోని అసలైన విలన్ మీ ఇంట్లోనే ఉన్నారా..?
జీవిత సత్యాలు: మీ జీవితంలోని అసలైన విలన్ మీ ఇంట్లోనే ఉన్నారా..?

శత్రువు ఎవరో స్పష్టంగా తెలిస్తే.. అప్పుడు యుద్ధం సులభం అవుతుంది. కానీ అస్పష్టంగా ఉన్న శత్రువుతో పోరాటం చాలా కష్టం. ముఖ్యంగా మన జీవితంలోని దగ్గరి వ్యక్తులే మన శత్రువులుగా మారితే.. అప్పుడు జీవితం నరకప్రాయం అవుతుంది. అందుకే ముందు ఇంట్లోని శత్రువులను గుర్తిస్తే సగం విజయం సాధించేసినట్టే. అయితే ఇక్కడే ఓ అనుమానం వస్తుంది.. అసలు మన ఇంట్లో మనకు శత్రువులేంటి నాన్సెన్స్.. అన్న వాదన వినిపిస్తుంది. నిజమే.. మన ఇంట్లో మనకు శత్రువులు ఎందుకుంటారు. అసలు మనవాళ్లే మన శత్రువులు ఎలా అవుతారు.. ఇదే కదా మీ ప్రశ్న. మన శత్రువులు అంటే నేరుగా మనపై కత్తి కట్టేవారు మాత్రమే కాదు. మన విజయాలకు ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా అడ్డుతగిలేవారని గుర్తించాలి. ఒక్కసారి మన పురాణాల్లోకి వెళ్తే.. శ్రీరాముడిని చిన్నప్పటి నుంచి పినతల్లి కైక చాలా ప్రేమించింది. కన్న కొడుకు కంటే ఎక్కువ అనుకుంది. కానీ చెలికత్తె మంథర మాటలు ఆమెపై విష ప్రభావం చూపించాయి. చివరకు కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించినా.. రాముడిని అడవులకు పంపింది. అందుకు తన వరాలను వాడుకున్నది. ఇలాంటి మంథరలు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. లేదా.. పరోక్షంగా మనపై ప్రేమ కారణంగా మన విజయాలకు అడ్డుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారేమో సరి చూసుకోవాలి. ముందు ఇంట్లో సమస్యలను అధిగమిస్తే అప్పుడు రచ్చ గెలవడం సులభంగా మారుతుంది.

తిరుపతి వెంకన్న ఆస్తుల అమ్మకం.. జగన్ సర్కారు టార్గెట్ ఇదేనా...?
తిరుపతి వెంకన్న ఆస్తుల అమ్మకం.. జగన్ సర్కారు టార్గెట్ ఇదేనా...?

నిరర్ధకంగా పడి ఉన్న స్థిరాస్తులను అమ్మేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం ఇప్పుడు ఏపీలో రాజకీయ తుపానుకు దారి తీస్తోంది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమిళనాడులోనే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఆస్తులు అమ్మే ఆలోచనలో ఉందని ప్రముఖ దిన పత్రిక రాసింది. ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. టీటీడీ ఇప్పటి వరకు విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా ఉందట. వాస్తవానికి టీటీడీ బడ్జెట్‌లో నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పొందుపర్చిందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ అంచనాలను బట్టి ఇప్పటికే గుర్తించిన భూములే కాకుండా దేశవ్యాప్తంగా దాతలు తిరుమల వెంకన్న స్వామికి ఇచ్చిన ఆస్తులను భవిష్యత్తులో అమ్మేందుకు ప్లాన్ చేస్తోందని ఆ పత్రిక తెలిపింది. తమిళనాడులో వేలానికి సిద్ధం చేసిన 23 ఆస్తులే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు లిస్టు రెడీగా ఉందట. గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములే కాకుండా నగర పరిధిలోని విలువైన స్థలాలు వేలం వేసేందుకు రెడీ అవుతోందట టీటీడీ. ఈ జాబితాలో గుంటూరులోని కొత్తరాముల వీధి గుడిలో ఉన్న 2487 చదరపు అడుగుల భవనం కూడా ఉందట. దీన్ని అమ్మేందుకు ధర్మకర్తల మండలి ఫిబ్రవరిలోనే తీర్మానించిందట. దీనితో పాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అంబర్‌పేట కలాన్‌ ప్రాంతంలోని 1800 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని కూడా అమ్మే ఆలోచనలో ఉందట. మల్కాజిగిరి మండలం యాదవ్‌నగర్‌ పరిధిలోని 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ను కూడా అమ్మబోతోందట. ఇవే కాదు.. ఇంకా.. నాందేడ్‌, బెంగళూరు నగరాల్లోనూ కొన్ని ఆస్తులు కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాయట.

జగన్ సర్కారు నోటీసులిస్తే.. ఈ అమ్మాయి ఎంత ఖుషీగా తీసుకుందో.. చూడండి..?
జగన్ సర్కారు నోటీసులిస్తే.. ఈ అమ్మాయి ఎంత ఖుషీగా తీసుకుందో.. చూడండి..?

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినవారిపై వైసీపీ సర్కారు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా, అనుచితంగా పోస్టులు పెట్టారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. మొన్న రంగనాయకమ్మ అనే వృద్ధరాలికి ఏకంగా సీఐడీ ద్వారా నోటీసులు ఇచ్చి విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురిపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. వారిలో ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష అనే 28 ఏళ్ల యువతి ఒకరు. ఈమె గత నెలలో వైసీపీ మంత్రులు చేసిన కరోనా సాయంపై ఓ పత్రికలో వచ్చిన ఫోటోను కోట్ చేస్తూ కామెంట్లు పెట్టింది. దీనిపై స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే సాధారణంగా ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు నోటీసు అందుకున్నవారు కాస్త ఆందోళన చెందుతారు.. తమను ఇలా ఎందుకు వేధిస్తున్నారని నిలదీస్తారు. కానీ ఈ ఉండవల్లి అనూష అనే అమ్మాయి మాత్రం.. అదేదో గిన్నిస్ రికార్డు అందుకుంటున్నంత ఆనందంగా ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతే కాదు.. దయచేసి పోలీసులు కేసులు పెడుతున్నారు అని భయపడవద్దు... వాళ్ళ తప్పులని ప్రజల్లోకి తీసుకోని వెళ్ళదాం.. ప్రశ్నించే హక్కు మన అందరికి ఉంది కాని మన నాయకుడు మనకి ఇచ్చిన సూచనల ప్రకారం పనిచేద్దాం.. చేయి చెయి కలిపి ముందుకు నడుద్దాం... ప్రభుత్వ వైఖరిని ఎండగడదాం ! అంటూ ఫేస్ బుక్ లో పిలుపు ఇస్తున్నారు. ఉండవల్లి అనూష మొదటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తెలుగుదేశం అభిమానిగా ఆమె చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆమెకు ఫేస్ బుక్‌లో దాదాపు 11 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ కేసు ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి.

జగన్ నిర్ణయం తప్పంటున్న వైసీపీ ఎంపీ..? అటో ఇటో తేల్చేయండి..?
జగన్ నిర్ణయం తప్పంటున్న వైసీపీ ఎంపీ..? అటో ఇటో తేల్చేయండి..?

ఏపీలో మద్యపాన నిషధం దిశగా జగన్ సర్కారు ఒక్కో అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన తన నవరత్నాల్లోనే ఈ అంశం పెట్టారు. రాష్ట్రంలో మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట బెల్టుషాపులు ఎత్తేశారు. ఆ తర్వాత షాపు సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న మద్యం ధరలను విపరీతంగా పెచ్చేశారు. ఏకంగా 75శాతం వరకూ మద్యం ధరలు పెంచడంతో మందుబాబులు గుర్రుగా ఉన్నారు. అంతే కాదు.. జగన్ సర్కారు అందిస్తున్న మద్యం బ్రాండ్లపైనా విమర్శలు ఉన్నాయి. తక్కువ రకం బ్రాండు మాత్రమే అమ్మి మందుబాబుల ఆరోగ్యం పాడు చేస్తున్నారని టీడీపీ కొంత కాలంగా విమర్శిస్తోంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎంపీ ఒకరు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందు రేట్లు పెంచినందువల్లో... షాపుల సంఖ్య తగ్గించినందువల్లో తాగే వాళ్లు తగ్గుతారని తాను అనుకోవం లేదని కామెంట్ చేశారు. ఆయన ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్లు చేశారు. మందు అలవాటు ఉన్నవారు దాని కోసం ఓ రెండు కిలోమీటర్లు ఎక్కువ దూరం పోవడానికి వెనుకాడరని ఎంపీ కామెంట్ చేశారు. మద్యపాన నిషేధం అమలు చేయదలచ్చుకుంటే.. నేరుగా మద్యపాన నిషేధం పెట్టేయాలని.. ఇలా విడతల వారీగా పెట్టడం వల్ల ఫలితం ఉండదని ఎంపీ అంటున్నారు. మద్యం అమ్మడమా.. నిషేధించడమా... ఏదో ఒకటి చేయాలని.. ఓవైపు మద్యం అమ్ముతూనే ఇలా రేట్లు పెంచడం, షాపులు తగ్గించడం వల్ల ఉపయోగం ఉంటుందని తాను వ్యక్తిగతంగా అనుకోవడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మరి పార్టీ లైన్ దాటి ఈ ఎంపీ ఇలా మాట్లాడటం సాహసమే.

అప్పుడు వద్దు వద్దు అన్నదే.. ఇప్పుడు చంద్రబాబుకు ముద్దు అవుతోందా..?
అప్పుడు వద్దు వద్దు అన్నదే.. ఇప్పుడు చంద్రబాబుకు ముద్దు అవుతోందా..?

డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. వారు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే సీబీఐ విషయంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరును ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అసలు సీబీఐ ఏపీ అడుగుపెట్టకుండా జీవో కూడా తీసుకొచ్చారు. అలాంటి టీడీపీకి ఇప్పుడు సీబీఐ ఎలా కావాల్సి వచ్చిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలో అవసరం లేని సీబీఐ ఇప్పుడు అవసరం వచ్చిందా..? అని హోం మంత్రి సుచరిత నిలదీశారు. పుష్కరాల తొక్కిసలాటలో జనం చనిపోతే సీబీఐ గుర్తుకురాలేదా..? అని చంద్రబాబును సుచరిత ప్రశ్నించారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతివ్వటానికి వీల్లేదంటూ చంద్రబాబు గతంలో జీవోలు ఇచ్చారని సుచరిత గుర్తు చేశారు. అప్పుడు అవసరం లేని సీబీఐ ఇప్పుడు కావాలని చంద్రబాబు అంటున్నారన్నారు. గతంలో ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని సచురిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఏడాదిగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని హోంమంత్రి సుచరిత అన్నారు. ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగామన్నారు. చంద్రబాబు వెళ్తూ వెళ్తూ.. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి వెళ్లాడని, రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని సుచరిత విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. అదే విధంగా మహిళా రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటుతో పాటు పోలీసులకు వీక్లి ఆఫ్‌లు తీసుకొచ్చామని, పాఠశాల విద్యలో సమూల మార్పులు తెచ్చామని అన్నారు.

పవన్ కల్యాణ్‌ లా తాగి ఫామ్‌ హౌజ్‌లో పడుకోవడం లేదు ? అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించలేదా ..!
పవన్ కల్యాణ్‌ లా తాగి ఫామ్‌ హౌజ్‌లో పడుకోవడం లేదు ? అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించలేదా ..!

జనసేన పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులను అమ్మేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంపై బదులిస్తూ ఆయన ఈ ఘాటు కామెంట్లు చేశారు. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాం.. చెడును ఉపేక్షించమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. "మేం పవన్‌ కల్యాణ్‌లా ఫాంహౌస్‌లో తాగిపడుకోవడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి రంజాన్‌ తోఫా ఎలా పంచుతారని కొందరు అంటున్నారని, మొదట తాను ఎమ్మెల్యేనని, ఆ తరువాతే మంత్రి అని, నియోజకవర్గంలోని అన్ని మతాల వారికి అండగా ఉంటానన్నారు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇదే సమయంలో టీడీపీ నేతలపైనా మంత్రి మండిపడ్డారు. “ టీడీపీ ఐదేళ్ల పాలనపై, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ నేతలను మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే సీఎం వైయస్‌ జగన్‌ అవినీతిని తరిమికొట్టారని గుర్తుచేశారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ తెలుగు దేశం మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ భూములను అమ్మేందుకు కమిటీ కూడా వేశాడని, ఆ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, భానుప్రకాష్‌రెడ్డి సభ్యులుగా ఉన్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా కమిటీ వేశారని, గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం టీడీపీ మీడియాకు తప్పుగా కనిపించలేదా..? అని మంత్రి ప్రశ్నించారు. తన పాలనలో ఆలయాలను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు.

దమ్ముంటే నిరూపించండి.. వైసీపీ మంత్రి సవాల్.. టీడీపీ నేతలు ఏమంటారో..?
దమ్ముంటే నిరూపించండి.. వైసీపీ మంత్రి సవాల్.. టీడీపీ నేతలు ఏమంటారో..?

నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం క్రమంగా ముదుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ విషయంలో సుధాకర్ కులాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో దళిత నేతలతో విమర్శలు చేయిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ కేసు విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. సుధాకర్ ను మేనేజ్ చేసేందుకు మంత్రి ఆదిమూలం సురేశ్ ప్రయత్నించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. డాక్టర్ సుధాకర్ ను మేనేజ్ చేయడానికి తాను ప్రయత్నించానంటూ టిడిపి నేత వర్ల రామయ్య చేసిన ఆరోపణను విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఖండించారు. డాక్టర్‌ సుధాకర్‌తో గాని, వాళ్ల అమ్మతో గాని తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్‌ విసిరారు. అంతే కాదు.. మేనేజ్‌ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్‌ సుధాకర్‌ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చ గొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ డిమాండ్‌ చేశారు. టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్న మంత్రి సురేశ్.. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని కామెంట్ చేశారు. మరి ఈ సవాల్ కు టీడీపీ నేతలు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.

షాకింగ్ : చంద్రబాబు హయాంలో.. 100 టీటీడీ ఆస్తులు అమ్మేశారా...?
షాకింగ్ : చంద్రబాబు హయాంలో.. 100 టీటీడీ ఆస్తులు అమ్మేశారా...?

టీటీడీ తమిళనాడులో ఉన్న తన నిరర్థక స్థిరాస్తులను అమ్మేయాలనుకుంది. ఇందుకు వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈరోజు ఆస్తులు అమ్మారు.. రేపు ఏకంగా శ్రీవారిని అమ్మేస్తారేమో అంటూ విమర్శలు చేస్తున్నారు. మీడియా ప్రచారం ప్రభావంతో జనం కూడా శ్రీవారి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారేమో అన్నంతగా భావిస్తున్నారు. అయితే అసలు శ్రీవారి స్థిరాస్తుల అమ్మకం ఇప్పుడే మొదలు కాదట. ఇప్పుడు ఇంతగా రచ్చ చేస్తున్న చంద్రబాబు హాయాంలోనే ఈ అమ్మకం మొదలైందట. చంద్రబాబు కాలంలోనూ 100 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మారట. ఈ విషయాలను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటపెట్టారు. ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 100 ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులు విక్రయించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బయటపెట్టారు. రూ.6కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు హయాంలో వేలం వేశారని చెవిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు కాలంలోనే.. అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆస్తుల అమ్మకంపై నిర్ణయం జరిగిందట. ఆ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి ముఖ్య సభ్యుడుగా ఉన్నారట. ఈనాడు స్థంస్థల అధినేత రామోజీరావు బంధువు సుచరిత కూడా బోర్డు సభ్యురాలేనట. ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా అప్పటి కమిటీలో సభ్యుడుగా ఉన్నారని గుర్తు చేశారు చెవిరెడ్డి. వాళ్లందరూ ఆమోదించిన తర్వాతే ఈ ఆస్తులు వేలానికి వచ్చాయట. ఆ తర్వాత 2015 జులైలో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేశారట. 2016 జనవరిలో కమిటీ నివేదిక మేరకు ఆస్తుల విక్రయానికి బోర్డు అంగీకరించిందట. అంతే కాదు.. చెవిరెడ్డి మరికొన్ని విమర్శలు చేశారు. వేల కోట్ల విలువైన సదావర్తి భూములను 50 కోట్లకు అమ్మాలనుకుంది చంద్రబాబు కాదా? మానస ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. మరి టీడీపీ నేతలు ఏం చెబుతారో..?

ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన రోజు ఈనాడు హెడ్డింగ్‌ వెనక ఇంత కథ ఉందా..?
ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన రోజు ఈనాడు హెడ్డింగ్‌ వెనక ఇంత కథ ఉందా..?

దిన పత్రికకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. అది కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అందులోనూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలైతే ఇక చెప్పే పని లేదు. అందులోనూ పత్రికలకు హెడ్డింగ్‌లు చాలా ప్రధానం. ఈ హెడ్డింగుల కోసం చాలా కసరత్తు జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ మొదటిసారి 1983లో గెలిచినప్పుడు ఈనాడు పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా.. "తెలుగుదేశం సూపర్ హిట్." ఈ హెడ్డింగ్ వెనుక ఉన్న కథను.. ఆ హెడ్డింగ్ పెట్టిన సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాశ్ గారు తాజాగా స్మరించుకున్నారు. ఆ కథేంటో ఆయన మాటట్లోనే చూద్దాం పదండి.. “ 1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అయితే, పోలింగ్ జరగడానికి ముందే పతంజలికి, రామోజీరావు ఆఫీసు నుంచి ఒక మెసేజ్ వచ్చింది. విజయవాడ, హైద్రాబాద్, తిరుపతి ‘ఈనాడు’ ఎడిషన్లలోని సీనియర్స్ అందరూ ఒక్కొక్కరూ రెండేసి హెడ్డింగులు పెట్టాలి (తెలుగుదేశం గెలుపుపై). నన్ను పిలిచి రెండు హెడ్డింగులు పెట్టండి అన్నారు పతంజలి. 1. ఎదురులేని జెండా ఎగరేసిన ఎన్టీయార్. 2. ‘తెలుగుదేశం’ సూపర్ హిట్ అని కాగితమ్మీద రాసిచ్చాను. ఆయన మొహం అదోలా పెట్టాడు. నచ్చలేదన్న మాట. అలా అన్ని ఎడిషన్ల నుంచీ పోలింగ్ కు ముందే 30 లేదా 40 హెడ్డింగులు సేకరించారు. రామోజీరావు సన్నిహితులతో కూర్చుని మాట్లాడి ‘తెలుగుదేశం’ సూపర్ హిట్ అనే శీర్షికను సెలక్ట్ చేశారు. టీడీపీని సినిమా పార్టీ అనీ ప్రతిపక్షాలు వెక్కిరించాయి. గనక, ఆ సినిమాయే సూపర్ హిట్టయ్యిందన్న చమత్కారం రామోజీరావుకి తెగ నచ్చింది. ఒక పక్క ‘ఈనాడు’ సర్క్యులేషన్ దుమ్మురేపుతున్నది. తెలుగుదేశం సూపర్ హిట్ అక్షరాల్ని ప్రత్యేకంగా ఆర్టిస్టుతో రాయించి అన్ని ‘ఈనాడు’ కేంద్రాలకూ పంపించారు. కౌంటింగ్ కు రెండు రోజుల ముందే అందాయవి. గెలవగానే అందరం ఈ హెడ్డింగ్ వాడాము. హెడ్డింగ్ ఎవరు పెట్టారని అడుగుతూ పతంజలిగారికి ముందే మెస్సేజ్ వచ్చింది. నా పేరు పంపించారు. కంగ్రాచ్యులేట్ చేస్తూ రామోజీరావు నాకో పర్సనల్ మెస్సేజ్ పంపారు.. అంటూ గుర్తు చేసుకున్నారు తాడి ప్రకాశ్ గారు.

బాబు విశాఖ యాత్రకు మళ్లీ బ్రేక్..! అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి..?
బాబు విశాఖ యాత్రకు మళ్లీ బ్రేక్..! అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి..?

చంద్రబాబు విశాఖ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నుంచి చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించి ఉత్కంఠ రేగుతూనే ఉంది. మేం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా.. ఏపీ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన హోం మంత్రి సుచరిత.. అసలు అప్లికేషన్‌ ఎవరిచ్చారు.. రుజువు చూపించండి అని మధ్యాహ్నమే సవాల్ విసిరారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. మొత్తానికి సాయంత్రానికి చంద్రబాబు విశాఖ టూర్ కు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చేశారు. దీంతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయింది. కరోనా వైరస్ సమస్య వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లోనే మకాం చేసిన చంద్రబాబు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఏపీకి వెళ్తున్నారు. ఇంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నందున ఆయన ఇరు రాష్ట్రాల డిజిపిలకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిజిపి వెంటనే అనుమతి ఇవ్వగా, ఏపీ డిజిపి కాస్త ఆలస్యంగానైనా ఓకె చెప్పేశారు. అలా కథ సుఖాంతం అయ్యిందనుకున్న సమయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటంటే.. ఏపీలో దేశీయ విమాన సర్వీసులు సోమవారం ప్రారంభం కావడం లేదు. మంగవారం నుంచి ప్రారంభం అవుతాయి. మరి విమానం ద్వారా విశాఖ వద్దామనుకున్న చంద్రబాబు కోరిక తీరనట్టే.. సో.. మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైనట్టే అయ్యి మళ్లీ వాయిదా పడింది. పోనీ.. మంగళ, బుధవారాల్లో అయినా విశాఖ వెళ్తారా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే.. మహానాడు కు ముహూర్తం ముంచుకొస్తోంది. పోనీ మహానాడు తర్వాత వెళ్దామా అంటే.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందయితే ఏపీకి వస్తారు.. వచ్చాక ఏం చేయాలన్నది ఆలోచిస్తారేమో.

ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏంటి.. హైకోర్టును పట్టుకుని అంత మాట అనేశాడు..?
ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏంటి.. హైకోర్టును పట్టుకుని అంత మాట అనేశాడు..?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో హైకోర్టు మాత్రం షాకు మీద షాకులు ఇస్తోంది. శుక్రవారం ఏకంగా మూడు విషయాల్లో జగన్ కు దిమ్మతిరిగే షాకు ఇచ్చింది. ప్రత్యేకించి వైద్యుడు సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల తీరుపై మండిపడుతూ విచారణ కోసం ఏకంగా సీబీఐకి అప్పగించింది. దీంతో జగన్ సర్కారు కాస్త డిఫెన్సులో పడినట్టయింది. అయితే విచిత్రం ఏంటంటే.. హైకోర్టు కూడా డాక్టర్ సుధాకర్ వంటి చిన్న కేసును కూడా సీబీఐకి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక కేసును సీబీఐకి అప్పగించడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంతో ప్రతిష్టాత్మకమయ్యో.. లేక.. ఎంతో క్లిష్టమైనదో అయ్యుండాలి. కానీ డాక్టర్ సుధాకర్ కేసు కు అంత నేపథ్యం లేదు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుపై కూడా కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సుధార్ ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ కామెంట్ చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన కామెంట్ చేశారు. న్యాయస్థానం సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ పోతే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. వైసిపి విజయం సాదించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ కామెంట్లు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని కొందరు అంటున్నారు. కానీ హైకోర్టు తీర్పుపై తన అభిప్రాయం చెప్పే హక్కు తనకు ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. కానీ హైకోర్టుపైనే కామెంట్ చేస్తున్నారంటే.. లోపం ఈ నేతల్లో ఉందా.. హైకోర్టు తీర్పుల్లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు.

మీడియా మంటలు: చంద్రబాబు భజనతో ఘోరంగా నష్టపోయిన ఆంధ్రజ్యోతి..?
మీడియా మంటలు: చంద్రబాబు భజనతో ఘోరంగా నష్టపోయిన ఆంధ్రజ్యోతి..?

ఆంధ్రజ్యోతి.. తెలుగు టాప్ 5 పేపర్లో ఒకటిగా ఉంటోంది. తెలుగు దిన పత్రికల్లో ఈనాడు మొదటి స్థానంలో ఉంటే.. సాక్షి రెండో ప్లేసులోనూ ఆంధ్రజ్యోతి మూడో స్థానంలోనూ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు తెలుగుదేశానికి అనుకూలంగానూ.. సాక్షి పత్రిక జగన్ కు అనుకూలంగా ఉంటాయన్న సంగతి బహిరంగ రహస్యమే. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ టీడీపీ అనుకూల పత్రికలుగా ముద్ర ఉన్నా.. రెండింటి ప్రజంటేషన్‌లో తేడా ఉంటుంది. ఈనాడు తెలుగుదేశం అభిమానం కాస్త పద్దతిగా ఉంటే.. ఆంధ్రజ్యోతిది మరీ కరపత్రిక తరహా జర్నలిజం అనే చెప్పాలి. ఇక గత ఎన్నికల ముందయితే అది మరీ విశృంఖలంగా తయారైందన్న విశ్లేషణలు వచ్చాయి. అయితే ఆంధ్రజ్యోతి చంద్రబాబు భజన.. అటు చంద్రబాబుకూ మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం మేలు చేయలేదని ఫలితాలే రుజువు చేశాయి. అటు చంద్రబాబుకు ఉపయోగపడకపోగా..ఇటు సర్క్యులేషన్ పై దారుణమైన దెబ్బ పడిపోయింది. అంటే రెండింటికీ చెడ్డ రేవడి లా అయ్యింది ఆంధ్రజ్యోతి పరిస్థితి.. ఇందుకు తాజాగా ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ విడుదల చేసిన గణాంకాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశానికి డప్పు కొట్టీ కొట్టీ ఆంధ్రజ్యోతి దారుణంగా దెబ్బతిన్నది. తాజా గణాకాల ప్రకారం సాక్షి 15,647 కాపీలు పెంచుకుంటే.. ఈనాడు ఏకంగా 41,307 కాపీలు కోల్పోయింది. ఆంధ్రజ్యోతి పరిస్థితి మరీ దారుణం. అది ఘోరంగా 58,875 కాపీల్ని పోగొట్టుకుంది. ఏబీసీ లెక్కల ప్రకారం.. గత డిసెంబరు వరకు ఏపీలో ఈనాడు సర్క్యులేషన్ 8.49 లక్షలు కాగా.. సాక్షి సర్క్యులేషన్ 6.08 లక్షలు, జ్యోతి సర్క్యులేషన్ 3.80 లక్షల కాపీలు. ఇక ఇప్పుడు కరోనా దెబ్బతో ఇంకెంతగా ఈ పత్రికల సర్క్యులేషన్ తగ్గిపోయిందో.. ఆ లెక్కలు ఇప్పుడే రావు.. కాస్త సమయం పడుతుంది. మొత్తానికి చంద్రబాబు భజన ఆంధ్రజ్యోతికి బాగానే దెబ్బేసిందన్నమాట.

జీవిత సత్యాలు: మీరు నిజంగా దేవుడిని చూడాలంటే.. ఇలా చేయండి..?
జీవిత సత్యాలు: మీరు నిజంగా దేవుడిని చూడాలంటే.. ఇలా చేయండి..?

అసలు దేవుడు ఉన్నాడా.. ఈ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. అయితే దీనికి సమాధానాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. అసలు దేవుడనేవాడు లేడని నాస్తిక వాదులు వాదిస్తే.. దేవుడు పలు రూపాల్లో దర్శనమిస్తాడని ఆస్తికులు వాదిస్తారు. అయితే అసలు దేవుడు ఎలా ఉంటాడు.. ఎక్కడ ఉంటాడు.. వంటి ప్రశ్నలు నిత్యం చాలా మందిని వేధిస్తాయి. అసలు దేవుడనే వాడు ఉంటే.. అందరికీ అందుబాటులో ఉండాలి కదా.. అని కొందరు వాదిస్తారు. అసలు ఆయన ఎవరికీ చిక్కకపోతే, ఎవరి ఆలోచనలకీ అంతుపట్టకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు.. అని ప్రశ్నిస్తారు ఇంకొందరు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మన పురాణాల్లోనే ఉన్నాయి. దేవుడు వాస్తవమే అయితే ఆయన సులభంగా ఎవరికీ కనిపించడు. తనను కోరుకునేవారికి మాత్రం తప్పకుండా వశమవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మరి దైవానుగ్రహం కోసం ఏంచేయాలి.. ఆయన అనుగ్రహం కోసం చేయవలసిందల్లా... మనసు ఆయన పాదాలపైన, పలుకులు ఆయన గుణాలను వల్లెవేయాలి. చేతులు ఆయన మందిరాన్ని అలంకరించాలి. చెవులు ఆయన కథాగాన శ్రవణాభిలాషతో ఉండాలి. దేహం, మనసు ఆయనయందే లగ్నమై ఉండాలి.

వామ్మో.. ఇండియాలో లాక్‌డౌన్‌ పెట్టకపోతే.. ఏం జరిగేదో తలచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోందిగా..?
వామ్మో.. ఇండియాలో లాక్‌డౌన్‌ పెట్టకపోతే.. ఏం జరిగేదో తలచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోందిగా..?

ఇండియాలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మొదట్లో చాలా కఠినంగా అమలైన లాక్ డౌన్ ఇప్పుడు కాస్త సులభతరంగా మారింది. కానీ ఈ లాక్ డౌన్‌తో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ అన్నీ సులభతరం చేస్తున్నారు. మరి ఈ లాక్ డౌన్ తో ఇండియా సాధించిందేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ చెబుతున్నారు. లాక్‌డౌన్‌ అమలు ద్వారా దేశంలో కరోనా కేసులు, మరణాలను భారీ సంఖ్యలో తగ్గించామని ఆయన అంటున్నారు. లాక్‌డౌన్‌ లేకుంటే దేశంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉండేవో ఆయన చెబుతున్నారు. ఇండియాలో లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే.. కేసుల సంఖ్య 14 లక్షల నుంచి 29 లక్షల వరకూ ఉండేదట. అంతే కాదు.. ఇండియాలో లాక్ డౌన్ పెట్టకపోతే... 37 వేల నుంచి 78 వేల మంది వరకూ చనిపోయి ఉండేవారట. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ శ్రీవాత్సవతో కలిసి వినోద్ పాల్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘మార్చి 25న విధించిన తొలి లాక్‌డౌన్‌ ఫలితాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో 22.6 శాతానికి పెరిగిన కేసుల రోజువారీ వృద్ధి రేటు... మే 15 నాటికి 5.5 శాతానికి చేరింది. 71 శాతానికి వెళ్లిన రోజువారీ మరణాల వృద్ధిరేటు కూడా మే 15 కల్లా 5.5 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌కి ముందు 3.4 రోజులకే కేసులు రెట్టింపుకాగా... అందుకు ఇప్పుడు 13.3 రోజులు పడుతోందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ వ్యాప్తి కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. 90% కేసులు పది రాష్ట్రాలకు పరిమితమయ్యాయని ఆయన వివరించారు. 80% క్రియాశీల కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 60% పైగా కేసులు ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, ఠాణేల్లోనే ఉన్నాయి. పుణె, ఇండోర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లను కూడా కలిపితే 70% కేసులుంటాయి. 80% మరణాలు 5 రాష్ట్రాల్లో, 95% మరణాలు పది రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్నాయి. 60% మరణాలు కేవలం అయిదు నగరాలకే పరిమితమయ్యాయని వినోద్ పాల్ వివరించారు.

జగన్ అప్పుడే చెప్పాడు.. ఇప్పుడు W.H.O. చెబుతోంది.. అదీ అన్న మాటంటే..?
జగన్ అప్పుడే చెప్పాడు.. ఇప్పుడు W.H.O. చెబుతోంది.. అదీ అన్న మాటంటే..?

కరోనా విషయంలో ముందుగా జగన్ నోరు విప్పితే అంతా ఎగతాళి చేశారు. జగన్ కు కరోనాపై కనీసం అవగాహన లేదని మండిపడ్డారు. ఇక ప్రతిపక్షాలైతే మరీ దారణం. అలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని విపక్షనేత చంద్రబాబు ఫుల్లుగా విమర్శించారు. కానీ ఆ తర్వాత జగన్ చెప్పిందే అంతా చెబుతూ వచ్చారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి సుచరిత గుర్తు చేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని హోంమంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు. వైరస్‌ కట్టడి అయ్యే వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే కొందరు అవహేళన చేశారని, కానీ, నేడు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా అదే చెబుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరితో కలిసి హోం మంత్రి మేకతోటి సుచరిత దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా పండ్లు, భోజన ప్యాకెట్లు అందజేశారు. కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారని హోం మంత్రి మేకతోటి సుచరిత గుర్తు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామని సుచరిత అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని హోంమంత్రి సుచరిత అన్నారు. కరోనా కాలంలోనూ వ్యవసాయ రంగాన్ని కూడా జగన్ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఎవరూ ఇబ్బంది పడకుండా విడతల వారీగా రేషన్‌ పంపిణీ, ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. ఏదేమైనా మొదట్లో జగన్ చెబితే సెటైర్లు పేల్చినవాళ్లే ఇప్పుడు ఆయన మాటే అక్షరాలా వాస్తవం అని అంగీకరిస్తున్నారు.

కూతురు పెళ్లి.. నాలుగు రోజులకే.. తెగిపడిన తల్లి తాళి..? అసలేం జరిగింది..?
కూతురు పెళ్లి.. నాలుగు రోజులకే.. తెగిపడిన తల్లి తాళి..? అసలేం జరిగింది..?

నాలుగు రోజుల క్రితం పెళ్లి జరిగిన ఇంట్లోనే ఇప్పుడు విషాదం నెలకొంది. కూతురి మెడలో తాళి పడిన నాలుగు రోజులకే తల్లి మెడలో తాళి తెగిపోయింది. విచిత్రం ఏంటంటే.. ఆ తాళిని తెంపుకున్నది స్వయంగా ఆ తల్లే.. అంటే పెళ్లి కూతురి తల్లే స్వయంగా తన భర్తను కత్తితో పొడిచి చంపేసింది. అసలు కూతురు పెళ్లి జరగడం ఏంటి.. తల్లి తన భర్తను చంపడమేంటి... అంతా షాకింగ్ గా ఉంది కదా. ఇలాంటి విషాద ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గురంధరపాలెంలో వ్యవసాయ కూలీ విసారపు చిరంజీవి (48), సన్యాసమ్మ (40) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. చిన్నమ్మాయిని ఈనెల 3న మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అడ్డూరి చంటబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయిపోయాయి.. తమ బాధ్యతలు తీరిపోయాయని అనుకునే సమయంలోనే.... అనూహ్యంగా కొత్తల్లుడి కుల వివాదం సమస్యగా మారింది. పెళ్లి జరిగిన నాలుగు రోజుల తర్వాత కొత్త అల్లుడు తమ కులం వాడు కాదని తెలిసింది. ఈనెల 11న పెద్దలతో పంచాయితీ జరిగింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం అల్లుడి కుటుంబ సభ్యులను అడిగారు. కానీ వాళ్లు దాన్ని చూపించలేకపోయారు. దీంతో తమ పరువు పోయిందని భార్యాభర్తలు ఆందోళన చెందుతున్నారు. అల్లుడి కుల వివాదం ఇటు చిరంజీవి దంపతుల మధ్య గొడవకు దారి తీసింది. కూతురి జీవితం ఇలా అయినందుకు నువ్వు కారణం అంటే నువ్వే అంటూ గొడవ పడ్డారు. ఈనెల 15న పొలం వద్ద జరిగిన గొడవలో భార్య సన్యాసమ్మ కత్తితో భర్తపై దాడి చేసింది. ఆయన అక్కడే మరణించాడు. క్షణికావేశంలో హత్య చేసిన సన్యాసమ్మ ఆ తర్వాత కత్తిని అక్కడే పడేసి, రక్తపు మరకలను శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త హత్యకు గురైనట్టు ముందు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత.. తానే హంతకురాలినంటూ లొంగిపోయింది.

నిజంగా.. బాబుకు ఉన్న తెలివి జగన్‌కు లేదు.. ఒప్పేసుకున్న విజయసాయి..?
నిజంగా.. బాబుకు ఉన్న తెలివి జగన్‌కు లేదు.. ఒప్పేసుకున్న విజయసాయి..?

చంద్రబాబుకు ఉన్న తెలివి జగన్‌కు లేదు అని వైసీపీలో నెంబర్ టూ స్థాయిలో పలుకుబడి ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్నారు అంటే నిజంగా అంగీకరించినట్టు కాదండోయ్.. అదో సెటైర్ అన్నమాట.. పొగుడుతూనే తిట్టడం లాంటింది. ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ఇలా వెరైటీగా స్పందించారన్నమాట. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. కరెంటు గురించి సీఎం జగన్ కు అస్సలు అవగాహన లేదట. ఈ వ్యాఖ్యలు సహజంగానే విజయసాయిరెడ్డి వంటి వారికి ఆగ్రహం తెప్పిస్తాయి. అయితే దాన్ని విజయసాయి రెడ్డి సెటైర్ గా తిప్పికొట్టారు. అవును.. నిజమే.. జగన్‌కు కరెంట్ గురించి అస్సలు అవగాహన లేదు.. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్ గారికి లేదు.. అంటూ విరుచుకుపడ్డారు. అందుకే జగన్.. ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని అంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి ఆయనకెక్కడిది.. మరి అంటూ చంద్రబాబును పరోక్షంగా ఓ రేంజ్‌లో గాలి తీసేశారు. అంతే కాదు.. అదే సమయంలో గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వేసవిలో పది డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గించాలని చేసిన కామెంట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. అప్పుడెప్పుడో స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్ బాబు లాగా కోతలు కోస్తే తమ దేశంలో మెంటల్ హాస్పిటల్‌కు పంపిస్తారని గాలి తీశాడు. అయినా మీరు కొంచెం కూడా మారలేదు. రాష్ట్రంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అప్పట్లో అధికారులను ఆదేశించడం పిచ్చి కాకపోతే మరేంటి? అని విజయసాయి అన్నారు. అంతే కాదు.. గతంలో తమిళనాడు సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని చంద్రబాబు సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే. ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదని విజయసాయి మండిపడ్డారు.

ఓ మహిళను పబ్లిగ్గా బూతులు తిట్టేసిన మంత్రిగారు.. ఆ తర్వాత సీఎం పిలిచి వార్నింగ్..?
ఓ మహిళను పబ్లిగ్గా బూతులు తిట్టేసిన మంత్రిగారు.. ఆ తర్వాత సీఎం పిలిచి వార్నింగ్..?

రాజకీయ నాయకుల్లో కొందరికి ఓ పదవి రాగానే కళ్లు నెత్తికెక్కుతాయి. తాము గెలిచింది జనం ఓట్లతోనే అన్న సంగతి మరిచిపోయి.. తామేదో పై నుంచి దిగొచ్చామని ఫీలవుతుంటారు. ఇంకొందరు ఎలక్ట్రానికి యుగం అన్న సంగతి మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ఝలక్ లు తగులుతున్నాయి. కర్ణాటకలో అలాగే జరిగింది. మధు స్వామి అనే మంత్రి ఓ ప్రజాకార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఎందుకు కోపం వచ్చిందో ఏమో కానీ.. ఓ మహిళను ఏకంగా బూతులు తిట్టేశారు. ఆ బూతు పురాణాన్ని ఓ మహానుభావుడు సెల్ ఫోన్‌లో షూట్ చేశారు.. ఇంకే ముంది అది కాస్తా వైరల్ గా మారింది. మంత్రి గారి పరువు కాస్తా పోయింది. ఏంటిది మరీ దారుణంగా మహిళలపై నీ ప్రతాపం.. అంటూ నెటిజన్లు కూడా బండ బూతులు తిట్టడం మొదలు పెట్టారు. ఇది కాస్తా సీఎం యడ్యూరప్ప దృష్టికి వెళ్లింది. పార్టీ పరువు పోయేలా ఉండటంతో ఆ మధుస్వామిని పిలిపించి ఆయన కూడా సీక్రెట్ గా బండ బూతులు తిట్టేసినట్టున్నారు. మరోసారి ఇలా జరిగితే ఉన్న మంత్రి పదవి కాస్తా ఊడుతుంది జాగ్రత్త అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అంతే కాదు.. యడ్యూరప్పే ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు కూడా. మంత్రి మధుస్వామి ఒక మహిళ పట్ల అసభ్యకర భాష వాడారని.. ఆ విషయం తనకు తెలిసిన తర్వాత పిలిచి మందలించానని యడ్యూరప్ప మీడియాకు చెప్పారు. మరోసారి ఇలా జరగడానికి వీలులేదని స్పష్టం చేశానని యడ్యూరప్ప అన్నారు. బాధిత మహిళను కూడా పిలిచి మాట్లాడతానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప వివరణ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆ మంత్రి మధుస్వామి కూడా ఈ ఘటనపై క్షమాపణ చెప్పారు. బూతులు తిట్టనేల.. ఆ పై క్షమాపణ చెప్పనేల.. ?

సినిమా వాళ్లకు కన్నుకొడుతున్న జగన్.. వర్కవుట్ అవుతుందా...?
సినిమా వాళ్లకు కన్నుకొడుతున్న జగన్.. వర్కవుట్ అవుతుందా...?

టాలీవుడ్.. అంటే తెలుగు సినీపరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. టాలీవుడ్ లో నూటికి 70 నుంచి 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే కీలకంగాఉన్నా.. వారు సొంత రాష్ట్రంవైపు చూడటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు దాటి పోయినా ఇంకా టాలీవుడ్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కలే అన్ని సౌకర్యాలు ఉండటం ఓ కారణం కావచ్చు. విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు టాలీవుడ్ తో మంచి పరిచయాలు ఉన్నా.. సినీపరిశ్రమను ఏపీ వైపు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు టాలీవుడ్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చు. ఇందుకోసం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు,ఇతర ప్రదేశాలు, టూరిస్టు ప్రాంతాలు ఇలా వివిధ జోన్ లుగా వర్గీకరించింది. ఆయా చోట్ల షూటింగ్ లను ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఏపీలో షూటింగ్ చేసుకోవాలనుకునేవారుప కాషన్ డిపాజిట్ మాత్రం చెల్లించవలవసి ఉంటుంది. షూటింగ్ పూర్తి అయ్యాక ఆ డిపాజిట్ ను అదికారులు తిరిగి ఇచ్చివేస్తారు. కార్పొరేషన్ ఏరియాలలో అయితే రోజుకు పదిహనువేల రూపాయల చొప్పున, ఆ తర్వాత మున్సిపాల్టీలు, ఇతర ప్రదేశాలలో పదివేలు, ఐదువేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లిస్తే ఉచితంగానే షూటింగ్ చేసుకోవచ్చు. ఈ ఉత్తర్వులు లాక్ డౌన్ ముగిసిన తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాస్తవానికి ఏపీలో వైజాగ్ వంటి నగరాల్లో సినీ చిత్రీకరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ చర్యలు ఎంతవరకూ ఉపయోగపడతాయో చూడాలి.

షాకింగ్ : హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందే లీక్ అవుతున్నాయా..?
షాకింగ్ : హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందే లీక్ అవుతున్నాయా..?

హైకోర్టు తీర్పులను కవర్ చేసే టీవీ ఛానల్ జర్నలిస్టులకు చాలా తలనొప్పులు ఉంటాయి. తీర్పులు వెంటనే రావు.. తీర్పు వచ్చినా దాని సారాంశం ఏంటో అర్థం చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఈలోపే పక్క ఛానల్ వాడు బ్రేకింగుల మీద బ్రేకింగులు వేస్తుంటాడు. ఇలాంటి వాళ్ల ద్వారానే కోర్టు తీర్పులు ముందుగా ప్రపంచానికి తెలుస్తాయి. ఆ తర్వాత తీరిగ్గా తీర్పు కాపీ వచ్చాక పత్రికల వాళ్లు సమగ్రంగా సుదీర్ఘంగా విషయం చెబుతారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. పిల్లలు పరీక్ష పేపర్లు లీకైనట్టు.. కోర్టు తీర్పులు కూడా లీకవుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పుల విషయంలో తెలుగు దేశం చాలా ముందుంటుందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అసలు హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా చంద్రబాబును విచారించాలని... ఆయన కాల్‌ లిస్టు బయటపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఇది నిజంగా సంచలనమైన ఆరోపణే. ఈ ఆరోపణ చంద్రబాబును ఉద్దేశించి అన్నట్టు కనిపించినా... కోర్టులకూ ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు ఆయన ఆరోపించారా అనిపించకమానదు. నందిగం సురేశ్ ఇంకా ఏమన్నారంటే.. " ఈ రోజున పది మంది టీడీపీ దళిత నేతలు పరిగెత్తుకొచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని మాట్లాడుతున్నారు. వెనక్కు తిరిగి చూస్తే.. చంద్రబాబు దళితులపై ఏం మాట్లాడారో.. వారికే అర్థం అవుతుంది. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు.. దళితులు చదువుకోరని, శుభ్రంగా ఉండరని మరికొంతమంది టీడీపీ వారే మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని టీడీపీలోని దళితులే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ సురేష్. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు దళితులకు ఏం చేశాడో కూడా చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం లేదని నందిగం సురేష్ ఆరోపించారు. ఎంతసేపూ మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డు ఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు.

షాకింగ్ ఆరోపణలు: చంద్రబాబు ఏకంగా హైకోర్టునే మేనేజ్ చేస్తున్నారా..?
షాకింగ్ ఆరోపణలు: చంద్రబాబు ఏకంగా హైకోర్టునే మేనేజ్ చేస్తున్నారా..?

ఏపీలో హైకోర్టు జగన్ సర్కారు నిర్ణయాలను పదే పదే తప్పుబడుతోంది. అనేక కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే నాలుగైదు అంశాల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి. అందులోనూ వైద్యుడు సుధాకర్ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుని.. ఏకంగా కేసును సీబీఐకి అప్పగించింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని ఏకంగా సీబీఐకి అప్పగించడం ఒక విధగా జగన్ సర్కారుకు షాకుగానే చెప్పుకోవాలి. అసలు ఈ కేసు విషయంలో హైకోర్టు తీరు చాలా యాక్టివ్ గా ఉందనే చెప్పాలి. సాధారణంగా కోర్టులు జనం వేసే పిటీషన్లను విచారిస్తాయి. తమంతట తాము సుమోటోగా తీసుకునే కేసులు చాలా తక్కువ. అందులోనూ ఓ టీడీపీ మహిళానేత రాసిన లేఖ ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ కేసు ను ఏకంగా హైకోర్టు సీబీఐకి అప్పగించేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టు చూపించిన చొరవ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చాలా సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడని ఆక్షేపించారు. హైకోర్టును మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడన్నారు. ఎంతసేపు మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డుఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. సుధాకర్‌బాబును అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడన్నారు ఎంపీ నందిగం సురేష్. శాడిస్టులా బూతులు మాట్లాడుతూ, కార్ల కింద చొరబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి చంద్రబాబు సపోర్టు చేస్తున్నాడని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లిష్‌ మీడియం విద్య వంటి విషయాల్లోనూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను చూసి నవ్వాలో.. బాధపడాలో అర్థం కాని పరిస్థితి అని కామెంట్ చేశారు.

షాకింగ్ : చంద్రబాబు కాల్ లిస్టు బయటపెడితే...?
షాకింగ్ : చంద్రబాబు కాల్ లిస్టు బయటపెడితే...?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటారని.. ప్రధానంగా కీలక ప్రభుత్వ సంస్థల్లోకి తన వ్యక్తులను ప్రవేశపెడతారని.. వారి ద్వారా వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే విమర్శ చంద్రబాబుపై ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 40 ఏళ్లకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ కోర్టు మెట్లెక్కలేదని చెప్పుకునే చంద్రబాబు.. తాను తెచ్చుకున్న స్టేల విషయంపై మాత్రం నోరు మెదపరు. తాజాగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఎలాగంటే.. డాక్టర్ సుధాకర్ పై పోలీసుల దౌర్జన్యం అంశంలై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై వైసీపీ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ తీర్పుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. అసలు.. హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో నిజాలు రాబట్టాలంటే.. మొదట చంద్రబాబును విచారించాలన్నారు. చంద్రబాబు కాల్‌ లిస్టు బయటపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ బాబు వెనుక ఏదో పెద్ద సపోర్టు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. సుధాకర్‌బాబు వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదేనని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. లేదంటే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎఫ్‌ఐఆర్‌ రాసుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకపోలేదన్నారు. ఎవరి తప్పు ఏంటో సీబీఐ విచారణలో బయటకు వస్తాయని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. అయితే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తే చేయవచ్చు గాక. కానీ దాన్ని నిరూపించే సాక్ష్యాలు సంపాదించడం మాత్రం అంత సులభం కాదు కదా.

ఆ మంత్రిపై కొండంత బరువు పెట్టిన జగన్.. మరి ఆ రెడ్డిగారు కేటీఆర్ ను ఢీకొట్టగలడా..?
ఆ మంత్రిపై కొండంత బరువు పెట్టిన జగన్.. మరి ఆ రెడ్డిగారు కేటీఆర్ ను ఢీకొట్టగలడా..?

అసలే ఇప్పుడు కరోనా కాలం.. ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. అలాంటి ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గ సహచరుడు ఒకరిపై కొండంత బరువు పెట్టారు. అదేంటంటే.. ఈ కష్టకాలంలో విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం.. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్శించేందుకు ఏపీ సర్కారు ఓ టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కు పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి నాయకత్వం వహిస్తారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ఇంధన, ఐటీ శాఖ కార్యదర్శులు శ్రీకాంత్‌, కోన శశిధర్‌, పరిశ్రమ శాఖ డైరెక్టర్‌, ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం ఇతర సభ్యులుగా ఉన్నారు. ఇటీవల కరోనా కారణంగా చైనా నుంచి కొన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పిలుపు ఇచ్చారు. చైనా నుంచి వచ్చే కంపెనీలను గుర్తించి.. వాటికి రెడ్ కార్పట్ పరిచే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీకి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటికే ఈ పని ప్రారంభించింది. ఇటీవలే కేటీఆర్ ఆన్ లైన్ ద్వారా ఓ పెట్టుబడుల సదస్సులో పాల్గొని తెలంగాణకు రావాలంటూ పారిశ్రామిక వేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు ఏపీ కూడా ఈ బరిలో దిగుతోంది. మరి మంత్రి గౌతంరెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎంత వరకూ సఫలీకృతం అవుతారో చూడాలి. పొరుగున ఉన్న తెలంగాణను కాదని ఏపీకి పరిశ్రమలు వచ్చేలా గౌతంరెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. కేటీఆర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టి ఏపీకి పరిశ్రమలు రప్పిస్తారో చూడాలి. ఇది గౌతంరెడ్డి సమర్థతకు ఓ అగ్ని పరీక్ష అనే చెప్పొచ్చు.

జీవిత సత్యాలు: నీకు తెలియట్లేదు బాస్.. నువ్వు చెప్పేవి కష్టాలు కానే కాదు..?
జీవిత సత్యాలు: నీకు తెలియట్లేదు బాస్.. నువ్వు చెప్పేవి కష్టాలు కానే కాదు..?

జీవితంలో కష్టాలు పడని వాడు ఎవడైనా ఉంటాడా.. ఉండనే ఉండడు. ప్రతి ఒక్కడికి వాడి స్థాయిలో ఇబ్బందులు, కష్టాలు, కడగండ్లు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కడూ తనకు వచ్చిందే అసలైన కష్టం అనుకుంటాడు.. అక్కడే వస్తోంది చిక్కంతా. అంతే.. ఎవడి లైఫ్ వాడికి ఇంపార్టెంట్ కదా. కానీ కష్టాలను కష్టాలుగా ఫీలైతేనే అసలైన కష్టం వస్తుంది. ఆ కష్టం మరింత పెరుగుతుంది. కష్టాలను మనం స్వీకరించే విధానంలోనే ఆ కష్టం ప్రభావం మనపై ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. మనం చెప్పే కష్టాలు కష్టాలు కాదు. ఈ జీవితాన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంతవరకూ సిద్ధంగా ఉన్నాం అని చెక్ చేసేందుకు దేవుడు పెడుతున్న పరీక్షలు అనుకోవాలి. అవును మరి.. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మనపై మనకు అంచనాలు ఎలా వస్తాయి. అందుకే అసలు పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

ఆ విషయంలో దుమ్మురేపుతున్న తెలంగాణ..?
ఆ విషయంలో దుమ్మురేపుతున్న తెలంగాణ..?

తెలంగాణ రాష్ట్రం ఆ విషయంలో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ఐటీ విషయంలో. అవును.. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మేటిగా నిలుస్తోంది. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే రెండింతలకు పైగా అభివృద్ధి సాధించింది. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ విడుదల చేసిన ఈ గణాంకాలు అదరహో అనేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు 2019-20 ఏడాదికి రూ.1,28,807 కోట్లకు చేరాయి. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా దాదాపు 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలకు చేరువవుతోంది 2019-20 ఏడాదికి తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. కానీ జాతీయ సగటు మాత్రం 8.09 శాతంగా నమోదైంది. అంటే తెలంగాణ జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుందన్నమాట. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగాయి. ఐటీ రంగంలో ఇప్పటికే పేరుగాంచిన హైదరారాబాద్ కారణంగానే ఈ ఘటన తెలంగాణ వశమైందనే చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఐటీ ఇతర నగరాలకు కూడా విస్తరిస్తోంది. చెప్పుకోదగ్గ స్థాయిలో టెక్‌ మహీంద్రా, సెయింట్‌ సంస్థలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాన్ని ప్రారంభించింది. మైక్రాన్‌ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ కూడా హైదరాబాద్ కు వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో అల్లాడుతోంది. దీని ప్రభావం ఐటీ రంగంపైనా పడే అవకాశం ఉంది. ఈ గణాంకాలు ఏడాది మొత్తానికి సంబంధించినవి.. కానీ లాక్ డౌన్ తర్వాత ఈ స్థాయిని కొనసాగించడమే తెలంగాణ ప్రభుత్వానికి అసలైన సవాల్ గా చెప్పుకోవచ్చు.

రేవంత్ రెడ్డి భీకర ప్రతిజ్ఞ.. మామూలుగా లేదుగా..! వింటున్నావా కేసీఆర్..?
రేవంత్ రెడ్డి భీకర ప్రతిజ్ఞ.. మామూలుగా లేదుగా..! వింటున్నావా కేసీఆర్..?

ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కు ఎదురే లేదు.. ఆయనకు అన్ని విధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు ఆయన తన అనుభవంతో ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ విపక్షాలకు అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే కేసీఆర్ కు రాజకీయంగా అంతా నల్లేరుపై నడకగా సాగిపోతోంది. అయితే ప్రధాన విపక్షం కాంగ్రెస్ మాత్రం.. ఎలాగోలా తన పూర్వవైభవం సంతరించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి .. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినా.. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికై పరువు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఎలాగైనా బలమైన శక్తిగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనకు పూర్తి అధికారాలు కట్టబెట్టలేదు. అయినా సరే.. తెలంగాణ కాస్తో కూస్తో కేసీఆర్ కు సవాళ్లు విసరగల నేతగా పేరు సంపాదించాడు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో సవాల్ విసురుతున్నారు. ముందుంది మంచి కాలం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. మనకు మంచి రోజులు వస్తాయని ఇన్‌స్పయిల్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ స్ఫూర్తితో పనిచేయాలని.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. తొందర్లోనే మనకూ మంచి రోజులు వస్తాయని చెబుతున్నాడు. అంతే కాు.. ఇప్పుడు ఎవడెవడు ఎగెరిగిరి దునకుతున్నడో లెక్కలు రాసి పెట్టండి... మనకూ అధికారం వస్తుంది. మిత్తితో సహా లెక్క చెల్లిద్దాం.. అంటూ భారీ డైలాగులు చెబుతున్నారు. నాయకుడు అన్నాక ఆ మాత్రం విశ్వాసం ఉండాల్సిందే.. కానీ కేవలం ఆత్మ విశ్వాసం మాత్రమే ఉంటే కేసీఆర్ వంటి నేతను మట్టికరిపించడం అంత సులభం కాదన్న సంగతి రేవంత్ రెడ్డి గ్రహించాలి. శపథానికి తగ్గ శ్రమ, పట్టుదల, వ్యూహం ఉంటే తప్ప కేసీఆర్ పై పైచేయి సాధించడం అంత ఈజీ కాదు.

ఈసారి కష్టమే అనుకున్నారు.. జగన్ దేవుడిలా షాక్ ఇచ్చేశాడు..?
ఈసారి కష్టమే అనుకున్నారు.. జగన్ దేవుడిలా షాక్ ఇచ్చేశాడు..?

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని రాష్ట్రాలు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత వేయాల్సి వచ్చింది. మళ్లీ మే నుంచి మొత్తం జీతాలు ఇస్తున్నారనుకోండి.. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత అంటేనే ఎలాంటి క్లిష్టపరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో తమ కోసం జగన్ ప్రవేశ పెట్టిన వాహన మిత్ర పథకం రెండో ఏడాది డబ్బు వస్తుందో రాదో అన్న అనుమానం చాలా మంది లబ్దిదారులలో ఉండేది. అందులోనూ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన వారు.. ఈసారి వాహనమిత్ర డబ్బు వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి.. లాక్ డౌన్ కథలు విన్నాక ఈసారి డబ్బులు వేయడులే అనే అంతా అనుకున్నారు. కానీ అలాంటి వారికి ఊహించని షాక్ ఇచ్చాడు సీఎం జగన్. ఆర్థికంగా కష్టాలు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పేది లేదన్నాడు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు సాయం చేసేందుకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, యజమానులకు రూ.10 వేల ఆర్థిక సాయం కోసం రెండో విడతలో 2,36,344 మందికి ఆర్థికసాయం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హుల ఎంపికకు మరోమారు మార్గదర్శకాలు జారీ చేశారు. 8 కార్పొరేషన్ల ద్వారా నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. జూన్‌ 4న నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని మంత్రి పేర్నినాని ఇదివరకే తెలిపారు. ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆటోడ్రైవర్లు, వాహనమిత్ర లబ్దిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కష్టకాలంలో రూ. 10 వేలు అంటే మామూలు విషయం కాదుగా మరి.

ఆ లక్ష మందిపై జగన్ వరాల వర్షం.. ఎక్కడా తగ్గడం లేదుగా..?
ఆ లక్ష మందిపై జగన్ వరాల వర్షం.. ఎక్కడా తగ్గడం లేదుగా..?

ఆర్థికంగా ఇబ్బందులున్నా సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం లేదు. ముందు చెప్పిన వన్నీ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో రెండు కార్యక్రమాలకు సిద్ధం చేస్తున్నారు. ‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్‌ 24న ఆర్థిక సాయం అందించనుంది. ఇక జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్‌ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు బీసీ కార్పొరేషన్‌ ఎండీ రామారావు ఆదేశాలిచ్చారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీలకు జాబితాను పంపించాలి. కలెక్టర్‌ అనుమతితో బీసీ కార్పొరేషన్‌ ఈడీలు ఈ జాబితాను రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ ఎండీ, కాపు కార్పొరేషన్‌ ఎండీ కార్యాలయాలకు పంపిస్తారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా 45 – 60 ఏళ్ల లోపు మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల షాపులకు వలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్‌ చేయించాలి. జియో ట్యాగింగ్‌ చేయించకుంటే మంజూరు ఉత్తర్వులు ఆపివేస్తారు. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు మండలాలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్‌ ఎండీ రామారావు తెలిపారు. ఈ పధకానికి 1,29,749 మంది దర్జీలు, రజకులు 81,815 మంది, 38,643 మంది నాయీ బ్రాహ్మణులు ఎంపికయ్యారు.

ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఆ వైసీపీ ఎమ్మెల్యే వెరీ గుడ్...?
ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఆ వైసీపీ ఎమ్మెల్యే వెరీ గుడ్...?

లాక్ డౌన్ కష్టకాలంలో అన్ని రంగాలు నష్టపోతున్నాయి. అన్ని రంగాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు మరింతగా కష్టపడుతున్నాయి. కొన్ని వందల కుటుంబాలు పస్తులతో పడుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాల కన్నా సాయం చేయే పనుల ద్వారానే రాజకీయ నాయకుల విలువ పెరుగుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదే చేస్తున్నాడు.. ఈ ప్రాంతంలో కరోనా కేసులతో ఆ మధ్య ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై అనేక వివాదాలు నడిచాయి. విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి. కానీ ఆయన వాటిని లైట్ గా తీసుకున్నారు. జనం కోసం ముందుకు కదిలారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ లో 30 వేల కుటుంబాలకు ఆయన తన సొంత నిధులతో సాయం చేస్తున్నారు. వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మూడోదఫా 5 రకాల కూరగాయాలను ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్‌రెడ్డి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి సి విటమిన్ అధికంగా గల 30టన్నుల చీనీపండు , మదనపల్లి నుంచి 30 టన్నుల టమోటా, 25 టన్నుల క్యారెట్, అనంతపురం నుండి 20 టన్నుల ఎర్రగడ్డలు, కర్ణాటక నుంచి 20 టన్నుల క్యాబేజీ తెప్పించామన్నారు. ఇలా తెప్పించిన సరుకులను ప్రతి ఇంటికి పంచి పెట్టామన్నారు. ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపించారని, వారు ఈ రోజు కష్టాల్లో ఉన్నారని, వారి కష్టాలను తీర్చడానికి తన వంతు ఉడతాభక్తిగా ఈ సహాయం చేస్తున్నానని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కష్టకాలంలో మాటలు కట్టి పెట్టి ఇలాంటి మేలు చేస్తే జనం నెత్తినపెట్టుకుంటారు.

జగన్ ఈ తప్పు ఎందుకు చేయనిచ్చాడు..? టీడీపీ వాళ్లు ఆడేసుకుంటున్నారుగా..?
జగన్ ఈ తప్పు ఎందుకు చేయనిచ్చాడు..? టీడీపీ వాళ్లు ఆడేసుకుంటున్నారుగా..?

ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు.. ఓ వ్యవస్థ.. అందులో ఎవరు తప్పు చేసినా.. ఆ వ్యవస్థ అధిపతికే ఆ కళంకం అంటుంది. వ్యవస్థ అద్భుతాలు చేసినా ఆ క్రెడిట్ అధిపతికే వస్తుంది. మన ప్రజాస్వామ్యంలో సీఎం పాత్ర కూడా అలాంటిదే.. ప్రభుత్వంలో ఎవరు ఏం చేసినా జనం మాత్రం ముఖ్యమంత్రినే కోట్ చేసి మాట్లాడతారు. అందుకే కొన్నిసార్లు అధికారులు చేసే తప్పులకు కూడా ముఖ్యమంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఏపీలో రంగనాయకమ్మ అనే 65 ఏళ్ల మహిళ తన ఫేస్ బుక్ లో ప్రభుత్వాన్ని విమర్శించిందని.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. విచారణకు పిలిపించారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఓ పోస్టు ఫేస్ బుక్ లో పెట్టారు. దీంతో సీఐడీ ఆమెపై కేసు పెట్టింది. ఆమె సీఐడీ ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. సీఐడీ ఆమె పాత పోస్టుల గురించి కూడా అడిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు సమస్య ఇక్కడ ఆమె పెట్టిన పోస్టు గురించి కాదు.. కానీ 65 ఏళ్ల వృద్ధురాలు పెట్టిన పోస్టును సీరియస్ గా తీసుకుని సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపితే.. తెలుగుదేశం అనుకూల ఛానళ్లు ఊరుకుంటాయా.. ఈ ఇష్యూను అందిపుచ్చుకున్నాయి. రోజంతా ఈ రంగనాయకమ్మ గురించి ఆమెకు జరిగిన అన్యాయం అంటూ కథనాలు కుమ్మేశాయి. విపక్షాల నేతలు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఆమెను పరామర్శించారు. ఈ విషయం జగన్ సర్కారుకు చెడ్డపేరు తెచ్చేదే కానీ.. ఏమాత్రం ఉపయోగపడదు. గతంలో టీడీపీ సర్కారులో ఇలా జరిగినప్పుడు ప్రజాస్వామ్యవాదులంతా వైసీపీ సానుభూతి పరులవైపు నిలిచారు. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే.. తేడా ఏముంటుంది..?

అమెరికాపై కరోనా దెబ్బ మామూలుగా లేదుగా..! ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే..?
అమెరికాపై కరోనా దెబ్బ మామూలుగా లేదుగా..! ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే..?

కరోనా రాక్షసి ప్రపంచాన్నే వణికిస్తోంది. దీని దెబ్బతో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. మరి కొన్ని లక్షల ఉద్యోగాలు హాంఫట్ అయ్యాయి. అనేక రంగాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కరోనా దెబ్బకు చివరకు అమెరికా వంటి దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా వెలువడిన గణాంకాలు ఈ విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. మన ఇండియన్లు చాలా మంది ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తుంటారు. కానీ కరోనా దెబ్బతో అమెరికాలోనూ నిరుద్యోగం ఘోరంగా పెరిగిందట. అంటే.. కరోనా దెబ్బ అమెరికాపై చాలా తీవ్రంగా పడినట్లే కనిపిస్తోంది. కరోనా సమస్య మొదలైన తర్వాత వరసగా తొమ్మిదో వారం కూడా లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారట. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అమెరికా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు సాక్షాత్తూ అమెరికాలోని లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారట. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను బట్ట ఉంటుందన్నమాట. అయితే ఇటీవల ట్రంప్ సర్కారు కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రభుత్వం ద్వారా ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా చెబుతోంది. అందుకే ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇలా మొత్తం నిరుద్యోగుల సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరువైందన్నమాట.

జగన్ సొంత నియోజక వర్గానికి ఎన్ని వరాలో చూశారా..? తక్కువవాడేం కాదు సుమా..?
జగన్ సొంత నియోజక వర్గానికి ఎన్ని వరాలో చూశారా..? తక్కువవాడేం కాదు సుమా..?

రాజకీయ నాయకులన్నాక స్వార్థం ఉంటుంది. ఉండాలి కూడా. అది లేకపోతే.. తనను నమ్మి ఓట్లేసిన వారికి న్యాయం చేయలేరు. అయితే ముఖ్యమంత్రి వంటి స్థాయికి వెళ్లాక ఇక సొంత ప్రాంతం అంటూ ఏమీ ఉండదు. రాష్ట్రమంతా సొంత ప్రాంతమే. అయినా సరే. తన సొంత నియోజక వర్గంపై ఏదో ఒక మూల ప్రత్యేక ఆదరణ ఉంటుంది. సీఎం జగన్ కూడా అంతే. అందుకే ఆయన పులివెందులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి సొంత నియోజక వర్గానికి జగన్ ఏం వరాలు కురిపించాడో చూద్దాం.. పులివెందుల మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి ఈ సంవత్సరంలోగా మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అరటి రీసెర్చ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇక జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. ఈ నెలాఖరుకల్లా జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తిచేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని ఆదేశించారు. వేంపల్లి మండలంలోని అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పీబీసీ కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీమ్‌కు పాలనాపరమైన అనుమతుల మంజూరుకు సీఎం ఆదేశించారు. పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. దేవుని కడప చెరువు సుందరీకరణ, రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు ఆదేశించారు. రిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కేన్సర్‌ ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, సైకియాట్రీ ఆస్పత్రులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

మా టీడీపీ వాళ్లు చేసే ఈ దీక్షలు వృథా.. అసలెందుకు చేస్తున్నారు.. ఓ సీనియర్ అసహనం..?
మా టీడీపీ వాళ్లు చేసే ఈ దీక్షలు వృథా.. అసలెందుకు చేస్తున్నారు.. ఓ సీనియర్ అసహనం..?

తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులను వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. చాలా చోట్ల 12 గంటల దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్షలకు ఓ ఎజెండా అంటూ ఏమీ లేకుండాపోయింది. ఎందుకంటే.. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నది తెలుగు దేశం ఆరోపణ. కానీ.. అవి రెండు నెలల బిల్లులు కదా అంటోంది సర్కారు. అయితే సర్కారు గుట్టుచప్పుడు కాకుండా కరెంట్ చార్జీలు పెంచేసిందని ప్రచారం చేస్తోంది. ఏకంగా పెంచిన చార్జీలు తగ్గించాలంటూ ఉద్యమం చేస్తోంది. అయితే దీన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీలోని విలక్షణ నేత.. మీడియాకు మిత్రుడు అయిన జేసీ దివాకర్ రెడ్డి కూడా ఈ దీక్షలను తప్పుబట్టారు. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని దివాకరరెడ్డి మండిపడ్డారు. అంతే కాదు.. తరచూ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసే దివాకర్ రెడ్డి ఈసారి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. జెసి దివాకరరెడ్డి ఈసారి ముఖ్యమంత్రి జగన్ ను మెచ్చుకోవడమే కాదు అదే సమయంలో టిడిపి దీక్షలను తప్పు పట్టారు. కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వడానికి జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జేసీ మెచ్చుకున్నారట. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారట అంతే కాదు.. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారట. ఇది నిజంగా చంద్రబాబుకు మంట పుట్టించే వ్యాఖ్యలే. ఎందుకంటే పోతిరెడ్డి పాడు తానే పూర్తి చేశానని ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జేసీ ఇలాంటి కామెంట్లు చేస్తే పాపం.. చంద్రబాబు ఏమైపోవాలి..?

సినీ కార్మికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి..?
సినీ కార్మికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి..?

కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్లు, డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్ల సంగతి బాగానే ఉంది కానీ.. సగటు సినీ కార్మికుడు మాత్రం లాక్ డౌన్ కారణంగా నలిగిపోతున్నాడు. రెండు నెలలుగా పనులు లేక.. పస్తులుండాల్సిన పరిస్థితి. సినీ రంగంలో అంతా బావున్నప్పుడే వారికి దొరికే ఉపాధి అంతంత మాత్రం. అలాంటిది.. ఏకంగా రెండు నెలలుగా పని లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే వీరిని ఆదుకునేందుకు సినీరంగం కాస్త ప్రయత్నం చేస్తోంది. చిరంజీవి ఆధ్వర్యంలోని సీసీసీ కొంత వరకూ ఆదుకుంది. ఇలాంటి సమయంలో ఓ తెలంగాణ మంత్రి తన సొంత నిధుల నుంచి కార్మికులను ఆదుకుంటానని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయనే సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించడం సంతోషదాయకమనే చెప్పాలి. సినీపరిశ్రమలో లాక్ డౌన్ సంక్షేమం గురించి చర్చించేందుకు వచ్చిన మంత్రి.. ఆ తర్వాత స్వయంగా ఈ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి మంత్రి అన్నమాట నిలబెట్టుకుంటే 14 వేల కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసే అవకాశం ఉంది. అలాగే తెలుగు చలన చిత్రపరిశ్రమ సమస్యలను త్వరగా పరిష్కరించి షూటింగులకు అనుమతి ఇస్తే.. కళాకారులు, కార్మికులు చాలా వరకూ సంతోషిస్తారు. జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

మీడియా మంటలు: మోడీ, జగన్, కేసీఆర్.. ఈ పత్రికలపై స్పందిస్తారా..?
మీడియా మంటలు: మోడీ, జగన్, కేసీఆర్.. ఈ పత్రికలపై స్పందిస్తారా..?

అందరి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చే సాధనం మీడియా.. మీడియాలో ఓ అంశం గురించి ప్రముఖంగా వచ్చిందంటే.. ప్రభుత్వాలు కదులుతాయి. ప్రజాసంఘాలు కదులుతాయి. సమాజంలోనే కదలిక వస్తుంది. చివరకు అది ప్రజాసంక్షేమానికి దారి తీస్తుంది. అందుకే మీడియాను ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం అంటారు. మొదటి మూడు స్తంభాలుగా చెప్పుకునే వ్యవస్థలన్నీ ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటే.. ఈ నాలుగోస్తంభమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటుంది. అలాంటి మీడియా ఇప్పుడు తన సమస్య గురించి తానే సుప్రీంకోర్టుకు విన్నవించుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఈ సమస్య ఏంటంటే.. మొండి బకాయిలు. అందులోనూ ఈ బకాయిలు ప్రభుత్వాలు చెల్లించాల్సినవే. అనేక ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వాలు ప్రచారం కోసం పత్రికలకు ప్రకటనలు ఇస్తాయి. కానీ ఆ ప్రకటనలకైన సొమ్ములు మాత్రం వెంటనే విడుదల చేయవు. అలా వివిధ ప్రభుత్వాలు బకాయి పడిన మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 1800 కోట్లట. ఈ విషయాన్ని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ వ్యాప్తంగా మీడియాకు కేంద్రం, ఆయా రాష్ట్రాలు పడ్డ బకాయిలు భారీగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం మీద కేంద్రంకాని, రాష్ట్రాలు కాని మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయట. అంతే కాదు.. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ ఒక అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు కు వివరించింది. కరోనా కష్టకాలంలో ఈ బకాయిలు చెల్లిస్తే తాము కాస్త నిలదొక్కుకోగలుగుతామని విన్నవించుకుంటోంది. మరి వీరి విజ్ఞప్తిని అధికారపీఠాల్లో ఉన్న నరేంద్రమోడీ, జగన్, కేసీఆర్ ఆలకిస్తారా.. మోడీ సంగతి ఎలా ఉన్నా.. జగన్, కేసీఆర్ స్వయంగా పత్రికల యజమానులు కూడా. మరి వారైనా అర్థం చేసుకుని ఆదుకుంటారా..చూడాలి.. !

డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ... చంద్రబాబు కొత్త అస్త్రాలు ఇవేనా...?
డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ... చంద్రబాబు కొత్త అస్త్రాలు ఇవేనా...?

ఏపీ సీఎంపై పోరాటానికి చంద్రబాబు కొత్త అస్త్రాలు బయటకు తీశారు. అవే వైద్యుడు సుధాకర్ కేసు, రంగనాయకమ్మకు సీఐడీ నోటీసుల అంశం. నర్సీపట్నం మత్తు వైద్యుడు సుధాకర్ విషయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని హైకోర్టు కూడా టేకప్ చేయడంతో దీనిపై మరింత దృష్టి సారించారు. ఓ వైద్యుడిని వేధిస్తోందన్న అంశాన్ని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే కొత్తగా రంగనాయకమ్మ కేసును కూడా హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారన్న అభియోగం పై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ మీద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పోస్టింగ్ పెట్టారంటూ రంగనాయకమ్మకు సీఐడీ సీఐ దిలీప్ కుమార్ నోటీసును అందజేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, సామాజిక మాధ్యమాల్లో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే సీఐడీ నోటీసులిస్తుందా అని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి విమర్శలను స్వీకరించే స్థితిలో లేరన్నారు. ఏదో ఒకరోజు ఆయన తన అహంకారపూరిత చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు అంటున్నారు. ఇక తెలుగుదేశం నేతలు స్వయంగా రంగనాయకమ్మను స్వయంగా కలిసి మద్దతు తెలిపారు. అయితే గతంలో చంద్రబాబు హయాంలో ఎందరో సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయించి.. పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పించిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అలా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఎవరిపైన కేసు పెట్టడానికి వీలు లేదని చెప్పడం విడ్డూరం అంటున్నారు. మరి చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రెండు కొత్త అస్త్రాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో.

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...