వెస్టిండీస్ తో నేడు చెన్నై వేదికగా జరుగుతున్న తొలివన్డేలో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. మొదట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేయగలిగింది. చాలాకాలం నుండి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ (69 బంతుల్లో 71, 7 ఫోర్లు, 1 సిక్సర్) ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (88 బంతుల్లో 70, 5 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనించాడు. కేదార్ జాదవ్ (40) కూడా చివరిలో కాస్త బాగా ఆడాడు.