టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండగా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, సంగీత, వెన్నెల కిషోర్, సుబ్బరాజు,