ప్రాంతంతో సంబంధం లేకుండా, వయసు గురించి కనీస ఆలోచన లేకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఆడబిడ్డలను చెరపడుతున్నారు. దిశ హత్య ఉదంతం, అనంతరం హంతకుల ఎన్కౌంటర్ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే సమయంలో పలు సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం లైంగిక దాడి కేసుల్లో చాలా తక్కువ మందికే శిక్షలు పడుతున్నాయి. సుమారు 70 శాతం లైంగిక దాడి కేసులు కోర్టుల వరకు వెల్లడం