దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, ఎన్కౌంటర్ ఘటనలో కలకలం కొనసాగుతోంది. నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై, ఆ తర్వాత పాశవికంగా పెట్రోల్ పోసి చంపబడ్డ దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఎదురుకాల్పులా లేక బూటకపు ఎన్కౌంటరా అన్నది తేలాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రిటైర్డ్ సుప్రీం న్యాయమూర్తితో ఎంక్వైరీకి న్యాయస్థానం ప్రతిపాదించింది.అయితే, ఇదే తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరు వివ