తనదైన శైలిలో ఆసక్తికర పరిణామాలతో వార్తల్లో నిలిచే మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ అదే రకమైన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కారు. జేసీ బీజేపీ గూటికి చేరుతారని, ఆయనతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. ఎంపీ సుజనాచౌదరి నివాసానికి వెళ్లారని, అక్కడ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జేపీ నడ్డాతో భేటీ అయ్యారనే వార్తలు రాజకీయంగా సంచలనం రేపాయి. దాదాపు గంటపాటు