దేశంలో మహిళలు, పసి పిల్లలపై లైంగిక దాడులు, హత్యలు జరిగినప్పుడు అయా ప్రభుత్వాలు, పార్టీలు, మహిళా సంఘాలు, మీడియా స్పందించే తీరులోనూ సామాజిక వివక్ష కొనసాగుతున్నది. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు సమాజంలో అందిరిని ఒకే కోణంలో చూడడం లేదు. అణగారిన వర్గాలకు చెందిన మహిళలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా, ఉన్నత వర్గాలపై జరిగినప్పుడు మరో రకంగా పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియా స్పందిస్తున్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ (14-16)లో కుల, మత, జాతి, లింగ, వర్ణ భేదం లేకుండా అందిరికీ సమ న్యాయం కల్ప