సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, విమర్శలు.. ఇదీ వరుస.. ఇలాంటి అసెంబ్లీలో ఓ అద్భుతమైన సాహితీ ప్రసంగం వినగలమా.. పుస్తకాల గురించి.. సాహిత్యం గురించి, భాష గొప్పదనం గురించి ఓ చక్కటి ప్రసంగాన్ని ఊహించగలమా.. కానీ అది వాస్తవమే అని నిరూపించారో వైసీపీ ఎమ్మెల్యే. ఆయనే భూమన కురణాకర్ రెడ్డి.
సాహిత్యాన్ని బాగా ఇష్టపడే భూమన కరుణాకర్ రెడ్డి ఆంగ్ల మాధ్యమం పై చర్చ సమయంలో ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. భాషపట్ల ప్రేమ ఉన్నవాళ్లు కూడా మనుగడ కోసమని ఆంగ్లమాధ్యమం యొక్క అవసరాన్ని గుర్తించవలిస