తెలంగాణ అధికారులు, ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు అందించిన ఆదేశాలను అమలు చేయడంలో వారు చూపుతున్న నిర్లక్ష్యం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టుగా ఉండడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం, ‘‘మా ఆదేశాలను, ఉత్తర్వులను అధికారులు ఎలా అమలు చేయాలో మీరు నేర్పిస్తారా? లేక మమ్మల్ని నేర్పించమంటారా?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం.