శ్రీవిష్ణుసహస్రనామం భీష్ముడు లోకానికి ప్రసాధించిన మహత్తర కానుక స్వచ్ఛంద మరణవరం కలిగిన భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ అంపశయ్యపై వుండగా, శ్రీకృష్ణుడు ఆయనను అనుగ్రహించదలిచి, ధర్మరాజాదులతో సహా భీఫ్ముని చెంతకు వచ్చాడు. వాసుదేవుని అనుగ్రహంతో భీష్ముడు రాజ్యపాలన చేయవలసివున్న ధర్మరాజుకి రాజనీతిని బోధించాడు. తన ప్రియ మనుమడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు భీష్ముడిచ్చిన సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుని వేయినామాలతో భీష్మ పితామహుడు గానం చేశాడు. అవే శ్రీ విష్ణు సహస్రనామాలయ్యాయి. ఒక్కోక నామం భగవంతుని కళ్యాణ గుణాలను, ప్రతిభను, మహత్తత్వాన్ని వెల్లడిస్తుంది. ప్రతి పేరూ ఒక సందేశాన్ని మానవాళికి అందిస్తుంది. మానవునిలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపి, జీవితంలో ప్రగతిని సాధించమని ప్రేరేపిస్తుంది. బీష్మ ఏకాదశి పర్వధినానా ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కలిగి ఇష్టకామ్యసిద్ధి జరుగుతుందని చెప్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: