ఇండియన్ మార్కెట్ లో మారుతి సుజికి హవా మనకు తెలిసిందే.. బడ్జెట్ కార్ గా మారుతి ఎప్పటి నుండో కస్టమర్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ కారణం చేత మారుతి మరికొంత భాద్యతను తమ కస్టమర్స్ సాటిస్ ఫాక్షన్ కోసం చేపట్టేందుకు రెడీ అయ్యింది. 


ప్రస్తుతం 1820 డీలర్ షిప్ ఉన్న మారుతి ఇంకా దాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తుంది. 1470 సిటీస్ లో కలిగిన ఈ షోరూం అవుట్ లెట్స్ ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంలోనే 2020 కల్లా 4000 అవుట్ లెట్స్ ప్రారంభించే దిశగా పనిచేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యచరణలు మొదలు పెట్టినట్టు మారుతి సుజుకి ఎక్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్.ఎస్.కాల్సి చెప్పారు.    


అంతేకాదు రానున్న రోజుల్లో మారుతి సుజుకి నుండి మరో 15 కొత్త మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. మరి వారనుకున్నట్టు 2020 కల్లా 4000 ల అవుట్ లెట్స్ సాధ్యమయ్యేనా కాదా అన్నది చూడాలి. తమ కస్టమర్స్ ను మెరుగైన సేవలందించే ప్రయత్నంగా మారుతి తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకోవడం జరిగింది.    


మరింత సమాచారం తెలుసుకోండి: