టాటా మోటో కార్ప్ నుండి వచ్చిన సరికొత్త వెహికల్ టాటా టియాగో.. రిలీజ్ చేసిన నెలలోనే ఈ కార్ గురించి అత్యధికంగా లక్ష మంది కస్టమర్స్ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారట. ఇదే విషయాన్ని వెళ్లడిస్తూ టాటా పాసెంజర్ వెహికల్ యూనిట్ ఎం.డి నకుల్ గుప్తా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


అంతేకాదు టాటా కొత్త ఉత్పత్తి అయిన టియాగో మీద కస్టమర్స్ మంచి నమ్మకంతో ఉన్నారని. ఈ వెహికల్ ప్రి బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్స్ సామర్ధ్యంతో వస్తున్న ఈ వాహనాలు 3.30 లక్షలు, 3.90 లక్షలు రేటు ఫిక్స్ చేయబడింది.


ఇక పెట్రిల్ వెహికల్స్ కు 1.2 లీటర్స్ థ్రీ సిలిండర్ కెపాసిటీ గల ఎంజిన్స్ ఉండగా.. డీజిల్ వెహికల్స్ కు 1.05 లీటర్స్ థ్రీ సిలిండర్ రివోటార్క్ ఉంటుంది. బెస్ట్ ఎకనమీ బెస్ట్ మైలేజ్ తో మధ్యతరగతి వాహనంగా టాటా ఈ టియాగో వెహికల్ ను రూపొందించడం జరిగింది. 


మరి కొత్త కార్ కొత్త టెక్నాలజీతో ప్రయాణం చేయాలనుకునే కస్టమర్స్ కు ఈ సరికొత్త టాటా టియాగో మంచి అనుభూతిని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటికి టాటా సరికొత్త కార్ తెచ్చుకునేందుకు దగ్గరలో ఉన్న డీలర్ దగ్గర ఈ కార్ బుక్ చేసుకోండి.  
    


మరింత సమాచారం తెలుసుకోండి: