బ్రిటిష్ ఆటోమేకర్స్ నుండి మరో వెహికల్ ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. లక్సరియస్ కార్లకు చిరునామాగా ఉన్న బెంట్లీ వెహికల్స్ ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ అత్యున్నత లక్సరీయస్ వెహికల్స్ లో ఒకటిగా ఉన్న బెంట్లీ వెహికల్స్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అవడం జరిగింది.


ఢిల్లీలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలోనే తమ సెకండ్ షోరూం ముంబైలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. బెంట్లీ బెంటేగా వెహికల్ తో మొదలుపెడుతున్న తమ ఉత్పత్తులను మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ అవుట్ లెట్స్ ఉండేలా చూస్తున్నారు. 


ఇక ఈ కార్ విలువ సుమారు రెండున్న కోట్ల నుండి మూడు కోట్ల దాకా ఉండొచ్చని అంచనా.. వి.వి.ఐ.పి క్యాడర్లో ఉన్న వారు, దేశంలో అధిక సంపన్నులకు ఈ వాహనం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దిల్లిలో ప్రారంభమైన ఈ షోరూం త్వరలోనే హైదరాబాద్ లో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు నిర్వాహకులు.  ఇక  ప్రీ బుకింగ్స్ లో బెంట్లీ బెంటేగా కార్ అదరగొడుతుంది. అత్యాహిక 360 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కల ఈ కార్ త్వరలో మన దగ్గర కూడా అందుబాటులో రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: