వాహనదారుల ఆలోచనలు, ఊహల మేరకు వాల్వో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ వెహికల్స్ ను ఈ సంవత్సర నుండి అంబాటులోకి తీసుకురాబోతున్నారు. కొత్త హైబ్రిడ్ వెహికల్ గా ఎక్స్.సి-90 ను మొదటసారి మార్కెట్ లోకి వాల్వో రిలీజ్ చేయడం జరుగుతుంది. యూరప్ లో తయారుచేయబడుతున్న ఈ వెహికల్స్ ను ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు.   


ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న డీజిల్ హైబ్రిడ్ వర్షన్ ను ఎక్స్.సి-90 పెట్రోల్ తో కూడా అనుసంధానం కలిగేలా.. అంటే పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్స్ ను రెడీ చేస్తున్నారు. ఎక్స్.సి-90 టి8 ఇంజిన్ మోడల్ తో మొదటి పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ గా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. సెవన్ సీటర్ కెపాసిటీ కల ఈ వెహికల్ రెండు లీటర్ల పెట్రోల్ సామర్ధ్యం కల టర్బో చార్జెడ్ ను అందుబాటులో ఉంచుతుంది.   


పెట్రోల్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కి పవర్ జెనరేట్ అవ్వడంతో పాటుగా 80 బి.ఎహ్.పి ఎలెక్ట్రిక్ మోటర్ గల వెనుక వీల్స్ కు అందించడం జరుగుతుంది. ఇక ఎక్స్.సి-90 వెహికల్ మూడు రకాలుగా అందుబాటులోకి వస్తుంది.. వాటిలో మోమంటం, ఆర్-డిజైన్ అండ్ ఇన్స్ క్రిప్షన్ వస్తాయి. ఇక ఈ మోడల్ ప్రస్తుతం 68వేల డాలర్స్ నుండి 71వేల డాలర్స్ వరకు ప్రైజ్ చార్జ్ చేయబడుతుంది. మరి విలాసవంతమైన కార్ కావాలనుకునే వారికి ఈ కొత్త వాల్వో హైబ్రిడ్ ఎక్స్.సి 90 వహికల్ ఎంతో సౌకర్యవంతంగా తమ అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: