భారతీయ వాహన రంగంలో మారుతి సుజికి తన ఉనికి చాటుకుంటూ వస్తుంది.. బడ్జెట్ కార్ గా మారుతి  ఏళ్ళనాటి నుండి కస్టమర్స్ యొక్క అభిరుచుక మేరకు మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ కారణం చేత మారుతి మరికొంత భాద్యతను తమ కస్టమర్స్ సాటిస్ ఫాక్షన్ కోసం చేపట్టేందుకు రెడీ అయ్యింది.  


దేశం మొత్తం మీద ఇప్పటిదాకా 1820 డీలర్ షిప్ ఉన్న మారుతి వాటిని విస్తరించేందుకు ప్రణాళికలు రంగం సిద్ధం చేస్తుంది. మొత్తం మీద ఇప్పటిదాకా 1470 సిటీస్ లో కలిగిన ఈ షోరూం అవుట్ లెట్స్ ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంలోనే 2020 కల్లా 4000 అవుట్ లెట్స్ ప్రారంభించే దిశగా పనిచేస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టినట్టు మారుతి సుజుకి ఎక్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్.ఎస్.కాల్సి చెప్పారు.    


అంతేకాదు మారుతి సుజుకి నుండి మరో 15 కొత్త మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా రానున్న రోజుల్లో రాబోతున్నాయని వెల్లడించారు. మరి వారనుకున్నట్టు 2020 కల్లా 4000 ల అవుట్ లెట్స్ సాధ్యమయ్యేనా కాదా అన్నది చూడాలి. తమ కస్టమర్స్ ను మెరుగైన సేవలందించే ప్రయత్నంగా మారుతి తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకోవడం జరిగింది.      



మరింత సమాచారం తెలుసుకోండి: